Friday, August 29Thank you for visiting

పర్యావరణహిత గణేశుడు… కాగితం విగ్రహాలతో సరికొత్త సంప్రదాయం

Spread the love

Eco Friendly Ganesh Idols : వినాయక చవితి (Vinayaka Chavithi 2025) వచ్చిందంటే రంగు రంగుల విగ్రహాలు, ఊరుగింపులు, భక్తి పారవశ్యంతో పిల్లలు, పెద్దల కేరింతలు మనకు కనిపిస్తాయి. అయితే ఇటీవల పర్యావరణ హితం కోసం కొత్త ఆవిష్కరణలు ముందుకు వస్తున్నాయి. పిల్లలు, యూత్ వినూత్నంగా ఆలోచిస్తున్నారు. మట్టి విగ్రహాలతో పాటు ఇప్పుడు కాగితంతో తయారైన వినాయక విగ్రహాలు కూడా భక్తులను ఆకర్షిస్తున్నా యి. ఈ విగ్రహాలు కేవలం తేలికగా ఉండడమే కాదు, నీటిలో సులభంగా కరిగి ప్రకృతికి హాని కలిగించవు. ఈ విషయాన్ని గ్రహించిన ఓ యవకుడు కాగితంతో గణేష్ విగ్రహాన్ని (Paper Ganesh Idols) అద్భుతంగా తయారు చేశాడు. వరంగల్ జిల్లా (Warangal) 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ కి చెందిన ఇంటర్ విద్యార్థి రావులపల్లి తరుణ్ కుమార్ తయారు చేసిన పేపర్ వినాయకుడు అందరికీ ఆకర్షిస్తున్నాడు. యువత, పర్యావరణ హిత సంఘాలు కాగిత విగ్రహాల తయారీని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా తరుణ్ సూచించాడు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *