Underwater Metro Train : దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ట్రైన్.. ఎక్కడుంది.. ప్రత్యకతలు ఏమిటీ?
Underwater Metro Train | పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతా (Kolkata)లో నిర్మించిన భారతదేశంలో మొదటి నదీ గర్భ మెట్రో మార్గాన్ని (Indias first underwater metro train ) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు. హౌరా మైదాన్-ఎస్‌ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న నది కింద ఈ టన్నెల్ ను నిర్మించారు. కొత్త మెట్రో రూట్‌తో కోల్‌కతాలో రవాణా సులభతరం కానుంది.
కోల్ కతాలోని ఈ అండర్ వాటర్ మెట్రో టన్నెల్ లో ప్రధాని మోదీ తొలిసారి విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. రూ.120 కోట్లతో 16.6 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని ఇంజినీరింగ్ అద్భుతంగా భావిస్తున్నారు. హుగ్లీ నది కింద నిర్మించిన ఈ అండర్ వాటర్ మెట్రో లైన్ కోల్‌కతాలోని రెండు జంట నగరాలైన హౌరా, సాల్ట్ లేక్‌లను అనుసంధానిస్తుంది. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉండగా, అందులో మూడు భూగర్భం (జలాంతర్గ)లో ఉన్నాయి.
నీటి అడుగున మెట్రో టిక్కెట్ ధరలు:
Underwater Metro Train Ticket Prices : అండర్ వాటర్ మెట్రో టిక్కెట్లు రూ.5 నుండి ప్రారంభమవుతాయి, ప్రయాణించే దూరాన్ని బట్టి మారవచ్చు. ఛార్జీ మొదటి రెండు కిలోమీటర్లకు రూ. 5 నుంచి ప్రారంభమవుతుంది. క్రమంగా పెరుగు ఎక్కువ దూరాలకు రూ. 50 ఉంటుంది.
అండర్ వాటర్ మెట్రో ఫీచర్లు:
Underwater Metro Train Features : భారతదేశంలోనే మొదటి అండర్ వాటర్ మెట్రో మార్గం ఇది. మొత్తం కారిడార్ 16.6 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఒక ముఖ్యమైన భాగం నది కింద నుంచి వెళుతుంది. ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్ (ATO) సిస్టమ్ ద్వారా రైళ్లు నడుస్తాయి. మోటర్మ్యాన్ బటన్ నొక్కినప్పుడు రైలు ఆటోమేటిక్గా తదుపరి స్టేషన్కి కదులుతుంది.
తూర్పు-పశ్చిమ మెట్రో కారిడార్ 16.6 కిలోమీటర్ల ట్రాక్ ను కలిగి ఉంది, ఇందులో 10.8 కిలోమీటర్ల భూగర్భం మార్గం హుగ్లీ నదికి దిగువన ఒక సొరంగం ఉంది. స్టేషన్లు , రైళ్లు ఎయిర్ కండిషన్ తో ఉంటాయి, మెట్రో నది ఉపరితలం నుండి 26 దిగువన నడుస్తుంది. రైళ్లు నదీగర్భం క్రింద 16 మీటర్లు నడుస్తాయి.
మెట్రో ప్రయాణ సమయం:
నీటి అడుగున మెట్రో కేవలం 45 సెకన్లలో నదికి దిగువన 520 మీటర్ల విస్తీర్ణంలో ప్రయాణిస్తుంది. రవాణాలో వేగంతోపాటు ఎంతో సౌకర్యాన్ని అందిస్తుంది.
భారతదేశంలో లోతైన మెట్రో స్టేషన్:
ఏప్రిల్ 2023లో, మొదటి మెట్రో రైలు హౌరా మైదాన్ స్టేషన్ కు చేరుకుంది, ఇది ఉపరితలం నుండి 33 మీటర్ల దిగువన దేశంలోనే లోతైన మెట్రో స్టేషన్ గా నిలిచింది. హుగ్లీ నది దిగువన ఉన్న నీటి అడుగున సొరంగం నీటి మట్టానికి 33 దిగువన ఉంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..