TTD: తిరుమలలో హిందూయేతర ఉద్యోగులకు షాక్..
TTD Non-Hindu Employees | ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన హిందూ దేవాలయంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో హిందూయేతర ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ లేదా ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలనే తీర్మానాన్ని ఆమోదించింది.
ఈ నిర్ణయంతో ఎంత హిందూయేతర సిబ్బందిపై ప్రభావం పడుతుందో తెలియదు..అయితే 7,000 మంది శాశ్వత ఉద్యోగులలో 300 మందిపై ప్రభావం చూపే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు TTD లో సుమారు 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో కూడా కొందరు ప్రభావితం కావచ్చు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ చట్టం, TTD చట్టానికి అనుగుణంగా ఉందని పలువురు టీటీడి ఉద్యోగులు చెబుతున్నారు. ఓ యూనియన్‌కు చెందిన ప్రతినిధి మాట్లాడుతూ, “ఈ నిర్ణయాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు. అక్టోబర్ 31న అధికారం చేపట్టిన TTD ఛైర్మన్ నాయుడు (TTD Chairman B.R. Naidu ) దేవాలయాన్ని నడిపేందుకు హిందువులను మాత్రమే హక్కు కల్పించాలని గతంలో పేర్కొంది.
TTD Non-Hindu Employees : 1989 నుంచి వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వు TTD-నిర్వహణలో ఉన్న పోస్టులకు అన్ని నియామకాలు తప్పనిసరిగా హిందువులకే పరిమితం చేయబడాలని పేర్కొంది. అయితే ఈ నిబంధనలను గత ప్రభుత్వాలు తుంగలో తొక్కి హిందూయేతర ఉద్యోగులు టీటీడీలోకి తీసుకొచ్చారు. దీంతో హిందూ సిబ్బంది నుంచి ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం జూన్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫిర్యాదులు పెరిగాయి. తమ సహోద్యోగుల్లో కొందరు ఇతర మతాలకు చెందినవారు ఉన్నారని ఆరోపణలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థలు, ఎండోమెంట్స్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లో రూల్ 3, మతపరమైన సంస్థల ఉద్యోగులు తప్పనిసరిగా హిందూ మతాన్ని పాటించాలని ఆదేశించింది. ఏది ఏమైనప్పటికీ, TTD తాజా నిర్ణయం ఆలయం మతపరమైన గుర్తింపు, దాని దీర్ఘకాల ఆచారాలను బలపరిచేలా ఉందని హిందూ సంఘాలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు