Trinamool Congress Menifesto : మేం అధికారంలోకి వస్తే.. ఎన్ఆర్‌సీ, సీఏఏను అమలు చేయం: మమతా బెనర్జీ
Trinamool Congress Menifesto | తాము ఎన్నికల్లో గెలుపొందితే.. ఎన్ఆర్సీ, సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వెల్లడించారు. సిల్చర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికి రేషన్, బిపిఎల్ కుటుంబాలకు 10 ఉచిత వంట సిలిండర్లు సహా సంక్షేమ పథకాలను అమలు చేస్తామంటూ తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) రాబోయే లోక్‌సభ ఎన్నికలకు తన మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. మేనిఫెస్టోలో అత్యంత కీకలమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) రద్దు చేస్తామని, NRC ని నిలిపివేస్తామని అధికార పార్టీ హామీ ఇచ్చింది.బీజేపీ మొత్తం దేశాన్ని నిర్బంధ శిబిరంగా మార్చిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రంలో ప్రతిపక్ష కూటమి ఇండియా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే CAA, NRC రద్దు చేస్తుందని అన్నారు. ‘ప్రధాని నరేంద్ర ...