Friday, April 4Welcome to Vandebhaarath

Trinamool Congress Menifesto : మేం అధికారంలోకి వస్తే.. ఎన్ఆర్‌సీ, సీఏఏను అమ‌లు చేయం: మ‌మ‌తా బెనర్జీ

Spread the love

Trinamool Congress  Menifesto | తాము ఎన్నిక‌ల్లో గెలుపొందితే.. ఎన్ఆర్సీ, సీఏఏను త‌మ రాష్ట్రంలో అమ‌లు చేయ‌బోమ‌ని ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee)  వెల్లడించారు.  సిల్చ‌ర్‌లో జ‌రిగిన బహిరంగ సభలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికి రేషన్, బిపిఎల్ కుటుంబాలకు 10 ఉచిత వంట సిలిండర్లు సహా సంక్షేమ పథకాలను అమ‌లు చేస్తామంటూ తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) రాబోయే లోక్‌సభ ఎన్నికలకు తన మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. మేనిఫెస్టోలో అత్యంత కీక‌ల‌మైన పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) రద్దు చేస్తామని, NRC ని నిలిపివేస్తామని అధికార పార్టీ హామీ ఇచ్చింది.

READ MORE  Kolkatha Rape Murder Case : దిగివచ్చిన మమత.. కీల‌క‌ పోలీసు, వైద్య‌ అధికారులపై వేటు..

బీజేపీ మొత్తం దేశాన్ని నిర్బంధ శిబిరంగా మార్చిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రంలో ప్రతిపక్ష కూటమి ఇండియా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే CAA, NRC రద్దు చేస్తుంద‌ని అన్నారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవు’ అని ఆమె ఆరోపించారు.
ఇదిలా ఉండ‌గా, పశ్చిమ బెంగాల్‌లో 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమవుతాయి మరియు జూన్ 1 వరకు ఏడు దశల్లో నిర్వహించబడతాయి. రాష్ట్రం లోక్‌సభకు 42 స్థానాలను అందిస్తుంది మరియు ఎన్నికల ఫలితాలను జూన్ 4న ప్రకటించాలని భావిస్తున్నారు.

READ MORE  Lok Sabha Elections: వరంగల్ లోక్ సభ బరిలో కడియం కావ్య..

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *