Friday, February 14Thank you for visiting

Weather Report | తెలంగాణలో మరో మూడురోజులు ముసురు..

Spread the love

Rains | ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాలు మ‌రో మూడు రోజులు కొన‌సాగ‌నున్నాయి. ఈమేర‌కు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (IMD Weather Report ) వెల్ల‌డించింది. రుతు పవన ద్రోణి జైసల్మేర్‌, రైసేన్‌, చింద్వారా, తూర్పు విదర్భ ప్రాంతంలోనున్న వాయుగుండం కేంద్రం గుండా తెలంగాణ, మచిలీపట్నం మీదుగా వెళ్తుందని.. ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉందని వివ‌రించింది.

READ MORE  శ్రీశైలానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ

దీని ప్ర‌భావంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్ల‌గొండ, సూర్యాపేట, మహబాద్‌, హన్మకొండ, వరంగల్‌, జనగామ‌, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో వ‌ర్షాలు కురిసే చాన్స్ ఉంద‌ని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

READ MORE  మీకు "ఓటర్​ స్లిప్​" ఇంకా అందలేదా? సింపుల్​గా ఇలా పొందండి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..