
మసాలా దోసతో సాంబార్ వడ్డించనందుకు రెస్టారెంట్ కు రూ.3,500 జరిమానా
బీహార్ లోని ఒక రెస్టారెంట్ కు రూ. 140 విలువైన స్పెషల్ మసాలా దోస అర్డర్ వచ్చింది. అయితే దోసతోపాటు సాంబార్ సర్వ్ చేయని కారణంగా సదరు రెస్టారెంట్ యాజమాన్యం కస్టమర్ కు రూ. 3,500 చెల్లించాల్సి వచ్చింది.బీహార్ లోని బక్సర్ లోని ఒక రెస్టారెంట్ లో దోసతో సాంబార్ లేకుండా వడ్డించారు. దానికి బదులుగా సూప్ ను సర్వ్ చేశారు. ఈ స్పెషల్ మసాలా దోస ధర రూ. 140 వసూలు చేశారు. అయితే రెస్టారెంట్ ఇప్పుడు పెనాల్టీగా రూ.3,500 చెల్లించాల్సి వచ్చింది. సాంబార్ చట్నీ దోసెలతో వడ్డించడం ఒక విధమైన ఆచారం. ఒక కస్టమర్ దానిని కోర్టుకు లాగడంతో రెస్టారెంట్ కు రూ.3,500 జరిమానా విధించారు. పిటిషనర్ కు దోసతో సాంబార్ వడ్డించకపోవడం వల్ల కస్టమర్ "మానసికంగా, శారీరకంగా ఆర్థికంగా" నష్టపోయాడని వినియోగదారుల కోర్టు పేర్కొంది.
జరిమానా చెల్లించేందుకు నమక్ రెస్టారెంట్ కు 45 రోజుల గడువు ఇచ్చింది. రెస్టారెంట్ జరిమానా చెల్లించకుంటే జరిమానా మొత్త...




