Home » UGC NET Scholarship |  PhD స్కాలర్లకు గుడ్ న్యూస్ స్టైఫండ్‌లను భారీగా పెంచేసిన కేంద్రం
UGC NET Scholarship

UGC NET Scholarship |  PhD స్కాలర్లకు గుడ్ న్యూస్ స్టైఫండ్‌లను భారీగా పెంచేసిన కేంద్రం

Spread the love

UGC NET Scholarship Amount 2024-25:   UGC NET రిజల్ట్స్ 2024 ప్రకటించిన తరుణంలో పీహెచ్ డీ స్కాలర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. UGC NET JRF 2024కి అర్హత సాధించిన అభ్యర్థులు తమ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందిన తర్వాత వారు పొందే ఫెలోషిప్ ప్రోత్సాహకాల కోసం  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గత సంవత్సరం.. విద్యా మంత్రిత్వ శాఖ జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ లు(JRF), సీనియర్ రీసెర్చ్ ఫెలోస్ (SRF)లు, రీసెర్చ్ అసోసియేట్స్ (RAs) కోసం నెలవారీ వేతనాలను సవరించింది. ఈసారి రీసెర్చ్ స్కాలర్‌లకు స్టైపెండ్ మొత్తాలను గణనీయంగా పెంచేసింది. రీసెర్చ్ కమ్యూనిటీ నుంచి చాలా కాలంగా వస్తున్న  డిమాండ్‌ ను పరిగణలోకి తీసుకొని ఫెలోషిప్ మొత్తాలను పెంచడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద ప్రభుత్వ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఆవిష్కరణలను ప్రోత్సహిచడంతోపాటు పరిశోధనలో నైపుణ్యాన్ని పెంపొందిస్తుందని భావిస్తున్నారు.

READ MORE  Jab Alert | నాబార్డ్ ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి ఆహ్వానం.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

హోదా మునుపటి స్టైపెండ్ పెరిగిన స్టైపెండ్

జూనియర్ రీసెర్చ్ ఫెలో రూ. 31,000 నుంచి  రూ. 37,000 పెంపు
సీనియర్ రీసెర్చ్ ఫెలో రూ. 35,000 నుంచి రూ. 42,000
రీసెర్చ్ అసోసియేట్ I రూ. 47,000 నుంచి రూ. 58,000
రీసెర్చ్ అసోసియేట్ II రూ. 49,000 నుంచి రూ. 61,000
రీసెర్చ్ అసోసియేట్ III రూ. 54,000 నుంచి రూ. 67,000

ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ (AIRSA) రీసెర్చ్ స్కాలర్‌లకు స్టైఫండ్‌లను పెంచాలని గతంలో సూచించింది.వారి ఆందోళనలను పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో  యువ పరిశోధకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

READ MORE  BA Animation | బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బీఏ యానిమేషన్ అడ్మిషన్లు ప్రారంభం

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..