Truecaller : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత ఫీచర్లు.. సరికొత్త రీబ్రాండింగ్ తో..
Truecaller: మనకు తెలియని వ్యక్తుల నుంచి ఎవరైనా కాల్ చేసినప్పుడు వారి కాలర్ IDని గుర్తించడానికి చాలా మంది ‘ట్రూకాలర్’ యాప్ ను ఉపయోగిస్తుంటారు. స్పామ్ కాల్స్ ను గుర్తించి వాటిని బ్లాక్ చేయడం దీని స్పెషాలిటీ. అయితే పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ట్రూకాలర్ కొత్తగా పలు ఫీచర్లను జోడించింది.
గూగుల్ ప్లే లేదా ఆపిల్ యాప్ స్టోర్లలో తక్షణమే గుర్తించగలిగే సరికొత్త ఐకాన్ తో ట్రూకాలర్ రీబ్రాండింగ్ (truecaller rebranding) ప్రకటించింది. కొత్త యాప్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) తో పనిచేసే సెర్చింగ్, యాంటీ ఫ్రాడ్ ఫీచర్ యూజర్లకు లభిస్తుందని కంపెనీ పేర్కొంది. దీనివల్ల ఏదైనా నంబర్ కోసం వెతుకుతున్నప్పుడు.. లేటెస్ట్ గా మార్చిన పేరుని తక్షణమే తెలుపుతుందని పేర్కొంది.
ఈ యాప్ ఆయా నంబర్లను 3 రంగుల్లో వర్గీకరిస్తుంది. సాధారణ పేరు మార్పునకు నీలం, అనుమానాస్పదంగా కనిపిస్తే పసుపు, మోసపూరిత లేదా స్కామర్ కార్యకలాపాలను గుర్తిస్తే ఎరుపు రంగు సూచిస్తూ మనల్ని అలర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ సహా iOS ఆపరేటింగ్ సిస్టమ్స్ లకు కంపెనీ ఈ ఫీచర్ అందించింది.
‘ట్రూ కాలర్ యాప్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ ను సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత తమపై ఉంది. అందుకోసం సెర్చ్ ఎక్స్ప పీరియన్స్ తో పాటు గోప్యతను మెరుగుపరిచేందుకు, అలాగే మోసాలను నిరోధించేందుకు పరిష్కారాలను అందించడమే తమ లక్ష్యం’ అని CEO అలాన్ మామెడి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 356 మిలియన్ యూజర్లతో, గత 14 ఏళ్లుగా ఐడెంటిఫికేషన్ సొల్యూషన్స్‌లో ట్రూకాలర్ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్, WhatsApp లోనూ ఫాలో కావొచ్చు..