Saturday, January 24Thank you for visiting

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

వెన‌క్కు త‌గ్గ‌ని హైడ్రా.. మూసీ కూల్చివేతలు మ‌ళ్లీ షురూ

వెన‌క్కు త‌గ్గ‌ని హైడ్రా.. మూసీ కూల్చివేతలు మ‌ళ్లీ షురూ

Trending News
Musi development | హైదరాబాద్‌: మూసీ ప‌రీవాహ‌క ప్రాంతంలో కూల్చివేతలపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినా వేసినా కాంగ్రెస్ ప్ర‌భుత్వం వెనక్కి తగ్గడంలేదు. మూసీ (Musi River) సుందరీకరణలో భాగంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు అధికారులు మ‌రోసారి రెడీ అయ్యారు. మొదటి విడతలో పునరావాస కేంద్రాలకు తరలించిన వారి ఇళ్ల‌ను ఈరోజు నేలమట్టం చేయనున్నారు. ఇప్పటికే చాదర్‌ఘాల్‌లో రెడ్ మార్క్‌ చేసిన నివాస‌ల‌ను రెవెన్యూ అధికారులు సీల్‌ వేశారు. చాదర్‌ఘాట్‌ పరిసరాల్లో 20 ఇళ్ల‌కు ఆర్బీ-ఎక్స్‌ మార్కింగ్ చేశారు. ఇక్క‌డి నిర్వాసితులను కూడా తరలించారు. మంగ‌ళ‌వారం మూసానగర్‌, రసూల్‌పుర, వినాయక్‌నగర్‌లో కూల్చివేతలను చేప‌ట్ట‌నున్నారు.మూసీకి ఇరువైపులా రివర్‌ బెడ్‌ పరిధిలో ఉన్న నిర్మాణాల సంఖ్య సుమారు 30 నుంచి 40 వేల మధ్య ఉంటుందని అధికారులు భావించారు. కానీ తాజా మ్యాప్‌ ప్రకారం రివర్‌ బెడ్ (రెడ్‌ లైన్‌) పరిధిలో వచ్చే నిర్మ...
విదేశాల్లో మన వందే భారత్ రైళ్లకు డిమాండ్.. కొనుగోలుకు సిద్ధం

విదేశాల్లో మన వందే భారత్ రైళ్లకు డిమాండ్.. కొనుగోలుకు సిద్ధం

Trending News
ఇటివల మన దేశంలో ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విదేశాల్లోనూ భారీగా క్రేజ్ వస్తోంది. ఇప్పుడు వీటిని కొనుగోలు చేసేందుకు పలు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీనికి కారణం ఏమిటో తెలుసా..?మనదేశంలో  తక్కువ ఖర్చుతో తయారైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు(vande bharat express trains) ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా డిమాండ్ పెరుగుతోంది. మలేషియా, చిలీ, కెనడా  వంటి దేశాలు మన నుంచి వందే భారత్ రైళ్లను దిగుమతి చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయి . బయటి కొనుగోలుదారులు వందే భారత్ వైపు ఆకర్షితులవడానికి అనేక కారణాలు ఉన్నాయని కూడా ఆయా వర్గాలు చెబుతున్నాయి అందులో ముఖ్యమైనది  ఒకటి ఖర్చు.  ఇతర దేశాల్లో తయారయ్యే ఇలాంటి రైళ్ల ధర దాదాపు రూ. 160-180 కోట్లు ఖర్చు అవుతుండగా, ఇక్కడ వందే భారత్ రైలు రూ. 120-130 కోట్లతోనే అభివృద్ధి చేస్తున్నారు. దీంతో వారికి సుమారు 40 నుంచి 50 కోట్లు ఆదా అవుతుంది..  ఆకట్టుకునే స...
Festive Season | టికెట్‌ లేని ప్రయాణికులకు ఉచ్చు బిగించిన రైల్వే

Festive Season | టికెట్‌ లేని ప్రయాణికులకు ఉచ్చు బిగించిన రైల్వే

Trending News
Festive Season | రైళ్ల‌లో టికెట్ లేకుండా ప్ర‌యాణించేవారికి (Ticketless Travellers) భారతీయ రైల్వేశాఖ ఝ‌ల‌క్ ఇవ్వ‌నుంది. పండుగ సీజన్లలో ప్రత్యేక టిక్కెట్-చెకింగ్ డ్రైవ్‌ను ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది, టిక్కెట్ లేని ప్రయాణికులను తనిఖీ చేయడానికి, పోలీసులతో రైల్వే సిబ్బందిని విస్తృత‌స్థాయిలో మోహ‌రించ‌నుంది. అక్టోబర్ 1 నుండి 15 వరకు, అక్టోబర్ 25 నుంచి నవంబర్ 10 వరకు టిక్కెట్ లేని, అనధికారిక ప్రయాణికులపై ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణ‌యించింది. టికెట్ లేకుండా ప్ర‌యాణించేవారిపై 1989 రైల్వే చట్టంలోని నిబంధనల ప్ర‌కారం చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ 17 జోన్ల జనరల్ మేనేజర్‌లకు లేఖ రాసింది.పండుగ రద్దీ నేప‌థ్యంలో వివిధ రైల్వే డివిజన్లలో రెగ్యులర్ గా విధులు నిర్వ‌ర్తిస్తున్న రైల్వే కమర్షియల్ అధికారులతో పాటు పోలీసులు కూడా త‌నిఖీల్లో ఉంటారని అధికారులు పేర్కొంటున...
రూ.130 కోట్ల‌తో అభివృద్ధి చేసిన‌ పరమ రుద్ర సూపర్ కంప్యూటర్ల పని ఏంటి?

రూ.130 కోట్ల‌తో అభివృద్ధి చేసిన‌ పరమ రుద్ర సూపర్ కంప్యూటర్ల పని ఏంటి?

Trending News
Param Rudra Supercomputers | వాతావరణ మార్పుల‌పై పరిశోధనల కోసం మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లు, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC) సిస్టమ్‌లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ సూపర్ కంప్యూటర్‌లను భారతదేశంలో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (NSM) కింద అభివృద్ధి చేశారు. ఈ మూడు పరమ రుద్ర సూపర్‌కంప్యూటింగ్ సిస్టమ్‌ల త‌యారీకి సుమారుగా రూ. 130 కోట్లు ఖ‌ర్చు చేశారు.అధిక-పనితీరు గల సైంటిఫిక్ రీసెర్చ్, డెవలప్‌మెంట్‌కు స‌హ‌క‌రించేందుకు పూణె, ఢిల్లీ, కోల్‌కతాలో వీటిని మోహ‌రిస్తారు. వర్చువల్ ఈవెంట్ లో ఈ సూప‌ర్ కంప్యూట‌ర్‌ల‌ను మోదీ ప్రారంభించారు. తన ప్రసంగంలో దేశంలో కంప్యూటింగ్ సామర్థ్యం ప్రాముఖ్యతను ప్రధాని వెల్ల‌డించారు.“పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లు, హెచ్‌పిసి సిస్టమ్‌తో, భారతదేశం కంప్యూటింగ్‌లో స్వావలంబన దిశగా అడుగులు వేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆవిష్కరణలను ముందుకు నడిపిస్తోంద...
Himachal Pradesh | ఫాస్ట్ ఫుడ్, హోటళ్లలో నిర్వాహకుల వివరాలను ప్ర‌ద‌ర్శించాల్సిందే.. లేకుంటే కఠిన చర్యలు తప్పవు..

Himachal Pradesh | ఫాస్ట్ ఫుడ్, హోటళ్లలో నిర్వాహకుల వివరాలను ప్ర‌ద‌ర్శించాల్సిందే.. లేకుంటే కఠిన చర్యలు తప్పవు..

Trending News
Himachal Pradesh : తినుబండారాల స్టాళ్లు, ఔట్‌లెట్ యజమానులు వారి వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ వర్క్స్ అర్బన్ డెవలప్‌మెంట్ , మున్సిపల్ కార్పొరేషన్‌తో జరిగిన సమావేశంలో ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ తెలిపారు.మేము అర్బన్ డెవలప్‌మెంట్ , మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల‌తో సమావేశం నిర్వ‌హించామ‌ని, పరిశుభ్రమైన ఆహారం విక్రయిస్తున్నార‌ని నిర్ధారించుకోవడానికి, వీధి వ్యాపారులందరికీ.. ముఖ్యంగా తినుబండారాల‌ను వస్తువులను విక్రయించే వారి కోసం ఒక నిర్ణయం తీసుకున్నామ‌ని విక్రమాదిత్య మీడియాకు తెలిపారు. .వీధుల్లో విక్రయించే ఆహార పదార్థాల పరిశుభ్రతపై ప్రజలు ఆందోళనలు, సందేహాలను వ్యక్తం చేశారని ఆయన అన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని, యుపిలో అమ‌లు అవుతున్న‌ విధానాన్ని ఇక్క‌డ కూడా ప్ర‌వేశ...
ద‌స‌రా బంపర్ ఆఫర్..  ల‌క్కీ డ్రా విజేత‌ల‌కు గొర్రె పొట్టేలు, మేక‌పోతు, ఖ‌రీదైన మ‌ద్యం బాటిళ్లు..

ద‌స‌రా బంపర్ ఆఫర్.. ల‌క్కీ డ్రా విజేత‌ల‌కు గొర్రె పొట్టేలు, మేక‌పోతు, ఖ‌రీదైన మ‌ద్యం బాటిళ్లు..

Trending News
Dasara Lucky Draw : సాధార‌ణంగా ఏదైనా పోటీల్లో గెలుపొందిన‌వారికి షీల్డ్‌లు, మెడ‌ల్స్‌, లేదా గృహోప‌క‌ర‌ణాల‌ను, చీర‌ల‌ను బ‌హుమ‌తులుగా ఇస్తారు. కానీ వీట‌న్నింటికీ భిన్నమైన బ‌హుమ‌తులను ఈగ్రామంలో అంద‌జేశారు.దసరా పండుగను పురస్కరించుకుని లక్కీ డ్రాలో కొత్త‌గా మేకలు, కోడిమాంసం, ప్రీమియం స్కాచ్ విస్కీలను బహుమతులుగా అందజేస్తూ ఇక్కడి ఓ గ్రామం వార్త‌ల్లో నిలిచింది. ఈ బ‌హుమ‌తుల కోసం రూ.100 విలువైన లాటరీ కూపన్‌ను కొనుగోలు చేస్తే చాలు.Dasara Lucky Draw Prizes : మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అక్టోబరు 10న ఒక్కొక్కటి రూ.100 చొప్పున‌ కూపన్‌లను విక్రయించి ల‌క్కీ డ్రా నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే ల‌క్కీ డ్రా గెలుచుకున్న‌వారికి గృహోపకరణాలు లేదా వాహనాలు, షీల్డులు, కాదు.. బోయపల్లి డ్రాలో మొదటి బహుమతి పొందిన లక్కీకి గొర్రె పొట్టేలు, రెండవ బహుమతిగా మేకపోతు. మూడు...
ప్రభుత్వ ఆధీనంలోని దేవాల‌యాల‌ను విడిపించాల్సిందే.. వీహెచ్ పీ సరికొత్త ప్రచారం..

ప్రభుత్వ ఆధీనంలోని దేవాల‌యాల‌ను విడిపించాల్సిందే.. వీహెచ్ పీ సరికొత్త ప్రచారం..

Trending News
VHP campaign | తిరుపతి బాలాజీ ఆలయ ప్రసాదాల వివాదం నేపథ్యంలో., VHP మంగళవారం దేశవ్యాప్తంగా ప్ర‌చారం చేప‌ట్టింది. ప్రభుత్వ నియంత్రణ నుంచి దేవాలయాలను విడిపించేందుకు విస్తృత‌ ప్రచారాన్ని ప్రకటించింది. ఆల‌యాల‌ నిర్వహణలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, దేవాలయాలను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడం "ముస్లిం ఆక్రమణదారులు" మరియు "వలసవాద" బ్రిటీష్ ఆలోచనలను ప్రతిబింబిస్తుందని పేర్కొంది.ప్రభుత్వాలు తమ సంపదను దోచుకోవడానికి, ప్రభుత్వంలో చోటు దక్కించుకోలేని రాజకీయ నాయకులకు ప‌దవులు కల్పించేందుకు ఆలయాలను ఉపయోగించుకుంటున్నాయని విహెచ్‌పి సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ విలేఖరుల సమావేశంలో అన్నారు. "లడ్డూ ప్రసాదాల పవిత్రతను కాపాడేందుకు "శుద్ధి కర్మలు" నిర్వహించనున్నామ‌ని ట‌ బోర్డు పేర్కొంది.ప్రసాదంలో జంతు కొవ్వుతో కల్తీ చేశారని వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌తో 'మొత్తం హిందూ సమాజం ఆగ్రహం వ్య‌క్త‌మైంద‌ని జైన్ అన్నారు...
Mathura | మధుర, బృందావన్‌లోని ప్ర‌సాదాల‌పై అల‌ర్ట్‌.. నమూనాలను ల్యాబ్ కు త‌ర‌లింపు

Mathura | మధుర, బృందావన్‌లోని ప్ర‌సాదాల‌పై అల‌ర్ట్‌.. నమూనాలను ల్యాబ్ కు త‌ర‌లింపు

Trending News
Mathura | తిరుపతి లడ్డూ కల్తీ ఆరోపణల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం మధుర (Mathura Temple) , బృందావనం తదితర ప్రాంతాల్లోని ధార్మిక క్షేత్రాలకు సమీపంలోని 15 దుకాణాల నుంచి 43 ఆహార పదార్థాల నమూనాలను సేకరించింది. సేకరించిన ఆహార పదార్థాల్లో కల్తీ పదార్థాలను వాడుతున్నారనే అనుమానంతో లక్నోలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి 'పేడా' (ఒక రకమైన స్వీట్) నమూనాను పరీక్షల నిమిత్తం పంపారు. ఎఫ్‌ఎస్‌డిఎ అసిస్టెంట్ కమిషనర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ సోమవారం మధుర, బృందావన్‌లలో నిర్వహించిన నమూనా ప్రచారంలో 15 మంది వ్యాపారుల‌ నుంచి మొత్తం 43 నమూనాలను సేకరించినట్లు తెలిపారు. మిఠాయిలు, పాలు, పనీర్, పెడా, బర్ఫీ, మిల్క్ కేక్, రసగుల్లా, సోన్‌పాప్డి, ఇతర స్వీట్లు మసాలా దినుసులతో తయారుచేసిన వ‌స్తువులను లాబ్ కు పంపించారు. వాటిలో 42 స్టాండర్డ్‌లో ఉన్నట్లు గుర్తించామని, అయితే 'పెడా' నమ...
దేశ ప్రజలందరికీ ఉపయోగపడే U-WIN Portal త్వరలో ప్రారంభం.. దీని ఫీచర్లు ఇవే..

దేశ ప్రజలందరికీ ఉపయోగపడే U-WIN Portal త్వరలో ప్రారంభం.. దీని ఫీచర్లు ఇవే..

Trending News
U-WIN Portal Key features | గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువుల నుంచి 17 సంవత్సరాల పిల్లలకు పూర్తి టీకా రికార్డు కోసం వ్యాక్సిన్ సేవలను డిజిటలైజ్ చేసేందకు వ‌చ్చే అక్టోబర్‌లో ఆన్‌లైన్ వ్యాక్సిన్ మేనేజ్‌మెంట్ పోర్టల్ U-WINని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శుక్రవారం వెల్ల‌డించారు. ఈ పోర్టల్ ప్రస్తుతం పైలట్ ప్రాతిపదికన పనిచేస్తోంది. గర్భిణీ స్త్రీలతో పాటు పుట్టినప్పటి నుంచి 17 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు వ్యాక్సినేషన్, మందులకు సంబంధించిన‌ శాశ్వత డిజిటల్ రికార్డును నిర్వహించడానికి పోర్టల్ అభివృద్ధి చేసిన‌ట్లు జేపీ నడ్డా చెప్పారు.మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల పాల‌న పూర్త‌యిన సందర్భంగా విలేకరుల సమావేశంలో నడ్డా మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) ప‌థ‌కాన్ని విస్త‌రించ‌డంతో సామాజిక-ఆర...
Railway Rules | వెయింటింగ్‌ టిక్కెట్ల‌పై మారిన నిబంధ‌న‌లు.. ఈ చిన్న‌ తప్పుకు మీరు రెట్టింపు జరిమానా చెల్లించాల్సిందే..

Railway Rules | వెయింటింగ్‌ టిక్కెట్ల‌పై మారిన నిబంధ‌న‌లు.. ఈ చిన్న‌ తప్పుకు మీరు రెట్టింపు జరిమానా చెల్లించాల్సిందే..

Trending News
Railway Rules For Waiting List Ticket Passengers : భారతీయ రైల్వేల ద్వారా ప్రతి రోజూ కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. మ‌న‌ రైల్వే ప్రయాణికుల సంఖ్య ఆస్ట్రేలియా వంటి దేశ జ‌నాభాతో సమానం. మన దేశంలో  చాలా మంది ప్రయాణికులు ఎక్కువగా రైలులో ప్రయాణించడానికే ఇష్టపడతారు. అందుకే భారతీయ రైల్వేలను దేశానికి లైఫ్ లైన్ అని పిలుస్తుంటారు.అయితే సుదూర ప్ర‌యాణాల‌కు ప్ర‌జ‌లు సాధారణంగా టికెట్‌ రిజర్వేషన్ చేసుకొని వెళ్లడం తప్పనిసరి. కానీ చాలాసార్లు చాలా మంది ప్రయాణికులకు రైలులో రిజర్వేషన్ టికెట్లు అంత సులువుగా దొరకవు. త్వరత్వరగానే అయిపోతుంటాయి.  చివ‌ర‌కు వెయిటింగ్‌లో టిక్కెట్లు ల‌భిస్తాయి. గ‌త్యంత్రం లేక‌ చాలా మంది ఈ వెయిటింగ్ టికెట్‌తోనే ప్రయాణం చేస్తారు. అయితే ఇప్పుడు వెయిటింగ్ టిక్కెట్లపై ప్రయాణించే వారి కోసం రైల్వే శాఖ నిబంధనలను కఠినతరం చేసింది. చిన్న తప్పు చేసినా భారీ జరిమానా చెల్లించాల్సి రావచ్చు. వెయిటి...