Sunday, June 1Welcome to Vandebhaarath

Ugadi Panchangam Makar Rasi Phalalu | క్రోధి నామ ఉగాది పంచాంగం: మకర రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి..

Spread the love

Ugadi Panchangam Makar Rasi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం తెలుగు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో మకర రాశి (capricorn zodiac sign) వారికి వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు.

  • ఆదాయము – 14
  • వ్యయము – 14
  • రాజపూజ్యము – 3
  • అగౌరవము – 1

ఈ సంవత్సరము మకర రాశి వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతము వరకు పంచమ స్థానంలో బృహస్పతి , శని ద్వితీయ స్థానము నందు , రాహువు తృతీయ స్థానము నందు మరియు కేతువు భాగ్య స్థానము నందు సంచారము.

Ugadi Panchangam Makar Rasi Phalalu : శ్రీ క్రోధి నామ సంవత్సరము నందు మకర రాశి వారికి గురువుగారి అనుగ్రహం పితృదేవతల ఆశీస్సులు,  దైవానుగ్రహం ఉంటుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు యోగిస్తాయి. సంతాన ప్రవర్తనలో మార్పులను గమనించి ఆనందిస్తారు. సంతాన ఎదుగుదలకు ప్రోత్సహిస్తారు. వ్యాపారస్తులకు నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. ఇతరులకు ధన సహాయం చేయడం ద్వారా నష్టపోయే అవకాశం కలదు.

విద్యార్థులు తమ గమ్యస్థానానికి సులువుగా చేరుకోగలుగుతారు. నూతన విద్యను అభ్యసించే విద్యార్థులకు చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. Photography field మరియు software ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. పోలీసు శాఖ మరియు Municipal Department ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం ఉంటుంది.

Paints , Gold,  Textile Industry వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని విస్తరిస్తారు. దైవారాధన మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి సత్ఫలితాలు ఉండను. సంతాన ప్రయత్నాలు చేసే వారికి వంశవృద్ది కలుగును. Court కేసుల యందు సునయాస విజయాలు సాధిస్తారు. భూమికి సంబంధించిన తగాదాలు పరిష్కారం అవుతాయి. స్త్రీలకు గర్భ రోగాలు తగ్గుముఖం పడతాయి.

రాజకీయ రంగంలో ఉన్నవారికి యోగ కాలము. వాహన కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తొలగి సఖ్యత బలపడుతుంది. సినిమా రంగంలో ఉన్నవారు నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. మధ్యవర్తిత్వాల వల్ల లాభం చేకూరుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. రహస్యంగా కొంత ధనాన్ని పొదుపు చేస్తారు. గతంలో చేసిన తప్పులను పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి. ఏలినాటి శనికి జవములు జరిపించి తగు దానములు ఇవ్వవలెను. ఈశ్వరుడికి మజ్జిగతో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన.

by

స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక
డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ

7730023250, 8978510978


Organic Forming, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..