Uniform Civil Code | యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు దిశగా ఉత్తరఖండ్..
Uttarakhand | యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేసేందుకు ఆ రాష్ట్రం సిద్ధమవుతోంది. ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) కోసం నిబంధనలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఇటీవలే విస్తృత చర్చలను నిర్వహించింది. అనంతరం కమిటీ తన సిఫార్సులను బుక్‌లెట్ రూపంలో ముఖ్యమంత్రికి అందించేందుకు రెడీ అయింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే నవంబర్ 9 నాటికి రాష్ట్రంలో యూసీసీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో, ఉత్తరాఖండ్ సిఎం ధామి నవంబర్ 9 నాటికి రాష్ట్ర 24వ ఆవిర్భావ దినోత్సవంతో యుసిసిని అమలు చేయనున్నట్లు గతలోనే ప్రకటించారు.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఫిబ్రవరిలో యూసీసీ (Uniform Civil Code) బిల్లును ఆమోదించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము మార్చి 13న దానిపై సంతకం చేశారు, UCCని అమలులోకి తెచ్చిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించడానికి మార్గం సుగమం చేసింది.
ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ శతృఘ్న సింగ్ మాట్లాడుతూ, “ఈ రోజు జరిగిన ఐదుగురు సభ్యుల డ్రాఫ్ట్ కమిటీ చివరి సమావేశంలో, కమిటీ యుసిసి ముసాయిదా నివేదికపై తుది ముద్ర వేసింది. యుసిసి ముసాయిదాను ముద్రించిన తర్వాత తుది నివేదికను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి అందజేస్తుంది” అని ఆయన తెలిపారు.
వివాహం, లైవ్-ఇన్ రిజిస్ట్రేషన్ల కోసం డిజిటల్ సౌకర్యాలతో పాటు, కమిటీ తన సిఫార్సులలో భాగంగా విల్ డాక్యుమెంటేషన్, సవరణలను ప్రతిపాదించింది. రూల్స్ మేకింగ్ & ఇంప్లిమెంటేషన్ కమిటీ, ఫిబ్రవరిలో ఏర్పడినప్పటి నుంచి 130 సమావేశాలను నిర్వహించింది, రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడానికి 500 పేజీల సమగ్ర నివేదికను రూపొందించినట్లు అనేక మీడియా నివేదికలు తెలిపాయి.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ వివాహం, విడాకులు, వారసత్వం, లివ్-ఇన్ రిలేషన్ షిప్ లకుసంబంధించిన చట్టాలను ప్రస్తావించే UCCని ఆమోదించింది. తదనంతరం, UCC యొక్క నిబంధనల అమలును వివరించడానికి రూల్స్ మేకింగ్ & ఇంప్లిమెంటేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా సివిల్ కోడ్ అమలు చేయాలని చూస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ సెషన్‌లో యుసిసి బిల్లును ప్రవేశపెట్టాలని రాజస్థాన్ తన ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది.
యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలులోకి వస్తే.. మతంతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరినీ వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, ఇతర వ్యక్తిగత విషయాలను నియంత్రించేందుకు ఏకీకృత నిబంధనలు వర్తిస్తాయి. తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో, భారతదేశంలో యూనిఫాం సివిల్ కోడ్’ అమలు చేయాలని, ‘వివక్షపూరిత మతపరమైన సివిల్ కోడ్’ని తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..