Vande Metro | వందే మెట్రో రైలు కోచ్‌ల తయారీ కోసం దృఢమైన ఈ కంపెనీ నుంచే..
Vande Metro : భారతీయ రైల్వేల్లో వందేభారత్ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ రైళ్లు సరికొత్త విప్లవాన్ని సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ రైళ్లు విజయవంతం కావడంతో కొత్తగా వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు, వందే భారత్ మెట్రో వేరియంట్లను తీసుకొస్తోంది ఇండియన్ రైల్వేస్.. అతి త్వరలోనే ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. తాజాగా వందేభారత్ మెట్రో రైళ్ల తయారీకి ప్రముఖ స్టీల్ కంపెనీ జిందాల్ (Jindal Stainless Ltd) నుంచి 50 టన్నుల 21ఎల్ఎన్ గ్రేడ్ స్టెయిన్ లెస్ స్టీల్ ను సరఫరా చేసింది.
జిందాల్ స్టెయిన్‌లెస్ లిమిటెడ్ (JSL) భారతీయ రైల్వేలోని వందే మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం హై-ఎండ్ క్వాలిటీ స్టీల్‌ను సరఫరా చేసినట్లు మంగళవారం ప్రకటించింది. కంపెనీ 12 రైలు కోచ్‌ల కోసం సుమారు 50 టన్నుల 21LN గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌ను అందించింది. భవిష్యత్తులో కూడా వందే మెట్రో రైలు సెట్‌లు లేదా అండర్‌ఫ్రేమ్‌ల కోసం ఈ హై-ఎండ్ గ్రేడ్‌ను ఉపయోగించాలని రైల్వే శాఖ నిర్ణయిస్తే తాము మరిన్ని మెటీరియల్‌లను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు JSL వెల్లడించింది. తాజాగా సరఫరా చేసిన 21LN స్టెయిన్‌లెస్ స్టీల్ తుప్పు నిరోధకత, అధిక బలం, మన్నికకు ప్రసిద్ధి చెందింది.
జిందాల్ స్టెయిన్‌లెస్ ( Jindal Stainless Ltd) సరఫరా చేసిన “201LN” స్టెయిన్‌లెస్ స్టీల్, కోచ్‌లను తేలికగా, అధిక ధృఢత్వంతో ఉంటుందని జిందాల్ స్టెయిన్‌లెస్ కంపెనీ వెల్లడించింది. “స్టెయిన్‌లెస్ స్టీల్ ‘201LN’ తుప్పు పట్టకుండా ఉంటుంది. అలాగే ఉన్నతమైన మన్నికను కలిగి ఉంది. మెరుగైన క్రాష్-రెసిస్టెంట్ ను ప్రదర్శిస్తుంది, తద్వారా ప్రయాణీకులకు అత్యుత్తమ భద్రతను అందిస్తుంది” అని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
Also Read : వందే మెట్రో – వందే భారత్ రైళ్లకు తేడా ఏమిటి..? స్పీడ్, ఫీచర్లు, నగరాల వివరాలు
వందే మెట్రో రైలు (Vande Metro)
భారతీయ రైల్వేలు ఇటీవలే చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారు చేసిన మొదటి వందే మెట్రో రైలు (Vande Metro Train) ను ఆవిష్కరించింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే వందే మెట్రో తక్కువ దూరం గల గమ్య స్థానాల కోసంరూపొందించారు. ఈ నెట్‌వర్క్ 124 నగరాలను దాదాపు 100-250 కిలోమీటర్ల దూరంలో కలుపుతుంది, ఇది ఇంటర్ సిటీ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది.
వందే మెట్రో రైలు ప్రత్యేకతలు
రూట్లు: వందే మెట్రో తక్కువ దూరంలో ఉన్న ప్రధాన నగరాలను కనెక్ట్ చేస్తుంది. ప్రధానంగా విద్యార్థులు, ఉద్యోగుల రోజువారీ ప్రయాణాల కోసం ఈ వందేభారత్ మెట్రో రైళ్లను తీసుకొస్తున్నారు.
ఫ్రీక్వెన్సీ: వందే మెట్రో రైళ్లు నగరాల మధ్య రోజుకు నాలుగు లేదా ఐదు సార్లు అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి.
కోచ్ ల సంఖ్య: రైళ్లలో కనీసం 12 నుంచి 16 వరకు కోచ్‌లు ఉంటాయి. వందే మెట్రో కోచ్ లో 100 మంది ప్రయాణికులకు సీట్లు ఉంటాయి. అలాగే 180 మంది ప్రయాణీకులు నిలబడే స్థలం ఉంటుంది.
వేగం: వందే మెట్రో గంటకు 130 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
Nice info