Posted in

కొడుకు కాలేజీ ఫీజు కోసం బస్సు కిందపడి ప్రాణాలను తీసుకున్న మహిళ

woman kills herself for child
Spread the love

తమిళనాడులో హృదయవిదారక ఘటన

సృష్టిలో తల్లి ప్రేమ మందు ఏదీ సాటిరాదు. తన పిల్లల కోసం ఏం చేయడానికైనా మాతృమూర్తులు వెనుకాడరు. చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేస్తారు. తన కొడుకు కాలేజీ ఫీజులను సమకూర్చేందుకు ఓ మహిళ ఉద్దేశపూర్వకంగా బస్సు కింద పడి ప్రాణాలను తీసుకుంది. పిల్లల ఫీజుల కోసం తనను తాను చంపుకోవడం హృదయాలను కలిచివేసింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన దృశాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడులో ఓ మహిళ తన కుమారుడి చదువు కోసం డబ్బు సమకూర్చేందుకు బస్సు కిందకు వచ్చి ఆత్మహత్య చేసుకుంది. సేలం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో ‘సఫాయి కర్మచారి’ (క్లీనింగ్ స్టాఫ్)గా పనిచేస్తున్న ఒక మహిళ ఉద్దేశపూర్వకంగా బస్సు ముందు దూకినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో కనిపిస్తుంది.

యాక్సిడెంట్‌లో చనిపోతే తన కుటుంబానికి రూ.45,000 అందజేస్తానని ఎవరో ఓ వ్యక్తి తప్పుదోవ పట్టించడంతో ఆ మహిళ ఈ అనాలోచిత నిర్ణయం తీసుకుందని సమాచారం. కుమారుడి కాలేజీ ఫీజు కట్టేందుకు డబ్బు అత్యవసరం కావడంతో ఆ మహిళ తన జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

హెచ్చరిక: కింది వీడియోలో వీక్షకులకు ఇబ్బంది కలిగించే విజువల్స్ ఉండవచ్చు. 

విద్యా వ్యవస్థపై విమర్శలు

ఈ వీడియో నెటిజన్లను కదిలించింది. వీడియోను ట్వీట్ చేసిన వ్యక్తులతో పాటు ట్విట్టర్ వినియగదారులు ఈ సంఘటనపై ఓ వైపు తమ బాధను, మరోవైపు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొడుకు ఫీజు కట్టినందుకు ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితిని పలువురు ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి భవిష్యత్తు కోసం తమ పిల్లలను చదివించేందుకు పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఈ ఘటన ఎత్తి చూపుతోంది. పలువురు నెటిజన్లు విద్యావ్యవస్థపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని రిపోర్టులు చెబుతున్నాయి.

మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఆత్మహత్యలవైపు ఆలోచిస్తున్నారా? అయితే మీకు సాయం చేసేందుకు కింది నెంబర్లకు కాల్ చేయండి
|

woman kills herself for child

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *