Thursday, April 17Welcome to Vandebhaarath

Zika virus | దేశంలో జికా వైరస్ కేసుల కలకలం.. ఈ మహమ్మారికి ఇలా చెక్ పెట్టండి

Spread the love

Zika virus | వ‌ర్షాకాలం మొద‌లు కాగానే దోమ‌లు విజృంభిస్తున్నాయి. డెంగీ, మ‌లేరియా వంటి విష‌జ్వ‌రాలు వ్యాపిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన జికా వైర‌స్ కేసులు భార‌త్ లో న‌మోదు కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ వైర‌స్‌ కేసులు మహారాష్ట్రలో ఎక్కువ‌గా న‌మోదవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కీల‌క సూచ‌న‌లు జారీ చేసింది. అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని విష‌జ్వ‌రాల‌పై నిరంతర నిఘా ఉంచాల‌ని చెప్పింది. గర్భిణీ స్త్రీలపై దృష్టి పెట్టాల‌ని, జికా వైరస్ సోకిన గర్భిణుల పిండం ఎదుగుదలను నిశితంగా పరిశీలించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

జికా వైరస్ అంటే ఏమిటి?

1947లో ఉగాండాలో మొట్టమొదట జికా వైరస్ ను కనుగొన్నారు.  ఏడెస్ అనే దోమ ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది.  ఈ ప్రాణాంతక వైరస్ పేరు ఉగాండాలోని జియాకా అడవి నుంచి వచ్చింది. ఇక్కడే దీన్ని గుర్తించారు. ఇది చికున్‌గున్యా, డెంగ్యూల మాదిరిగానే వ్యాపిస్తుంది.  ఇప్పటివరకు, జికాను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి టీకా అందుబాటులో లేదు.

READ MORE  ‘Naya Kashmir’ Bills | పీవోకే ముమ్మాటికీ మనదే.. 24 సీట్లు రిజర్వ్‌ చేశాం : అమిత్‌ షా

మహారాష్ట్రలో ఇటీవలే ఏడు జికా వైరస్ కేసులు నమోదయ్యాయి – డెంగ్యూ, చికున్‌గున్యా వంటివి ఏడిస్ దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. అయితే జికా వైర‌స్ ప్రాణాంతకం కానప్పటికీ గ‌ర్భిణుల‌కు ఇది సోకితే పుట్టిన పిల్ల‌లు మైక్రోసెఫాలీ వంటి ల‌క్ష‌ణాలు క‌లిగి ఉంటారు. అంటే శిశువులలో తల ఊహించిన దాని కంటే చాలా చిన్నగా ఉంటుంది. వీరి మాన‌సిక ఎదుగుద‌ల ఉండ‌దు.. జీవితాంతం మాన‌సిక దివ్యాంగులుగా మారే ప్ర‌మాదం ఉంటుంది. జికా వైరస్ లక్షణాలను, నివార‌ణ చ‌ర్య‌ల గురించి ఒక‌సారి చూడండి.

జికా వైరస్ లక్షణాలు (zika virus symptoms):

జికా వైరస్ సోకిన చాలా మందికి వెంటనే లక్షణాలు కనిపించవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, వైరస్ సోకిన 3-14 రోజుల తర్వాత, సాధారణంగా తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి. అవి సాధారణంగా రెండు నుంచి ఏడు రోజుల వరకు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా కింది ల‌క్ష‌ణాలు చూడ‌వ‌చ్చు.

  • దద్దుర్లు
  • జ్వరం
  • కండ్లకలక
  • కండరాలు, కీళ్ల నొప్పులు
  • అనారోగ్యం
  • తలనొప్పి
READ MORE  dengue Fever: దోమలతో నిండిన బ్యాగ్‌ తో ఆస్పత్రికి.. షాకైన.. డాక్టర్లు, సిబ్బంది..

జికా వైరస్ తో వచ్చే సమస్యలు

  • WHO ప్ర‌కారం.. ” గర్భధారణ సమయంలో జికా వైరస్ సోకడం అనేది శిశువులో మైక్రోసెఫాలీ, పాటు ఇతర వైకల్యాలకు కార‌ణ‌మ‌వుతుంది. అవయవ సంకోచాలు, అధిక కండరాల స్థాయి, కంటి స‌మస్య‌లు, వినికిడి లోపం వంటివి త‌లెత్తే ప్ర‌మాదం ఉంది.
  • గర్భిణీ స్త్రీలలో జికా ఇన్ఫెక్షన్ గ‌ర్భ‌స్రావం, మృతశిశువు, ముందస్తు జననం” వంటి సమస్యలను కలిగిస్తుంది.
  • ఇది ముఖ్యంగా పెద్దలు, పెద్ద పిల్లలలో గ్విలియన్-బారే సిండ్రోమ్, న్యూరోపతి, మైలిటిస్‌కు కారణమవుతుంది.

జికా వైరస్ ఎలా వ్యాపిస్తుంది..

  • జికా వైరస్ గర్భధారణ సమయంలో, లైంగిక సంపర్కం, అవయవ మార్పిడి సమయంలో తల్లి నుంచి పిండానికి సంక్రమిస్తుంది.
  • ఇది ప్రధానంగా ఈడెస్ జాతికి చెందిన సోకిన దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ దోమలు సాధారణంగా పగటిపూట కుట్టడంతోపాటు డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవ‌ర్ వంటి వ్యాధుల‌ను వ్యాపింప‌జేస్తాయి.

జికా వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులో ఉందా?

లేదు. జికా వైరస్ ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించడానికి ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు.

మీరు ఏం చేయాలి (zika virus prevention) ?

  • ఏదైనా కేసును గుర్తించిన వెంటనే ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడిఎస్‌పి), నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్-బోర్న్ డిసీజెస్ కంట్రోల్ (ఎన్‌సివిబిడిసి)కి వెంటనే స‌మాచారం అందించాల‌ని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
  • దోమలు చిన్న నీటి కుంట‌ల్లో సంతానోత్పత్తి చేస్తాయి కాబట్టి, ముఖ్యంగా గృహాలు, పాఠశాలలు, ఆసుపత్రుల చుట్టూ ఈ దోమ‌లు వృద్ధి చెంద‌కుండా చూడ‌డం చాలా ముఖ్యం. దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు పూల కుండీలు, మొక్కలు, కంటైనర్లు, కాల్వ‌లు, కుంట‌ల్లో నీరు నిల్వ ఉండ‌కుండా చూడాలి.
READ MORE  PM Modi : అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

గర్భిణీ స్త్రీలకు చిట్కాలు

గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో జికా సోకకండా అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం.  గర్భిణీ స్త్రీలు సోకిన దోమల బారిన పడకుండా తగిన దుస్తులు ధరించాి.  మీ ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు మీ దుస్తులపై దోమలు వాలకుండా mosquito repellents ఉపయోగించండి. మెరుగైన రక్షణ కోసం DEET, పికారిడిన్, టీ ట్రీ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ వంటి ప్రభావవంతమైన పదార్థాలతో దోమలను నియంత్రించండి. Zika వైరస్ అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గించడానికి అవసరం లేకుంటే ఆరుబయట వెళ్లడం మానుకోండి.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *