Thursday, November 14Latest Telugu News
Shadow

Yadadri MMTS | వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్.. త్వరలో యాదాద్రికి ఎంఎంటీఎస్ రైళ్లు..

Yadadri MMTS | వరంగల్‌లో త్వరలో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వే వ్యాగన్లు, కోచ్‌లు, ఇంజన్లు తయారు చేయాలనేదే ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. అలాగే గ్రేటర్ పరిధిలోని ఎంఎంటీఎస్ సేవలను యాదాద్రి వరకు పొడిగించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో సమావేశమైయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోపాటు రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, ఎంపీలు కావ్య, రఘనందన్ రావు, డీకే అరుణ లు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో పాల్గొన్న‌ ఎంపీలు వారి నియోకవర్గాల పరిధిలో జరుగుతున్న రైల్వే పనులు, చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టుల‌పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో పనులు వేగంగా కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్ ప‌నులు, ఎలక్ట్రిఫికేషన్ పరిధిలో జరగుతున్నాయన్నారు.

READ MORE  Telangana Road ways | మోదీ 3.0 100 రోజులప్రణాళికలో తెలంగాణకు రెండు నేషనల్ హైవేస్..

యాదాద్రి వ‌ర‌కు ఎంఎంటీఎస్ లైన్‌

Yadadri MMTS : రానున్న రోజుల్లో వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేలో 40 రైల్వే స్టేషన్ల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వివ‌రించారు. రూ.430 కోట్లతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్త‌య్యాయ‌ని చెప్పారు. గ్రేట‌ర్ ప‌రిధిలో ఎంఎంటీఎస్ లైన్ ప్రస్తుతం ఘ‌ట్ కేస‌ర్ వరకు ఉంది దానిని రాయగిరి, యాదాద్రి వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నామని కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు.ఈ ఏడాది రూ.6వేల కోట్ల బడ్జెట్ మంజూరు అయిందని తెలిపారు. ప‌నులు పురోగ‌తిలో ఉన్నాయని తెలిపారు.

READ MORE  IRCTC News | రైలు ప్రయాణికులకు శుభవార్త: ఇక నుంచి క్షణాల్లోనే టిక్కెట్ బుకింగ్

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *