Kompella Madhavi Latha | హైదరాబాద్‌లో ఒవైసీపై నిప్పులు చెరిగిన బీజేపీ, మాధవి లత కొంపెల్లా ఎవరు?

Kompella Madhavi Latha | హైదరాబాద్‌లో ఒవైసీపై నిప్పులు చెరిగిన బీజేపీ, మాధవి లత కొంపెల్లా ఎవరు?

Kompella Madhavi Latha | హైద‌రాబాద్ లోక్ స‌భ స్థానం కైవ‌సం చేసుకునేందుకు బీజేపీ త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టింది. ఇక్క‌డ ఆరు ప‌ర్యాయాలు ఎంపీగా విజ‌యం సాధించిన తిరుగులేని నేత‌గా ఉన్న ఏఐఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీపై పోటీగా పాత‌బ‌స్తీకి చెందిన అగ్నికణం వంటి  కొంపెల్ల మాధ‌వీల‌త‌ను బీజేపీ అధిష్ఠానం బ‌రిలో నిలుపుతోంది. అయితే హైద‌రాబాద్ స్థానానికి  49ఏళ్ల మాధ‌వీల‌త‌ను  ఎంపిక చేయ‌డానికి కార‌ణ‌మేంటి? హైదరాబాద్‌లోని ప్రఖ్యాత హాస్పిటల్స్‌లో ఒకటైన విరించి హాస్పిటల్స్‌కు ఆమె చైర్మన్‌గా ఉన్నారు.ఆమె గురించిన అనేక ఆసక్తికరమైన విషయాలు ఇపుడుతెలుసుకుందాం..

డాక్టర్ గా, సామాజికవేత్తగా ..

కొంపెల్ల మాధవీలత ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. పాతబస్తీలో పుట్టి పెరిగిన మాధవీలత .. నిజాం కళాశాల నుండి బ్యాచిలర్ డిగ్రీ, కోటి మహిళా కళాశాల నుండి పొలిటిక‌ల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె ఎన్ సీసీ కేడెట్‌. మాధ‌వీల‌త గొప్ప భరతనాట్య కళాకారిణి. వంద‌కు పైగా నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. హైద‌రాబాద్ లో ప్ర‌ముఖ ఆస్ప‌త్రులో ఒక‌టైన‌ విరించి హాస్పిటల్స్ యజమానిగా అంద‌రికీ సుప‌రిచితం. ఆమె మధు సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ అనే ఐటీ సేవల సంస్థతో పాటు అమెరికాలో ‘క్యూ ఫండ్‌’ అనే ఫిన్‌ కార్ప్ ను నిర్వ‌హిస్తున్నారు.మాధ‌వీల‌త భర్త విశ్వనాథ్ కూడా వ్యాపారవేత్తే.

READ MORE  BJP Manifesto | రేపే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల.. ఏయే హామీలు ఉండనున్నాయి..?

మాధవీలత.. లోపా ముద్రా ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పాతబస్తీ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేప‌డుతున్నారు. మురికివాడ‌ల్లో వైద్య‌శిబిరాలు నిర్వ‌హిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేయ‌డం కుట్టుశిక్ష‌ణ కేంద్రాలు ఏర్పాటు చేసి పేద మహిళలకు శిక్షణనిచ్చి, వారికి తగిన ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ప్రజ్ఞాపూర్ స‌మీపంలో 4 లక్షల చదరపు అడుగుల్లో భారీ గోశాలను నిర్మించి దేశవాళీ ఆవులను పరిరక్షించుకోవాలని ప్రచారం చేస్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి సమయంలోనూ ప్రతిరోజు వేలాది మందికి ఉచిత‌ భోజనాన్ని ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌న గొప్ప మ‌న‌సును చాటుకున్నారు. నిర్విరామంగా త‌న సేవ‌ల‌తో స్థానికంగా మంచిపేరు తెచ్చుకున్నారు మాధ‌వీల‌త‌. అటు సాధుసంతులతో సమావేశాలు నిర్వ‌హించ‌డం, ధార్మిక ప్రవచనాలు ఏర్పాటు చేయించి పాతబస్తీలోని హిందూ ఓటర్లలో చైతన్యాన్ని కలిగిస్తున్నారు.

ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా పోరాటం..

మాధవీల‌త (Kompella Madhavi Latha)కు రాజ‌కీయ నేప‌థ్యం లేదు. ఆమె పూర్వికులు, కుటుంబ‌స‌భ్యులు రాజ‌కీయాల్లో లేరు. ఆమె కూడా ఎన్న‌డూ కూడా చురుకైన రాజకీయ నాయకురాలు కొన‌సాగ‌లేదు. కానీ ఆమె త‌న సేవా కార్య‌క్ర‌మాల ద్వారా నిత్యం పేద ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు. మాధవి లత ట్రిపుల్ తలాక్ రద్దుపై అనేక ముస్లిం మహిళా సంఘాలతో పోరాడుతున్నారు. ఓల్డ్ సిటీ ప్రాంతాలలో ఈ అంశంపై ఎన్నో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

READ MORE  రాష్ట్రంలో భారీ వర్షాలతో 16 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

మాధవి లత నిరుపేద ముస్లిం మహిళల కోసం ఒక చిన్న నిధిని కూడా సృష్టించారు. ఫోరమ్ ఫర్ అవేర్ నెస్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, సంస్కృతీ తెలంగాణ స్టేట్ వంటి సంస్థలతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆమె ఒక గోశాలను కూడా నిర్వ‌హిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలలో హిందుత్వ, భారతీయ సంస్కృతిపై తరచుగా ప్రసంగాలు చేస్తుంటారు.

అయితే ఓల్డ్ సిటీలో హిందువులందరినీ హిందుత్వ బంధంలో కలిపేయాలనే లక్ష్యం తనకు ఉందని గ‌తంలో ప్ర‌క‌టించారు. నిన్న‌నే మాధవి లత హైద‌రాబాద్‌ లోక్‌సభ టిక్కెట్టు ల‌భించ‌డంతో ఈ పాత వీడియో మ‌ళ్లీ వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లోని హిందువులందరి మధ్య ఐక్యత నెలకొనాలనేది నా కల అని ఆ వీడియోలో కుండబ‌ద్ద‌లు కొట్టారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..

READ MORE  400కిలోల బరువుతో ప్రపంచంలోనే అతిపెద్ద బాహుబలి తాళం..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *