Home » US Elections 2024 : అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలవాలని హిందువుల పూజలు
US Presidential Election 2024

US Elections 2024 : అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలవాలని హిందువుల పూజలు

Spread the love

US Elections 2024 | మంగళవారం యునైటెడ్ స్టేట్స్‌లో ఎన్నికలు ప్రారంభం కావ‌డానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్ర‌మంలోనే కమలా హారిస్ అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలవుతుందా లేదా డొనాల్డ్ ట్రంప్ అద్భుతంగా మ‌రోసారి అధికారంలోకి వస్తాడా అని తెలుసుకోవడానికి ఆమెరికాతోపాటు యావ‌త్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ క్ర‌మంలో
సోమవారం న్యూ దిల్లీలోని హిందూ పూజారుల బృందం డోనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

READ MORE  IRCTC ఈ టూర్ ప్యాకేజీ చాలా ప్రత్యేకమైనది.. త‌క్కువ ఖ‌ర్చుతో థాయ్‌లాండ్ టూర్‌..

‘డోనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేయండి, ప్రపంచాన్ని మళ్లీ గొప్పగా మార్చండి’ అంటూ కమలా హారిస్‌పై డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించాలని పూజారులు నినాదాలు చేశారు. 2017 నుంచి 2021 వరకు అమెరికా 45వ అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్.. మళ్లీ పదవిలోకి రావాలని కోరుతున్నారు.

ఇదిలా ఉండ‌గా అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల నేపథ్యంలో తాజా పరిణామాలు కేవలం అమెరికాకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలపై, ముఖ్యంగా భారత్‌పై కూడా ప్రభావం చూపనున్నాయి. డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న విధానాలలో స్పష్టమైన తేడాలు భారతదేశంలోని అనేక రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

READ MORE  BAPS Hindu Mandir | అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం.. అద్భుతమైన కట్టడం గురించి మీరూ తెలుసుకోండి..

బ్రోకరేజ్ సంస్థ PL క్యాపిటల్ ప్రకారం, ట్రంప్ పరిపాలన ప్రపంచ భౌగోళిక రాజకీయాలు, ముడి చమురు ధరలు, రక్షణ సాంకేతికత, ఫార్మాస్యూటికల్స్‌కు అనుకూలంగా ఉండవచ్చు. ప్రస్తుత మార్కెట్ అంచనాలు హారిస్‌కు 43.5% సంభావ్యతతో పోలిస్తే ట్రంప్ విజయానికి 56.5% అవకాశం ఉందని సూచిస్తున్నాయి,

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్