కాశ్మీర్ లోయలో అడుగుపెట్టిన అత్యాధునిక WhAP వాహనం
WHAP Vehicle : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కోసం భారత ఆర్మీ తాజాగా అత్యాధునిక WHAP Vehicle ను రంగంలోకి దించింది. ఈ WHAP వాహనానికి (Wheeled Armored Amphibious Platform ) భూమి, నీరు, అలాగే చిత్తడి నేలలు, సరస్సులు, మడుగులపై నుంచి కూడా ప్రయాణించే సత్తా కలిగి ఉంటుంది. ఈ వాహనాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), TATA సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇందులో డ్రైవర్‌తో సహా 12 మంది సైనికులను తీసుకెళ్లవచ్చు.
బాంబు పేలుళ్లు, బులెట్ల వర్షాన్ని తట్టుకునే సత్తా..
‘వీల్డ్ ఆర్మర్డ్ యాంఫిబియస్ ప్లాట్‌ఫాం’ (WHAP) బుల్లెట్ల వర్షం, బాంబు పేలుళ్లు, రాకెట్‌లను సైతం తట్టుకోగల ఒక బలిష్టమైన యంత్రం. ఇది శక్తివంతమైన 600-హార్స్పవర్ ఇంజన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, అలాగే ఖచ్చితమైన షూటింగ్ కోసం 7.62 mm రిమోట్ కంట్రోల్డ్ వెపన్ స్టేషన్ (RCWS)ని కలిగి ఉంది.
భారతదేశంలోనే దీనిని తయారు చేశారు. భూమి, నీరు, చిత్తడి నేలలు లేదా ఎత్తైన పర్వత శ్రేణులు అయినా ఏదైనా భూభాగంలో నడుస్తుంది. వాహనం బరువు 24 టన్నులు, 8 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్. ఇది నదులలో నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్లగలదు. దీని లోపల ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది. ఇది రిమోట్- కంట్రోల్ ఆయుధ వ్యవస్థను కలిగి ఉంది. ఇది లక్ష్యాలను కచ్చితంగా టార్గెట్ చేస్తుంది. ఈ వాహనం స్మోక్ బాల్స్‌ను కూడా ప్రయోగించగలదు” అని CO CRPF శీష్‌పాల్ చెప్పారు.
“ఇది ఆటోమేటెడ్ టైర్-ఇన్‌ఫ్లేషన్ సిస్టమ్, MMG (మీడియం మెషిన్ గన్)ను కాల్చడానికి రిమోట్-కంట్రోల్ వెపన్ సిస్టమ్ (RCWS)ని కలిగి ఉంది. దీనికి ఆటోమేటిక్ గ్రెనేడ్ లాంచర్ కూడా ఉంది” అని పాల్ తెలిపారు. వాహనం నీటిలో గంటకు 8-10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సాధారణ భూభాగంలో ఇది గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లుంది. భారత సైన్యానికి 2022లో లడఖ్ తూర్పు సెక్టార్‌లో మోహరించిన సైనికులకు ఇదే వాహనాన్ని అందించారు.
శత్రు మూకలకు దీటైన జవాబు..
ఈ వాహనం కఠినమైన యుద్ధ సమయాల్లో శత్రు మూకలను తరిమికొట్టేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. భారత సైన్యంలోని ఇన్‌ఫాంట్రీ ప్రొటెక్టెడ్ మొబిలిటీ వెహికల్ (IPMV) మాదిరిగా కాకుండా CRPF కు చెందిన WHAP వాహనం వాటర్ జెట్‌లతో కూడిన సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇది నీటి అడ్డంకులను దాటుతుంది. ఈ ఆరు చక్రాల WHAP వాహనాలు రెండు ఇప్పటికే కాశ్మీర్ (Jammu Kashmir)కు చేరుకుని దక్షిణ కాశ్మీర్‌లో మోహరించబడ్డాయి. కాశ్మీర్ లోయలో తమ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో ఇది గొప్ప సహాయకారిగా ఉంటుందని CRPF చెబుతోంది.
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.