అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అధిక జనాభా నగరాలు, పట్టణాల్లో వాహనదారులు తరచుగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తారు. వాహనాన్ని అతివేగంతో నడపడం,రాంగ్ రూట్లో దూసుకెళ్లడం, హెల్మెట్ ధరించకపోవడం వంటివి నిత్యం సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఇలాంటి వారి వల్ల చాలాసార్లు ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా ఫలితం ఉండడం లేదు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని బైక్ రైడర్ హెల్మెట్ ధరించినప్పుడు మాత్రమే ట్రాఫిక్ లో గ్రీన్ లైట్ వెలిగేలా ప్రత్యేకమైన హైటెక్ ట్రాఫిక్ లైట్లను తయారు చేశారు. తాజాగా ఈ ట్రాఫిక్ లైట్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. చూడగానే ఈ వీడియో వాస్తవికంగా అనిపించకపోగా, గ్రాఫిక్స్ సహాయంతో రూపొందించినట్లు అనిపించినా, ఈ వీడియో ద్వారా చూపించిన సరికొత్త కాన్సెప్ట్ ప్రశంసించదగ్గదే..
ఇటీవల ట్విట్టర్ ఖాతా @TansuYegenలో ఒక వీడియో పోస్ట్ వైరల్ అయింది. ఇందులో ప్రత్యేకమైన ట్రాఫిక్ లైట్ (Traffic Light Viral Video) గురించి ఉంది.
ఈ ట్రాఫిక్ లైట్ ప్రత్యేకత ఏంటంటే.. రోడ్డుపై నిలబడిన ప్రతీ బైక్ రైడర్ హెల్మెట్ ధరించినప్పుడు మాత్రమే ట్రాఫిక్ లైట్ ఎరుపు నుంచి ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. లైట్ పక్కన భారీ స్క్రీన్ కనిపిస్తుంది. దానిపై హెల్మెట్ ధరించని బైక్ రైడర్ వీడియో కూడా డిస్ల్పే అవుతుంది.
హెల్మెట్ పెట్టుకోని వాహనదారుల వీడియోలు తెరపై కనిపిస్తాయి. స్క్రీన్‌పై తమను తాము చూసుకొని ఇబ్బందిగా ఫీల్ అవుతూ పడి హెల్మెట్ పెట్టుకుంటున్నారు. హెల్మెట్ పెట్టుకుంటే తప్ప గ్రీన్ లైట్ వెలగడం లేదు.. దీంతో వాహనదారులు సైతం ముందుకు వెళ్లలేకపోతున్నారు. అలాంటి భావన ప్రజలకు చాలా అవసరం. ఈ వీడియో కాన్సెప్ట్ బేస్డ్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఇందులో మనకెంతో ఉపయోగకరమైన విషయాలు ఉన్నాయి.
ఎక్స్(ట్విట్టర్) లో ఈ వైరల్ వీడియోకి 70 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. చాలా మంది నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. సీటు బెల్టులు, హెల్మెట్‌లు ధరించే ఇతర డ్రైవర్లను శిక్షించాల్సిన అవసరం లేదని ఇలాంటి ఫీచర్ ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటే సరిపోతుందని ఓ యూజర్ అన్నారు.
No helmet no green light👏 pic.twitter.com/hvEVTuyE26
— Tansu YEĞEN (@TansuYegen) September 18, 2023