
Rashi Phalalu (05-04-2025) : ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు మురళీధరా చార్యులు వివరించారు. 2025 ఏప్రిల్ 5న శనివారం రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం
మేషం..
Rashi Phalalu : కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. తృతీయ చంద్ర బలం బాగుంది. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. భరణి నక్షత్ర జాతకులు ఈ రోజు చేసే పనులు విశేష శుభాలను అందిస్తాయి. గణపతి ధ్యానం శుభప్రదం.
వృషభం
విశేషమైన లాభాలు ఉన్నాయి. లాభంలో అయిదు గ్రహాలు గొప్ప ఫలితాన్ని ఇస్తున్నాయి. మీ మీ రంగాల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధుప్రీతి ఉంది. వస్త్రధన లాభాలు ఉన్నాయి. రోహిణి నక్షత్రం వారికి నూతన కార్యక్రమాలు క్షేమకరం అవుతాయి. దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది.
మిధునం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. ఆరుద్ర నక్షత్రం వారికి ఆర్థిక సంబంధ విషయాలు కలిసి వస్తాయి. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.
కర్కాటకం
ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు. మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల వారికి నూతన కార్యక్రమాలు కలిసి వస్తాయి. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభకరం.
సింహం
చక్కటి శుభకాలం. ప్రారంభించబోయే పనులు గొప్ప ఫలితాలను ఇస్తాయి. మిత్రుల సహకారం ఉంటుంది. లాభంలో చంద్రుడు మనఃస్సౌఖ్యాన్ని ఇస్తున్నారు. పుబ్బ నక్షత్రం వారికి పనులు వెంటనే పూర్తవుతాయి. విష్ణు సహస్రనామ పారాయణ శుభదాయకం.
కన్య
ప్రయత్నాలు ఫలిస్తాయి. దశమంలో చంద్రుడు శుభాన్ని ఇస్తున్నారు. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. ఒకటీరెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త. హస్త నక్షత్రం వారికి నూతన ప్రయత్నాల్లో క్షేమకరమైన ఫలితాలు ఉన్నాయి. ఈశ్వర ధ్యానం శుభప్రదం.
తుల
ఉద్యోగంలో శుభం చేకూరుతుంది. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. తొమ్మిదిలో చంద్రబలం అనుకూలంగా లేదు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. స్వాతి నక్షత్రం వారికి కార్యానుకూలం ఉంటుంది. దుర్గాదేవీ దర్శనం శుభప్రదం.
వృశ్చికం
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. అష్టమంలో చంద్రబలం యోగించట్లేదు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గాదేవీ సందర్శనం శుభప్రదం.
ధనుస్సు
ధర్మసిద్ధి ఉంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరుప్రతిష్టలు పెరుగుతాయి. పూర్వాషాఢ నక్షత్రం వారికి నూతన కార్యక్రమాలు సఫలం అవుతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
మకరం
మంచికాలం నడుస్తోంది. శక్తిసామర్ధ్యాలు పెరుగుతాయి. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూ గొప్ప ఫలితాలను పొందుతారు. శ్రవణనక్షత్రం వారికి నూతన ప్రయత్నాల్లో మేలు చేకూరుతుంది. గురు చరిత్ర చదవడం మంచిది.
కుంభం
పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. శతభిషా నక్షత్రం వారికి కార్యానుకూలం ఉంది. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది.
మీనం
గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కలహ సూచన ఉంది. ఉత్తరాభాద్ర, రేవతీ జాతకులకు శుభతారాబలం ఉంది, వీరికి ఆలస్యమైన పనులు పూర్తవుతాయి. గోసేవతో మంచి ఫలితాలను పొందుతారు.
మురళీధరా చార్యులు, జోత్యిష్య పండితులు
మెదక్ జిల్లా, Ph. 9652295899
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.