Nitish Kumar | బీహార్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష గెలిచిన సీఎం నితీశ్..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. ప్రతిపక్షాలు వాకౌట్ చేసినప్పటికీ 130 మంది శాసనసభ్యులు ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. కాగా బీహార్ అసెంబ్లీలో 243 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
JD(U), RJD, కాంగ్రెస్ ఫ్రంట్ అయిన మహాఘటబంధన్ (మహాకూటమి) నుండి నితిష్ కుమార్ BJP నేతృత్వంలోని NDA కూటమిలోకి చేరిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సోమవారం అవిశ్వాస పరీక్షలో నితిష్ గెలిచారు. ఈ సెషన్‌లో ముగ్గురు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) ఎమ్మెల్యేలు ప్రహ్లాద్ యాదవ్, నీలం దేవి, చేతన్ ఆనంద్ ఎన్డీఏలోకి మారారు.
అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. తాను తీసుకొచ్చిన కార్యక్రమాలను ఆర్జేడీ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోందని, 15 ఏళ్లుగా లాలూ ప్రసాద్, రబ్రీ దేవి ప్రభుత్వాలు బీహార్ అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆరోపించారు.
2005లో తాను అధికారంలోకి వచ్చినప్పటి నుండి తన JD(U) ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను కూడా నితిష్ కుమార్ ప్రస్తావించారు “వారు 15 సంవత్సరాలుగా ఏమి చేయలేదు.. సమాజంలోని ప్రతి స్థాయి వారి అభివృద్ధికి నేను కృషి చేశాను. లా అండ్ ఆర్డర్ మెరుగుపడింది, మహిళలు ఇప్పుడు అర్థరాత్రి బయటకు వెళ్లగలిగే పరిస్థితులు వచ్చాయి.
తాను సీఎం అయ్యాక హిందువులు, ముస్లింల మధ్య తగాదాలు ఆగిపోయాయని కుమార్ అన్నారు. “ముస్లింలు తమతో ఉన్నారని అంటున్నారు. కానీ వారు ఏమి చేసారు? వారి పాలనలో హిందువులు ముస్లింల మధ్య చాలా గర్షణలు జరిగాయి. నేను (సీఎం) వచ్చాక అదంతా ఆగిపోయింది’’ అని అన్నారు.
కాగా గతంలో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పార్టీ మారినందుకు నితీశ్ కుమార్‌పై విరుచుకుపడ్డారు. “మొదట, వరుసగా తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా చరిత్రను లిఖించినందుకు మా ముఖ్యమంత్రి (Nitish Kumar)ని నేను అభినందించాలనుకుంటున్నాను . ఒకే టర్మ్‌లో మూడోసారి ప్రమాణస్వీకారం చేసే అద్భుతమైన దృశ్యాన్ని మనం ఎప్పుడూ చూడలేదు’ అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అసెంబ్లీలో అన్నారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..