
Uttar Pradesh | : పొరుగు దేశమైన నేపాల్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. దేశ రాజధాని ఖాట్మండు వీధుల్లోకి వేలాది మంది వచ్చి యూపీ సీఎం ప్లెక్సీ ఉన్న పోస్టర్లను ప్రదర్శిస్తూ ర్యాలీలు చేస్తున్నారు. హిందూత్వ అనుకూల మాజీ రాజు జ్ఞానేంద్ర షా (Raja Gyanendra Shah) తిరిగి రావడంతో, హిందూ దేశం కోసం డిమాండ్ తీవ్రమైంది. నేపాల్‌లో దాని మద్దతుదారులు రాజుతో పాటు యోగి ఫొటోలతో కూడిన జెండాలను ఎగురవేస్తూనినాదాలు చేశారు.
ఉత్తరప్రదేశ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న నేపాల్ (Nepal) లో కొన్నేళ్లుగా రాజకీయాలు మారిపోయాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు హిందూ సనాతన ధర్మానికి అనుకూలంగా నిలబడ్డారు. చైనా అనుకూల మావోయిస్టు ఉద్యమం 2006లో రాజు జ్ఞానేంద్ర పాలనను ముగించిందని నమ్ముతారు. దీని తర్వాత నేపాల్‌లో వామపక్షాలు పాలించాయి. పుష్ప కమల్ దహల్ ప్రచండ తర్వాత, కె.పి. శర్మ ఓలి ఆ బాధ్యతలను స్వీకరించారు. ఇప్పుడు మళ్లీ హిందూ రాజ్యం (hindu rashtra) తిరిగి రావడం గురించి వార్తలు వినిపిస్తున్నాయి.
Yogi Adityanath : యోగీ జెండాలను ఊపుతూ ప్రదర్శనలు
నేపాల్‌ను మళ్లీ హిందూ దేశంగా మార్చాలని జ్ఞానేంద్ర షా (Raja Gyanendra Shah) చాలా కాలంగా నేపాల్‌లోని వివిధ ప్రాంతాలలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన పోఖారా నుండి ఖాట్మండు చేరుకున్నారు, త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయటకు రాగానే షా మద్దతుదారులు అక్కడ భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ర్యాలీలో చాలా షాకింగ్ సంఘటన జరిగింది. కొంతమంది యువకులు రాజా జ్ఞానేంద్ర షాతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లను ఊపుతూ కనిపించారు.
ఇదిలా ఉండగా రాజా జ్ఞానేంద్ర షా గత జనవరి నెలలో ఉత్తరప్రదేశ్ ను సందర్శించారు. మీడియా నివేదికల ప్రకారం, ఈ సమయంలో ఆయన యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కూడా కలిశారు. ఆ యువకులు యోగి చిత్రంతో పాటు రాజా జ్ఞానేంద్ర చిత్రం, జాతీయ జెండాను పట్టుకుని మోటార్ సైకిళ్లపై ప్రదర్శన ఇచ్చారు. అయితే, యోగి ఫోటో వాడకాన్ని ప్రధాన మంత్రి కెపి ఓలి విమర్శించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.