మరో అద్భుత కళాత్మక నిర్మాణం యశోభూమి.. దీని ప్రత్యేకతలు ఏమిటీ?

మరో అద్భుత కళాత్మక నిర్మాణం యశోభూమి.. దీని ప్రత్యేకతలు ఏమిటీ?
  • ఢిల్లీలో అంతర్జాతీయస్థాయ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో  సెంటర్
  • 8 అంతస్తుల్లో కన్వెన్షన్ హాళ్లు, బాల్ రూం, మీటింగ్ హాల్స్
  • 8.9లక్షల చదరపుమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన కేంద్రం
  • 17న ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభం

న్యూఢిల్లీ : అత్యంత ఆకర్షణీయ నిర్మాణాలు, పర్యాటక క్షేత్రాలకు నిలయమైన ఢిల్లీలో మరో అద్భుత నిర్మాణం యశోభూమి (YashoBhoomi) అందుబాటులోకి వస్తోంది. సెప్టెంబరు 17వ తేదీ ఆదివారం నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ యశోభూమి పేరుతో నిర్మించిన అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించి, దేశానికి అంకితం చేయనున్నారు. ఇది ఫేజ్ 1 ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసిసి) ‘అని పిలుస్తారు.

దేశంలో సమావేశాలు, ప్రదర్శనలను నిర్వహించేందుకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ప్రధానమంత్రి ఆలోచనతో ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది.

READ MORE  Lok Sabha Elections Key contests : మొద‌టి ద‌శ పోలింగ్‌ ప్రారంభం.. 102 సెగ్మెంట్ల‌లో ప్రముఖుల జాబితా ఇదే..

మొత్తం 8.9 లక్షల చదరపు మీటర్ల ప్రాజెక్ట్ వైశాల్యం, మొత్తం 1.8 లక్షల చదరపు మీటర్ల కంటే ఎక్కువ బిల్ట్ అప్ ఏరియాతో, YashoBhoomi ప్రపంచంలోనే అతిపెద్ద MICE (మీటింగ్‌లు, ప్రోత్సాహకాలు, సమావేశాలు ప్రదర్శనలు) సౌకర్యాలలో తన స్థానాన్ని పొందుతుంది.

YashoBhoomi

యశోభూమి ప్రత్యేకతలు ఇవీ..

  • యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్టు విస్తీర్ణం  8.9 లక్షల చదరపు మీటర్లు.. బిల్ట్ అప్ ఏరియా 1.8 లక్షల చదరపు మీటర్లు. కన్వెన్షన్ సెంటర్ ను సుమారు 73,000 చదరపు మీటర్లకుపైగా వైశాల్యంలో నిర్మించారు.
  •  యశోభూమి మొత్తం ప్రాజెక్టులో ప్రధాన ఆడిటోరియంతో సహా మొత్తం 15 కన్వెన్షన్ హాళ్లు, ఒక బాల్ రూమ్, 13 మీటింగ్ రూమ్ లు ఉన్నాయి.
  • అన్ని గదులలో కలిపి ఒకేసారి 11,000 మంది ఆసీనులు కావొచ్చు.
  • 6,000 మంది అతిథులు సౌకర్యవంతంగా కూర్చునేలా ప్రధాన ఆడిటోరియం(ప్లీనరీ హాల్) ను నిర్మించారు. ఆటోమేటెడ్ సీటింగ్ సిస్టమ్ ఉంటుంది.
  •  అత్యంత ఆకర్షణీయమైన సీలింగ్ తో  ఆకట్టుకుంటున్న బాల్ రూం మ్ సీటింగ్ సామర్థ్యం 2,500. ఇక్కడే మరో 500 మంది కోసం ఓపెన్ ఏరియా కూడా ఉంది.
  •  1.07 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో ఎగ్జిబిషన్ హాళ్లు ఉన్నాయి.
  •  మీడియా రూమ్స్, వీవీఐపీ గదులు, విజిటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్, టికెటింగ్ కౌంటర్లను  ఏర్పాటు చేశారు.
  • పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఇక్కడ వర్షం నీటిని, మురుగు నీటిని శుద్ధి చేసుకొని మళ్లీ ఉపయోగించుకునే ఏర్పాట్లు కూడా ఉన్నాయి.
  • సౌర విద్యుత్ కోసం రూప్ టాప్ సోలార్ ప్యానళ్లను బిగించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో భారతీయ సంస్కృతి, కళలకు పెద్దపీట వేశారు.
  • యశోభూమి కన్వెన్షన్ సెంటర్ భారత పరిశ్రమల సమాఖ్యకు చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) నుంచి గ్రీన్ సిటీస్ ప్లాటినమ్ సరిఫికేషన్ పొందింది.
READ MORE  BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. ఐదేళ్లు ఉచిత రేషన్, పైపులైన్ ద్వారా వంట గ్యాస్

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *