Horoscope | వార ఫలాలు.. 12 రాశులవారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోండి..

Horoscope | వార ఫలాలు.. 12 రాశులవారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోండి..

Horoscope | ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 ఏప్రిల్ 14 ఆదివారం నుంచి ఏప్రిల్ 20 శనివారం వరకు ఈ వారం రోజుల్లో  రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు

మేష రాశి (Aries)

మేష రాశి వారి (Mesha Rashi) కి ఈ వారంలో శరీరము బరువు పెరగడం ఒక సమస్యగా మారుతుంది. ఇతరుల మీద మీరు చూపించే ప్రేమ ఆరాటం వల్ల కొంత నష్టపోతారు. విద్యార్థులు అధిక శ్రమ చేయవలసిన సమయం. Function Halls నడిపే వారికి మంచి లాభాలు ఉంటాయి. కోపాన్ని మరియు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ ముక్కుసూటితనంతో ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. స్త్రీల కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. మీ Sixth Senseతో రాబోయే సమస్యలను ముందుగానే పసిగడతారు. పోలీస్ శాఖ వారికి పదోన్నతులు ఉండను. దూర ప్రాంత ప్రయాణములు వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన కారణం ప్రయాణాలలో అనారోగ్య సమస్యలు వచ్చును. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కొనసాగుతాయి. Sugar వ్యాధితో బాధపడుతున్న వారు జాగ్రతగా వుండాలి. దైవారాధన మీ మానసిక ప్రశాంతతకు కారణమవుతాయి. అప్పు కొంతమేర తీర్చగలుగుతారు. లలిత అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

వృషభ రాశి (Taurus)

వృషభ రాశి (Vrishabh Rashi) వారికి ఈ వారంలో విద్యార్థులకు అనుకూలమైన సమయం. సంతాన భవిష్యత్తుకై ప్రణాళికను సిద్ధం చేస్తారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త పాటించాలి. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ నమ్మకస్తులైన వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మీ తెలివితేటలతో శత్రువుల మీద విజయం సాధిస్తారు. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. నిర్ణయాలు తీసుకునే విషయంలో నిలకడైన ఆలోచన విధానం లేకపోవడం వలన ఇబ్బంది పడే అవకాశాలు కలవు. ప్రతి చిన్న విషయానికి ఇతరుల మీద కోపగించుకోవడం అంత మంచిది కాదు. మీ జీవిత భాగస్వామితో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగి సఖ్యత బలపడుతుంది. Software ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉండును. నూతన వ్యాపారాన్ని ప్రారంభించిన వారికి యోగ కాలము. సోమరితనంతో పనులు వాయిదా వేయకూడదు. మంచి మనసుతో ఇతరులకు సహాయం చేస్తారు. ధనపరమైన ఇబ్బందులు కొంత తగ్గుముఖం పడతాయి. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన.

మిధున రాశి (Gemini)

మిధున రాశి (Midhun Rashi)  వారికి ఈ వారంలో కళా రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. తల్లితండ్రుల నుంచి వచ్చే ఆస్తి విషయంలో సోదరీ సోదరులతో సంప్రదింపులు జరిపే అవకాశాలు కలవు. ఆర్థికపరమైన ఎదుగుదల మానసిక ప్రశాంతతని ఇస్తుంది. పండ్ల వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉండను. ప్రభుత్వానికి సంబంధించిన పనులు తొందరగా పూర్తవుతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు తమ ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. చెయ్యని తప్పుకి అపనింద పడవలసి వస్తుంది. నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం విషయంలో ఆవేశంతో కాకుండా ఓర్పుగా వ్యవహరించాలి. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. మీ జీవిత భాగస్వామికి సంబంధించిన తగాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Panchangam 2024 | ఈ వారం 12 రాశులవారికి ఏయే ఫలితాలు ఉంటాయి?

కర్కాటక రాశి (Cancer)

కర్కాటక రాశి (Karkatak Rashi)  వారికి ఈ వారంలో స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు తమ లక్ష్యాన్నికి చేరుకోగలుగుతారు. ధనపరమైన ఇబ్బందులు మీ మానసిక ఆందోళనకు కారణమవుతాయి. ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. జ్యోతిష్య రంగంలో ఉన్న వారికి పురోగతి ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజల నుంచి కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. మీ జీవిత వ్యాపార భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలుగుతాయి. శరీరంలో దాగి ఉన్న అనారోగ్య సమస్య నిర్ధారణ అవుతుంది. నూతన గృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. Textile వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. అసంతృప్తి భోజనం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యం ఆడకూడదు. సంకల్పించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. Real Estate వ్యాపారస్తులకు నూతన వ్యక్తుల పరిచయాలు లాభాని చేకూరుస్తాయి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదని సూచన.

సింహ రాశి ( Leo )

సింహ రాశి (Simha Rashi) వారికి ఈ వారంలో సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు యోగ కాలము మరియు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. మీ జీవిత భాగస్వామికి Joints & Muscle pains ఒక సమస్యగా మారుతుంది. బంధుమిత్రులతో వైరం అంత మంచిది కాదు. Pharmacy వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. Administration రంగంలో ఉన్నవారికి పదోన్నతులు ఉండును. కొన్ని పనులు తండ్రి సహాయంతో పూర్తిచేస్తారు. శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. మీ జీవిత భాగస్వామితో సరదాగా కాలాన్ని గడుపుతారు. బాకీలు వసలవుతాయి. సోదరీ సోదరులతో సఖ్యత బలపడుతుంది. నూతన విద్యను అభ్యసించడానికి యోగ కాలము. ఆర్థికపరమైన ఇబ్బందులను ఉండును. నూతన వ్యాపారానికి అధిక పెట్టుబడులు పెట్టవలసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి శుభ ఫలితాలు ఉండును. దుర్గ దేవి ఆరాధన చేయడం చెప్పదని సూచన.

కన్య రాశి (Virgo)

కన్య రాశి (Kanya Rashi) వారికి ఈ వారంలో సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంగారం కొనుగోలు చేసే అవకాశాలు కలవు. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. ఇతరులకు సలహాలు సూచనలు ఇవ్వగలుగుతారు. Media రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు యోగ కాలము. పాల వ్యాపారస్తులు అధిక లాభాలను పొందగలుగుతారు. అనవసరమైన కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. శరీరంలో వేడి పెరగడం వలన ఇబ్బంది పడే అవకాశాలు కలవు. విదేశీ ప్రయత్నాలు చేసే విద్యార్థులకు బ్యాంకు లోన్స్ మరియు వీసా మంజూరు అవుతుంది. Travel Agency వారికి ఆదాయం పెరుగుతుంది. పితృదేవతల ఆశీస్సులు మరియు దైవానుగ్రహం ఉంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. సోదరీ సోదరులతో చర్చలు నిర్వహిస్తారు. చండి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

తులా రాశి (Libra)

తులా రాశి (Thula Rashi) వారికి ఈ వారంలో విద్యార్థులకు విద్య యందు ఆటంకములు ఎదురవుతాయి. పెద్దల నుంచి ధన సహాయము ఎల్లవేళలా ఉంటుంది. ఉద్యోగస్తులు వృత్తి యందు ఉన్న మానసిక వత్తిడిని ధైర్యంగా అధిగమించాలి. చెడు స్నేహములకు దూరంగా ఉండండి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యం అవుతాయి. తగదాల జోలికి పోవడం వలన అవమానములు ఎదుర్కోవలసి వస్తుంది. మీ ఎదుగుదలను చూసి తల్లితండ్రుల ఆనందిస్తారు. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చును. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. పంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. ఏ నిర్ణయమైనా ఆత్మవిశ్వాసంతో తీసుకుంటారు. వెండి వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. నూతన విద్యను అభ్యసించడానికి యోగ కాలము. వివాహ ప్రయత్నాలు చేసే వారికి శుభవార్త వింటారు. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదని సూచన.

READ MORE  Weekly Horoscope: ఏ రాశులవారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసా..

వృశ్చిక రాశి (Scorpio)

వృశ్చిక రాశి (Vrichik Rashi) వారికి ఈ వారంలో విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలుగుతారు. నూతన ఆదాయం మార్గాలను అన్వేషించాలి. బద్ధకంతో పనులను వాయిదా వేసుకోకూడదు. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి కంఠస్వరంతో ప్రజలను ఉద్రేక పరుస్తారు. Hairfall ఒక సమస్యగా మారుతుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ సంతాన ప్రవర్తనను చూసి ఆనందిస్తారు. దాంపత్య పరమైన సౌఖ్యం ఉంటుంది. ఏ నిర్ణయమైనా స్థిరత్వంతో తీసుకోవాలి. దూరప్రాంత ప్రయాణములు వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి యోగ కాలము. చలి జ్వరంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. చంచలమైన మనసుతో శత్రువులను కూడా చేరదీస్తారు. ధనపరమైన ఇబ్బందులు ఉండును. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేసుకుంటారు. గణపతి ఆరాధన చేయడం చెప్పదని సూచన.

ధనస్సు రాశి (Scorpio)

ధనస్సు రాశి (Dhanu Rashi) వారికి ఈ వారంలో మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు యోగ కాలము. Court కేసులకు సంబంధించిన పనులు వాయిదా పడతాయి. Jewellery వ్యాపారస్తులకు అధికమైన జనాకర్షణ ఉంటుంది. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. సంతాన భవిష్యత్తు గురించి ఆందోళనకు గురవుతారు. మీ పిల్లలతో కలహం అంత మంచిది కాదు. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తొలగి సఖ్యత బలపడుతుంది. వృద్ధులు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కలవు. శుభకార్యాల నిర్వహించే అవకాశం కలదు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ధనాన్ని పొదుపు చేసుకోవలసిందిగా చెప్పదగిన సూచన. అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కలవు. అన్ని విధాల అదృష్టం తోడవుతుంది. సంతాన ప్రయత్నాలు చేసే వారికి ఇబ్బందులు ఉండను. మీ నమ్మకస్తులు మీకు ద్రోహం చేసే అవకాశాలు కలవు. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదని సూచన.

మకర రాశి (Capricorn)

మకర రాశి (Makar Rashi) వారికి ఈ వారంలో తండ్రి చేసే వృత్తి వ్యాపారాలు చేసే వారికి యోగ కాలము. విద్యార్థులు అధిక శ్రమ చేయవలసిన సమయం. శ్వాసకోశ అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. మీ జీవిత భాగస్వామితో legal issues వచ్చే అవకాశాలు కలవు. మధ్యవర్తిత్వాలు చేసే వారికి లాభం చేకూరుతుంది. ఏ నిర్ణయం అయినా సాధ్య అసాధ్యాలను చూసి తీసుకోవాలి. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. సోదరీ సోదరులతో సఖ్యత బలపడుతుంది. రెండు విధాల ధనార్జన ఉంటుంది. తండ్రితో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కలవు. బంధుమిత్రులని కలుసుకుని విందు భోజనం చేస్తారు. సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. Food వ్యాపారస్తులకు వ్యాపార భాగస్వాముల వలన నష్టం చేకూరుతుంది. కుటుంబపరమైన కలహాలు ఉండును. కాలభైరవ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Astrology Signs | ఈ వారంలో 12 రాశులవారికి శుభ ఫలితాలు ఇవే..

కుంభ రాశి (Aquarius)

కుంభ రాశి (Kumbha Rashi) వారికి ఈ వారంలో విద్యార్థులు అధిక శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో సరదాగా కాలాన్ని గడుపుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ నాయకత్వ లక్షణాలతో ఒక వర్గాన్ని నడిపించ గలుగుతారు. బంగారం వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. Bank loans మంజురవుతాయి. ఇతరుల మీద Domination చేయడం అంత మంచిది కాదు. సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి. Software ఉద్యోగస్తులకు యోగ కాలము. అజీర్ణంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. తండ్రితో సఖ్యత బలపడుతుంది. ఈ వారంలో ప్రశాంతత లభిస్తుంది. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. సంగీతము మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. ప్రభుత్వ పర్మిషన్స్ మంజూరు అవుతాయి. రక్త సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదని సూచన.

మీన రాశి (Pisces Zodiac)

మీన రాశి (Meena Rashi) వారికి ఈ వారంలో మీ జీవిత భాగస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల యందు సత్ఫలితాలు ఉండను. పిల్లలకు అనారోగ్య సమస్యలు కొంత కుదుటపడతాయి. Food items కి సంబంధించిన వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి. విలాసవంతంగా కాలాన్ని గడుపుతారు. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. ఏ నిర్ణయం అయినా మీ జీవిత భాగస్వామితో చర్చించి తీసుకుంటారు. ఎముకలు మరియు కండరాళ్ల నొప్పి వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. తండ్రితో ఆస్తి తగాదాలు తొలగి ఆస్తి చేతికి వస్తుంది. పాత బాకీలు వసలవుతాయి. ఆవేశంలో ఏలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరితోనైనా స్నేహం చేసే ముందు ఆలోచించి చేయాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదని సూచన.

Weekly Horoscope Signs  By

స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక
డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ

7730023250, 8978510978


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *