Tuesday, April 22Welcome to Vandebhaarath

watch| కదులుతున్న బస్సులో చెప్పుల‌తో కొట్టుకున్న మ‌హిళ‌లు..

Spread the love

Bengaluru | బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) బస్సులో ఇటీవల షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దీనికి సంబంధించిన‌ వైరల్ ఫుటేజీలో, ఇద్దరు మహిళా ప్రయాణీకులు తీవ్రంగా వాగ్వాదానికి దిగారు.. చివ‌ర‌కు మాటామాటా పెరిగి చెప్పులతో దాడి చేసుకునేవ‌ర‌కు వెళ్లింది. అయితే ఇప్పటి వరకు, సంఘటన ఖచ్చితమైన తేదీ తెలియదు.. మహిళలు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తుంది. పరిస్థితిని సద్దుమణిగించేందుకు తోటి ప్రయాణికులు ప్రయత్నించినప్పటికీ ఆ మ‌హిళ‌లు వినిపించుకోలేదు. ఈ వింత ఘటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.

READ MORE  Snake Crazy Viral: పామును పట్టుకొని బొమ్మలా ఆడుకున్న చిన్నారి.. అందర్నీ షాక్ గురి చేసిన వీడియో

Bengaluru లోని BMTC బస్సులో ఒక మహిళ కిటికీ అద్దం తెరవడంతో గొడవ ప్రారంభమైందని, అయితే అది వెనుక సీట్లో ఉన్న మ‌హిళ‌కు అసౌకర్యాన్ని కలిగించిందని తెలుస్తోంది. దీంతో మహిళలిద్దరూ చెప్పులు తీసి ఒకరినొకరు కొట్టుకోవడంతో ఘర్షణ తీవ్రమైంది. బస్సులో ఉన్న ప్రయాణికులు జోక్యం చేసుకుని, ఇద్ద‌ర్నీ గొడ‌వ ఆప‌మ‌ని బస్సు కండక్టర్‌ను కోరారు. ఎట్టకేలకు కండక్టర్ ఇద్దరు మహిళలను బయటకు వెళ్లమని చెప్పడంతో గొడవకు తెరపడింది. వీడియోను పంచుకుంటూ, X వినియోగదారు ఇలా రాశాడు, “బెంగళూరులో బస్సులో మహిళలు ఒకరినొకరు చెప్పులు కొట్టుకున్నారు. కదులుతున్న BMTC బస్సులో ఇద్దరు మహిళా ప్రయాణికులు కిటికీ అద్దాలు తెరిచే క్ర‌మంలోవాగ్వాదం జ‌రిగింది.వివాదం ముదిరి ఒకరినొకరు చెప్పులతో కొట్టుకోవడం ప్రారంభించారు. అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

READ MORE  Boy Returns As Monk | 22 ఏళ్ల క్రితం తప్పిపోయి సన్యాసిగా మారి.. భిక్ష కోసం తల్లి వద్దకు.. కన్నీళ్లు పెట్టించిన వీడియో

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *