Rasi Phalalu : ఈ వారం రోజులు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది?

Rasi Phalalu : ఈ వారం రోజులు  ఏ రాశి వారికి ఎలా ఉంటుంది?

Rasi Phalalu :  ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జనవరి  7 ఆదివారం నుంచి జనవరి 13 వరకు వారంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారంలో సెంటిమెంట్ వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. ఈ వారం ప్రారంభంలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరి కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. మానసిక ప్రశాంతతతో కాలాన్ని గడుపుతారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యం అవుతాయి. మీ జీవిత భాగస్వామితో సఖ్యత బలపడుతుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. Medical Agencies వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. అప్పు కొంత తీరుస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారంలో పోలీసు శాఖ వృత్తిలో ఉన్నవారికి స్థానచలనం కలిగే అవకాశం కలదు. స్నేహితులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. తల్లి ఆరోగ్యం కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. మీ పిల్లల ప్రవర్తన వలన మీరు ఇబ్బంది పడే అవకాశం కలదు. స్థిరాస్తి కొనుగోలుకై మీ జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. సుగంధ ద్రవ్యాల వ్యాపారస్తులకు నష్టములు కలుగును. Joints pains ఒక సమస్యగా మారుతుంది. తండ్రి తరపు ఆస్తి చేతికి అందుతుంది. పాత బాకీలు కొంత వసూలు అవుతాయి. సమయానికి ధనం సర్దుబాటు అవుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసే విద్యార్థులకు వీసా మంజూరు అవుతుంది. వారం చివరలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన చెప్పదగిన సూచన.

 మిధున రాశి

ఈ రాశి వారికి ఈ వారంలో సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార భాగస్వాములతో తగాదాలు ఏర్పడతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణ సమయంలో విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవడం చెప్పదగిన సూచన. Skin infectionsతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. యోగ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. Oil వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. రవాణా శాఖ ఉద్యోగస్తులకు స్థాన చలనము కలిగే అవకాశాలు కలవు. తల్లి తరపు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సినిమా రంగంలో ఉన్నవారికి అవకాశాలు చేయి జారిపోతాయి. బ్యాంకు లోన్స్ మంజూరు అవుతాయి. వడ్డీ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Ayodhya Ram Mandir | రాత్రి వేళ రామ మందిరం ఇలా ఉంటుంది.. ఫొటోలను షేర్‌ చేసిన ట్రస్ట్‌

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారంలో ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్నవారికి పని భారం అధికంగా ఉంటుంది. పొత్తికడుపు లేదా నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయం సాధిస్తారు. మిఠాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. స్నేహితులకు ఎదురైన సమస్యలకు పరిష్కారాన్ని చూపుతారు. దైవ కార్యక్రమములకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఇతరులు మీ మాటలతో ఏకీభవిస్తారు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. Chit Fund వ్యాపారస్తులకు గతంలో చేసిన పొరపాట్లకు తగు మూల్యం చెల్లించవలసి వస్తుంది. నూతన వ్యాపార ప్రారంభముకై అడుగులు వేస్తారు. మహాలక్ష్మి అమ్మ వారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ వారంలో కుల వృత్తి లేదా తండ్రి వ్యాపార వృత్తి చేసే వారికి యోగ కాలము. మీ జీవిత భాగస్వామితో సరదాగా కాలాన్ని గడుపుతారు. అజీర్ణం ఒక సమస్యగా మారుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో తండ్రి అంగీకారాన్ని అడుగుతారు. విద్యార్థులు శ్రమ చేయవలసిన సమయం. స్నేహితుల విషయాలు కుటుంబ సభ్యులతో చర్చించకూడదు. నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ ఎదుగుదలను చూసి తల్లితండ్రులు ఆనందిస్తారు. సంతాన ప్రయత్నాలు చేసే వారికి ఇబ్బందులు ఉండును . Home Needs వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. ఆర్థికపరమైన ఎదుగుదల కోసం ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. చండి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

కన్య రాశి

కన్య రాశి వారికి ఈ వారంలో ప్రయాణాలలో విలువైన వస్తువులు జారవిడుచుకునే అవకాశం కలదు. బంగారం కొనుగోలు చేస్తారు. గృహమునందు శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. రక్షణ శాఖ ఉద్యోగస్తులకు పనిభారం ఉండును. మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. కండరాల నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. మతిమరుపు వలన సమస్యలు వస్తాయి. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. దాంపత్య పరమైన సౌఖ్యం ఉంటుంది. విద్యార్థులు తమ కష్టాన్ని నమ్ముకోవడం ద్వారా విజయం సాధించగలుగుతారు. Rice mill వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉండును. పిల్లలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసే అవకాశం కలదు. విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. గణపతి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Water Crissis | ఒకప్పటి వేయి సరస్సుల నగరం బెంగళూరులో నీటి సంక్షోభానికి అసలు కారణాలేంటీ?

తులా రాశి

తుల రాశి వారికి ఈ వారంలో సంకల్పించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. వాత సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. జూదం వలన నష్టపోతారు. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. కుటుంబ పరమైన సౌఖ్యం ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు Income tax నుండి నోటీసులు అందుకునే అవకాశం కలదు. విదేశాలలో నివసించే ఒక స్నేహితుని సహాయం ఆనందాన్ని కలిగిస్తుంది. Software ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్త పాటించాలి. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి. ధనపరమైన ఇబ్బందులు తొలగడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారంలో సెంటిమెంట్ వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పాత బాకీలు కొంత వసూలు అవుతాయి. ముఖ్యమైన విషయాలు మరచిపోకూడదు. సంతానం కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. శత్రువులని కూడా మంచి మనసుతో చేరదీస్తారు. photography fieldలో ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది. తీర్థయాత్రలు వాయిదా పడతాయి. విలాసవంతంగా కాలాన్ని గడుపుతారు. నూతన వధూవరులు మనస్పర్ధలకు దూరంగా ఉండాలి. Paints & Chemical వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. ప్రభుత్వానికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. భూమికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. ఈశ్వర ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి ఈ వారంలో సంతాన ఎదుగుదలను చూసి ఆనందిస్తారు. విద్యార్థులకు యోగ కాలము. ముఖ్యమైన నిర్ణయాలు స్నేహితులతో చర్చించి తీసుకుంటారు. మానసిక ఆందోళనను ధైర్యంగా అధిగమించాలి. Insurance ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. చెడు ఆలోచనలకు మరియు వ్యసనాలకు దూరంగా ఉండండి. మీరు ఇతరుల మీద చూపించే ప్రేమ మరియు ఆరాటం వల్ల నష్టపోయే అవకాశం కలదు. మీ వ్యాపార భాగస్వాములతో తగాదాలు కొంత తగ్గుముఖం పడతాయి. నడుము నొప్పి ఒక సమస్యగా మారుతుంది. Food items వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండను. రాజకీయ నాయకులతో కలహం అంత మంచిది కాదు. మీ శ్రమకి దగ్గర గుర్తింపు లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణములు వాయిదా పడతాయి. దుర్గ అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారంలో నూతన భూ గృహ కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. వార ప్రారంభంలో కుటుంబ సభ్యులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. సోదరీ సోదరులతో సఖ్యత బలపడుతుంది. Emitation jewellery వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సంతాన ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన సమయం. గృహంలో అలంకరణ వస్తువులకై ధన వ్యయము చేయవలసి వస్తుంది. Printing Press వారికి కొంత నష్టం కలుగుతుంది. క్రీడారంగంలో ఉన్న వారికి అవకాశాలు చేజారిపోతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. నూతన విద్యను అభ్యసించే విద్యార్థులకు యోగ కాలము. ఆర్థికపరమైన ఎదుగుదల మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Utter Pradesh | యూపీలో యోగీ ఎఫెక్ట్.. అవినీతి అధికారులను విధుల నుంచి తొలగింపు..

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ వారంలో శారీరక శ్రమ గోచరిస్తుంది. ఆభరణాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కలదు. ధనపరమైన ఇబ్బందులు తొలుగుతాయి. స్నేహితుల సలహాలు సూచనలు పాటిస్తారు. విద్యార్థులకు యోగధాయకమైన కాలము. దూర ప్రాంత ప్రయాణములు వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. సినిమా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాలుపంచుకుంటారు. పోలీస్ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు ఉండును. పాల వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. అప్పు కొంత తీరుస్తారు. తలనొప్పితో మరియు రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. కుటుంబ పరమైన కలహాలకు దూరంగా ఉండాలి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారంలో సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. సోదరుల కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. కుటుంబ పరమైన సౌఖ్యం ఉంటుంది. ఏ నిర్ణయమైనా Emotionalగా కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఏర్పడతాయి. సంకల్పించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. Navy & Defence department ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. Furniture వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన permissions మంజూరు అవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉష్ణ సంబంధిత ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకుంటారు మరియు విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. కాలభైరవ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

suman Sharma

స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక
డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ
7730023250, 8978510978


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *