Weather Update | తెలంగాణకు చల్లని కబురు.. రెండు రోజులు వానలు
Weather Update | తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. త్వరలో వర్షాలు పడనున్నాయని తెలిపింది. దీంతో మండుటెండల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందని వివరించింది. రాష్ట్రంలో ఈనెల 6 వరకు వాతావర ణం పొడిగానే ఉంటుందని, అయితే ఏప్రిల్ 7, 8వ తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఈనెల 5, 6వ తేదీల్లో వాతావర ణం పొడిగా ఉంటుందని, 7, 8వ తేదీల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా అప్ డేట్ ఇచ్చింది. ,
రాష్ట్రంలో ఈ వేసవి లో బుధవారం మొదటిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో బుధవారం 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా గురువారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
తాజా న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి..
Weather Update ఎల్‌నినో పరిస్థితులు జూన్ చివరి వరకు కొనసాగనుండడంతో ఈ వేసవిలో ఎండలు గరిష్టంగానే ఉంటాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. కాగా ఆదిలాబాద్‌లో 41.3, నిజామాబాద్‌లో 41.2, మెదక్, రామగుండం, నల్లగొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఎండలు, వడగాడ్పులు అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.