Home » Manipur violence: మణిపూర్ ఘటనలో ఆరో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
Manipur chargesheet

Manipur violence: మణిపూర్ ఘటనలో ఆరో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

Spread the love

Manipur violence: హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటనకు సంబంధించి మరో నిందితుడిని
మణిపూర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడిని యుమ్లెంబమ్ నుంగ్సితోయ్ మెటీ (Yumlembam Nungsithoi Metei )(19) గా గుర్తించినట్లు పోలీసులు
తెలిపారు. దేశాన్ని కుదిపేసిన ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఇందులో నలుగురు వ్యక్తులను శుక్రవారం 11 రోజుల పోలీస్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

READ MORE  మయన్మార్ నుంచి మళ్లీ భారీగా అక్రమ వలసలు

మణిపూర్‌లోని కాంగ్‌పోక్పిలో మణిపూర్‌లో పోరాడుతున్న ఒక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా మార్చేస్తున్నట్లు చూపించే వీడియో బుధవారం బయటపడి యావత్ భారతావనిని షాక్ గురిచేసింది. ఈశాన్య రాష్ట్రంలో హింస చెలరేగిన ఒక రోజు తర్వాత కాంగ్‌పోక్పి జిల్లాలో మే 4న ఈ సంఘటన జరిగింది. 26 సెకన్ల వీడియో జూలై 19న
వెలువడిన ఒక రోజు తర్వాత గురువారం అరెస్టులు మొదలయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్న కొద్ది గంటలకే అతడి ఇంటికి నిప్పు పెట్టారు.
కాంగ్‌పోక్పి జిల్లాలోని బి.ఫైనోమ్ గ్రామం వద్ద జరిగిన ఊరేగింపు ఘటనలో వీడియోలో ప్రముఖంగా ఉందని పోలీసులు తెలిపారు. వీడియోలో కనిపించిన మహిళల్లో ఒకరు భారత సైన్యంలో అస్సాం రెజిమెంట్‌కు సుబేదార్‌గా పనిచేసి, కార్గిల్ యుద్ధంలో పోరాడిన మాజీ సైనికుడి భార్య అని గుర్తించిన విషయం తెలిసిందే..

READ MORE  మణిపూర్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు

ఈ కేసులో ఇప్పటి వరకు ఒక బాలనేరస్తుడు సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు తెలిపారు. పలు అనుమానిత స్థావరాలపై దాడులు నిర్వహించి మిగిలిన నిందితులను పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా వివిధ జిల్లాల్లో మొత్తం 125 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్ ను సందర్శించండి

READ MORE  Monkey pox : భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదు.. అప్రమత్తమైన కేంద్రం..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..