
Bareilly Volence : బరేలీ హింసకు పోలీసుల రియాక్షన్.. రంగంలోకి బుల్డోజర్
Bareilly Volence : ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో సెప్టెంబర్ 26న శుక్రవారం ప్రార్థనల తర్వాత చెలరేగిన హింసకు సంబంధించి పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు. మౌలానా తౌకీర్ రజా అల్లుడిని పోలీసులు అరెస్టు చేశారు. మొహ్సిన్ రజాను అరెస్టు చేయడంతో పాటు, బరేలీ పోలీసులు అతని రిసార్ట్‌ను కూడా సీజ్ చేశారు.బరేలీ హింసపై పోలీసుల దర్యాప్తు సాగుతున్న కొద్దీ, విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. హింసలో పాల్గొన్న ఇతర వ్యక్తులపై పోలీసు చర్యలు కొనసాగుతున్నాయి. బరేలీ హింసకు ప్రధాన కుట్రదారుడు మౌలానా తౌకీర్ రజా అనుచరులపై పోలీసులు నిఘా వేసి చర్యలు తీసుకుంటున్నారు. బరేలీ పోలీసులు మౌలానా అల్లుడు మొహ్సిన్ రజాను అరెస్టు చేశారు. అతని రిసార్ట్‌ను సీజ్ చేశారు. మొహ్సిన్ అక్రమ ఆస్తులపై కూడా సీఎం యోగి బుల్డోజర్ చర్య (Bulldozer Action) చేపట్టారు.మౌలానా మొహ్సిన్ రజా ఆస్తిని బుల్డోజర్ ద్వారా కూల్చివేశారు. సెప్టెంబర్ 26న అల...








