VandeBharat Metro | వందే మెట్రో – వందే భారత్ రైళ్లకు తేడా ఏమిటి..? స్పీడ్, ఫీచర్లు, నగరాల వివరాలు

VandeBharat Metro | వందే మెట్రో – వందే భారత్ రైళ్లకు తేడా ఏమిటి..? స్పీడ్, ఫీచర్లు, నగరాల వివరాలు

Vande Bharat Express v/s VandeBharat Metro : భారత్ లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రవేశంతో  ప్రయాణ సమయం చాలా తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా సున్నితమైన ప్రయాణ అనుభవాన్ని అందించింది. ఈ సెమీ-హై-స్పీడ్ రైళ్లతో  భారతదేశంలో రైలు ప్రయాణ స్వరూపాన్నే మార్చేసింది. వాస్తవానికి 2019లో  మొదటి వందే భారత్ రైలు ప్రారంభమైంది. ఈ రైళ్లు భారతీయ రైల్వేలకు గేమ్-ఛేంజర్‌గా మారాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం, 82 వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ వందేభారత్ రైళ్ల విజయతో భారతీయ రైల్వేలు ఇప్పుడు కొత్తగా వందే మెట్రో అనే కొత్త కేటగిరీ రైళ్లను పరిచయం చేయడానికి సిద్ధమైంది.

వందే మెట్రో రైళ్లు ఏమిటి?

Vande Bharat Metro : తక్కువ దూరం గల సిటీలకు మధ్య ప్రయాణాలకు ఉద్దేశించి  వందే మెట్రో ఎక్స్ ప్రెస్ రైళ్లను తీసుకొస్తున్నారు. భారతదేశంలో సబర్బన్ ప్రయాణాన్ని మెరుగుపరచడంపై భారతీయ రైల్వే దృష్టి సారించింది. ఇది ప్రయాణీకులకు తక్కువ ధరలో వేగవంతమైన, షటిల్ లాంటి అనుభవాన్ని అందించడం లక్ష్యంగా  ఈ మెట్రో రైళ్లను తీసుకొస్తున్నారు. ఈ మెట్రో రైల్ నెట్‌వర్క్ 124 నగరాలను దాదాపు 100-250 కిలోమీటర్ల దూరంలో కలుపుతుంది.

READ MORE  Gold and Silver Prices Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

తిరుపతితో సహా ఈ నగరాలకు వందే మెట్రో

ఢిల్లీ నుంచి రేవారి, ఆగ్రా నుంచి మధుర, లక్నో నుంచి కాన్పూర్, భువనేశ్వర్ నుంచి బల్సోర్ వందే భారత్ మెట్రో రైలు, అలాగే తిరుపతి నుంచి చెన్నై వరకు మొదటి దశలో వందేభారత్ మెట్రో రైళ్లను నడిపించనున్నారు. వందే మెట్రోకు సంబంధించిన నమూనాను ప్రస్తుతం పంజాబ్‌లోని కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) అభివృద్ధి చేస్తోంది. వందే మెట్రో ట్రయల్ రణ్  జూలై 2024లో ప్రారంభం కానున్నాయి,

READ MORE  Vane Bharat Express | వందే భారత్‌ రైళ్ల వేగం త‌గ్గింది...!

వందే భారత్ ఎక్స్‌ప్రెస్- వందే మెట్రో మధ్య వ్యత్యాసం

రూట్: వందే మెట్రో తక్కువ దూరం లోపు ప్రధాన నగరాలను కలుపుతూ, ప్రధానంగా విద్యార్థులు, ఉద్యోగార్ధులకు కు రోజు వారీ ప్రయాణం కోసం తీసుకువస్తున్నారు. అయితే  వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఎక్కువ దూరం ప్రయాణిస్తూ ఎక్కువ నగరాలను కలుపుతాయి.

ఫ్రీక్వెన్సీ: వందే మెట్రో రైళ్లు  ఎక్కువ ఫ్రీక్వెన్సీతో నడుస్తాయి, నగరాల మధ్య రోజుకు నాలుగు లేదా ఐదు సార్లు అటూ ఇటూ తిరుగుతాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రం సుదీర్ఘ ప్రయాణాల కోసం రూపొందించారు. సాధారణంగా రోజుకు ఒకటి లేదా రెండుసార్లు నడుస్తాయి.

కోచ్ లు: రెండు రైళ్లలో కనీసం 12 కోచ్‌లు నుంచి 16 వరకు ఉండవచ్చు, కానీ వాటి కోచ్ కాన్ఫిగరేషన్‌లు భిన్నంగా ఉంటాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణీకులందరికీ సౌకర్యవంతమైన సీటింగ్‌ను అందిస్తాయి, అయితే నివేదికల ప్రకారం వందే మెట్రో రైలులో 100 మంది ప్రయాణికులకు సీట్లు, 180 మంది ప్రయాణీకులకు నిలబడే స్థలం ఉంటుంది.

READ MORE  మరిన్ని సౌకర్యాలతో కొత్త ఆరెంజ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు..

వేగం: వందే మెట్రో గంటకు 130 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వేగంగా ఉంటాయి, గంటకు 183 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి

One thought on “VandeBharat Metro | వందే మెట్రో – వందే భారత్ రైళ్లకు తేడా ఏమిటి..? స్పీడ్, ఫీచర్లు, నగరాల వివరాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *