Video: కదులుతున్న కారులో డ్రైవర్ వేధింపులు.. భయంతో వాహనం నుంచి దూకేసిన మహిళ
Uber driver harassing incident : రాజస్థాన్‌లో ఇటీవల ఉబర్ డ్రైవర్ వేధింపులకు గురైన ఓ మహిళకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో లైవ్ లోకి వచ్చింది. @littleshsssisters అనే యూజర్ నేమ్‌తో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, మనాలి గుప్తా తన కూతురిని స్కూల్ నుండి తీసుకువెళ్లడానికి వెళుతున్నప్పుడు ఆమెకు ఎదురైన ఒక భయంకరమైన సంఘటన గురించి వివరిస్తూ.. వీడియోను షేర్ చేసింది.
వీడియోలో, మనాలి తనతో ఏమి జరిగిందీ.. ఉబర్ డ్రైవర్ తనను ఎలా వేధించాడో వివరించింది
తన కూతురిని స్కూల్ నుంచి పికప్ చేసుకునేందుకు రైడ్ బుక్ చేశానని, తాను ఎవరితోనో కాల్ చేస్తున్నప్పుడు కారు డ్రైవర్ అకస్మాత్తుగా తన ఫోన్ లాక్కోవడానికి యత్నించాడని వివరించింది. ఆమె ఒక్కసారిగా భయపడిపోయి అతడిని వారించేందుకు ప్రయత్నించింది.. కానీ డ్రైవర్ దూషించడం మొదలుపెట్టాడు.
Uber driver harassing incident మనాలి కారును ఆపమని డ్రైవర్‌ని చాలాసార్లు చెప్పినా కూడా అతడు వినిపించుకోకుండా కారును మరింత స్పీడ్ పెంచాడు. దీంతో ఆమె కదులుతున్న కారు నుండి దూకడం తప్ప మరో మార్గం లేదని గ్రహించింది. కారు ఆగే వరకు వేచి చూడకుండా సీటుకు అవతలి వైపునకు కదిలి వేగంగా కదులుతున్న కారులోంచి బయటకు దూకేసింది. దీంతో షాక్ తిన్న డ్రైవర్ కారుతో పరారయ్యాడు.
కాగా డ్రైవర్ పేరు శ్యామ్ సుందర్ అని అతడి కారు వివరాలను కూడా ఆమె పేర్కొంది. కార్ పొల్యూషన్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు రెండూ గడువు ముగిసిపోయాయని ఆమె హైలైట్ చేసింది.
హెల్ప్ లైన్ సెంటర్ కు కాల్ చేయగా ఉబెర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆమె వీడియోలో పేర్కొన్నారు.
వీడియో ప్రచురించబడినప్పటి నుండి వేలకొద్దీ లైక్‌లను పొందింది. ఇప్పటివరకు 100K వ్యూస్ వచ్చాయి. చాలా మంది వినియోగదారులు చర్య తీసుకోవాలని ఉబెర్‌ను అభ్యర్థించగా, మరికొందరు “ఉబర్ ఇండియాను నిషేధించాలి” అని అన్నారు.
మనాలికి ఇన్‌స్టాగ్రామ్‌లో 11.8K ఫాలోవర్లు ఉన్నారు మరియు ఆమె తన కుమార్తెతో కలిసి వీడియోలు చేస్తుంది.
View this post on Instagram
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.