Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

బైక్ ల చోరీల్లో ఆరితేరారు.. పలుమార్లు జైలుకెళ్లినా మారలేదు..

Spread the love

ఇద్దరు బైక్ దొంగలను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ (warangal police commissionerate) పరిధిలో ద్విచక్ర వాహనాలు, తాళం వేసి ఉన్న షటర్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సీసీఎస్, మట్వాడా, సుబేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు లక్షల రూపాయల విలువైన తొమ్మిది ద్విచక్రవాహనాలు, రూ1.60లక్షల నగదు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను  క్రైమ్స్ ఏసీపీ మల్లయ్య వెల్లడించారు. మాట్వాడా పోలీసులు అరెస్టు చేసిన వరంగల్ పోచమ్మమైదాన్ కు చెందిన బరిపట్ల  సాయి( 30) మద్యంతో పాటు చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. గతంలో వరంగల్ పోలీస్ కమికషనరప్ పాటు మహబూబాబాద్ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడటంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడిపై గతంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో పీడీ యాక్ట్ నమోదు కూడా నమోదు చేశారు. నిందితుడు గతేడాది ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీకి పాల్పడిన సంఘటనలో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ సంవత్సరంలో జూన్ మాసంలో నిందితుడు, జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు జీవితం అనంతరం కూడా నిందితుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.  మరోసారి..  పార్కింగ్ చేసి ఉంచిన ద్విచక్రవాహనాలతో పాటు, తాళం వేసి ఉన్న షాపులలో చోరీలకు పాల్పడ్డాడు. నిందితుడు మట్వాడ, ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు చొప్పున, హనుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ద్విచక్రవాహనాన్ని చోరీ చేశాడు. అలాగే సుబేదారి, మామూనూర్, హనుమకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు తాళం వేసి వున్న పానాపుల్లో చోరీలు చేశాడు.

మరో ఘటనలో ఒకరి అరెస్టు

హనుమకొండ (Hanmakonda) దీన్ దయాల్ కాలనీ చెందిన బూకరాజు సందీప్ ను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో నిందితుడు సందీప్ హనుమకొండ, పబ్లిక్ గార్డెన్స్ ప్రాంతాల్లో పార్కింగ్ చేసి ఉంచిన ఆటోల్లో చిల్లర డబ్బులు దొంగలించి జల్సాలు చేసేవాడు. చిల్లర డబ్బులతో తన జల్సాలకు సరిపోకపోవడంతో నిందితుడు 2017 నుండి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాటు కరీంనగర్, ఖమ్మం ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు చోరీలకు పాల్పడ్డాడు. పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడు గత మే నెలలో ఖమ్మం జైలు నుంచి విడుదలై మరో మారు వరంగల్, హైదరాబాద్లో తాళం వేసిన వున్న 12 షట్టర్లలో చోరీలతో మూడు ద్విచక్రవాహనాలను ఎత్తుకెళ్లాడు. ఇందులో సుబేదారి. పోలీస్ స్టేషన్ పరిధిలో 7, రఘునాథ్ పల్లి 2. మట్వాడా, హనుమకొండ, ఘన్పూర్లో ఒకటి చొప్పున చోరీ చేశాడు.

అలాగే నిందితుడు హైదరాబాద్ ప్రాంతంలో మూడు ద్విచక్రవాహనాలు చోరీ చేసాడు. ఈ చోరీలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అందిన పక్కా సమాచారంతో నిందితులిద్దరూ చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను విక్రయించేందుకు వరంగల్,హనుమకొండ ప్రాంతాల్లో అనుమానస్పదంగా తిరుగుతుండగా పోలీసులకు చిక్కారు. వీరిని అదుపులోకి తీసుకోని విచారించగా వీరు చేసిన నేరాలను పోలీసుల ఎదుట అంగీకరించారు. అలాగే వీరు ఇచ్చిన సమాచారంలో మిగతా ద్విచక్రవాహనలు, నగదునుతో పాటు ఇతర చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులకు సీపీ అభినందన

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన  డీసీపీ క్రైమ్స్ మురళీధర్, క్రైమ్స్ ఏసీపీ మల్లయ్య, సీసీఎస్ ఇన్ స్పెక్టర్లు సూర్యప్రసాద్, శంకర్నాయక్, మట్వాడా, సుబేదారి ఇన్ స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, షూకూర్, సుబేదారి, మట్వాడా, సిసిఎస్ ఎస్.ఐలు సాంబయ్య, నవీన్ కుమార్, సంపత్ కుమార్,  బాపురావు, ఏఏఓ సల్మాన్ పాషా, ఏఎస్ఐలు తిరుపతి, చంద్రమౌళి, హెడ్ కానిస్టేబుళ్ళు రవికుమార్, మహమ్మర్ఆలీ, వేణుగోపాల్, జంపయ్య, అశోక్, కానిస్టేబుళ్ళు వంశీ, విశ్వేశ్వర్, వినోద్, సదానందం, శ్రీకాంత్, తిరుపతి, హరికాంత్ ను  సీపీ ఏ.వి. రంగనాథ్ (CP Ranganath) అభినందించారు.

 

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *