Thursday, April 3Welcome to Vandebhaarath

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఆటో ఢీకొని ఆరుగురు మృతి

Spread the love

Warangal: వరంగల్‌ జిల్లాలో బుధవారం  తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో  ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. వరంగల్‌ నుంచి ఆటో తొర్రూరు వైపు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సహా.. అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.. అస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు.

స్థానికుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన జరిగిన యాక్సిడెంట్ జరిగిన చోటుకు చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు తేనె విక్రయించే కూలీలని  తెలిసింది. డ్రైవర్ మద్యం మత్తులో లారీ నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ  ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

READ MORE  ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష 

లారీ డ్రైవర్ అజాగ్రత్తతోనే ప్రమాదం : సీపీ రంగనాథ్

వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం గురించి వరంగల్ సీపీ రంగనాథ్ తెలుసుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక పోలీస్ అధికారులతో వివరాలు సేకరించారు. ప్రమాదానికి గురైన ఏడుగురిలో ఆరుగురు మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. సీపీ రంగనాథ్ తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వైపు నుంచి వరంగల్ వైపు వస్తున్న లారీ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం కారణంగానే ఈ భారీ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే తేనె పట్టు అమ్ముకుని జీవనంసాగిస్తున్న వారు ప్రాణాలు కోల్పోయారని వివరించారు.

READ MORE  TGSRTC | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఆ రూట్ లో కొత్త‌గా బ‌స్ స‌ర్వీసులు

మృతుల వివరాలు..

రాజస్థాన్ జైపూర్ కు చెందిన కురేరి సురేష్(50) తేనె వ్యాపారం చేసుకుంటూ ప్రస్తుతం వరం గల్ లేబర్ కాలనీ లో ఉంటున్నాడు. అలాగే జైపూర్ కు చెందిన జబోత్ కురేరి (25), అమిత్ మండల్(20), నితిన్ మండల్(20), రూపచంద్(35), వరంగల్ కరీమాబాద్ ఏసిరెడ్డి నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ భట్టు శ్రీనివాస్ (42) మరణించినవారిలో ఉన్నారు.

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

READ MORE  Mahakumbh Stampede | కుంభ‌మేళాలో 30 మంది మృతి.. యూపీ డీఐజీ కీల‌క ప్ర

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *