Tirumala Laddu | దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ వ్యవహారం..
Tirumala Laddu Controversy | కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి దేవస్థానం అంటేనే ప్రపంచ వ్యాప్తంగా హిందువుల్లో ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అందులో తిరుమల లడ్డూ అనగానే అందరికీ ఎంతో పవిత్రమైనదిగా, ప్రతీకరమైనదిగా భావిస్తారు. అద్భుతమైన రుచికి ఈ లడ్డూకు ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే ఈ లడ్డూ తయారీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తిరుమల లడ్డూ తయారీలో గత ప్రభుత్వం ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడం సంచలనం గా మారింది. ఇదే ఇప్పుడు సర్వత్రా దుమారం రేపుతోంది.
చంద్రబాబు వ్యాఖ్యల్ని టీటీడీ మాజీ ఛైర్మన్లు కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. తిరుమల లడ్డూ తయారీలో కుటుంబంతో సహా ప్రమాణం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. కరుణాకర్ రెడ్డి సైతం చంద్రబాబు వ్యాఖ్యల్నితప్పుబట్టారు. విషప్రచారం చేస్తే స్వామివారే శిక్ష విధిస్తారని మండిపడ్డారు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లడ్డూలను – ప్రసాదంగా పంపిణీ చేయడానికి – బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ మరియు పామాయిల్‌ను ఉపయోగిస్తున్నారు. తిరుపతిలోని ప్రముఖ శ్రీ వేంకటేశ్వర ఆలయంలో తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్వహిస్తోంది.
గుజరాత్ నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్‌లోని సెంటర్ ఆఫ్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్, లేదా CALF, ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికలో YSRCP అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి లడ్డూలను తయారు చేయడానికి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు వెల్లడించింది. నెయ్యిలో చేప నూనె, బీఫ్ టాలో, పందికొవ్వు జాడలు ఉన్నాయని పేర్కొంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో నాసిరకం పదార్థాలు, జంతువుల కొవ్వును ఉపయోగించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఆరోపించారు.
‘తిరుపతి లడ్డూ (Tirupathi Laddu) కూడా నాసిరకం పదార్థాలతో తయారైంది… నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారు’ అని బుధవారం ఎన్‌డిఎ శాసనసభా పక్ష సమావేశంలో నాయుడు అన్నారు. ప్రస్తుతం స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నామని, ఆలయంలోని ప్రతి వస్తువును శానిటైజ్ చేశామని, ఫలితంగా నాణ్యత పెరుగుతోందని సీఎం పేర్కొన్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనను టార్గెట్ చేశారు. ‘‘తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం మనకు అత్యంత పవిత్రమైన ఆలయం. తిరుపతి ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వినియోగించారని తెలిసి షాక్‌కు గురయ్యాను’ అని అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..