ఉద్యోగం నుంచి తొలగించారనే అక్కసుతో..

ఉద్యోగం నుంచి తొలగించారనే అక్కసుతో..

మొత్తం  మొబైల్ షాపునే లూటీ చేశాడు..

వరంగల్: తనను ఉద్యోగంలో నుంచి తొలగించాడనే అక్కసుతో తాను పనిచేసిన మొబైల్ షాపులో సెల్ ఫోన్లను చోరీ చేసిన దొంగను సీసీఎస్, హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. చోరీ చేసిన సెల్ ఫోన్లను విక్రయించేందుకు సహకరించిన మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.22 లక్షల విలువైన 78 స్మార్ట్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్ లు రెండు ట్యాబ్స్, రెండు స్మార్ట్ వాచ్ లు, కారు, ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ ఏవీ.రంగనాథ్ వెల్లడించారు. వరంగల్ పాపయ్యపేట చమన్ కు చెందిన ప్రధాన నిందితుడు రబ్బాని(30) బీకాం పూర్తిచేసి, కొద్ది రోజులు బిగ్ సి మొబైల్ షాపులో సెల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశాడు. అనంతరం 2018 నుంచి 2021 మధ్యకాలంలో నిందితుడు రబ్బాని హనుమకొండ చౌరస్తాలోని లాట్ మొబైల్స్ లో స్టోర్ మేనేజర్ గా పనిచేశాడు. కొన్నాళ్లకు రబ్బానీ వ్యవహారశైలి సరిగా లేకపోవడంతో షాపు యాజమాన్యం అతడిని తొలగించింది. దీంతో అప్పులు చేసి షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. రబ్బానీ మద్యంతో పాటు ఇతర చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలకున్నాడు. అతడు పనిచేసిన లాట్ మొబైల్ షాపున సంబంధించి గతంలో డూప్లికేట్ తాళం చెవులు తయారు చేసుకొని ఉన్నాడు. వాటి సాయంతో షాపు తెరిచి మొబైల్ ఫోన్లు చోరీ చేసి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకోవచ్చని భావించాడు. రబ్బానీ ముందుగా వరంగల్ ఎంజీఎం ప్రాంతంలో ఓ భవనంలోని మూడో అంతస్తులో ఒక షెటర్ ను అద్దెకు తీసుకున్నాడు. అనంతరం గత జనవరి 13న అన్ లైన్ లొ జస్ట్ డయల్ యాప్ ద్వారా వర్ధన్నపేట మండలం, ఇల్లందకు చెందిన ఒక వ్యక్తి వద్ద కారు కిరాయికి తీసుకున్నాడు. కారుకు ముందు, వెనుక కారు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను తొలగించాడు. ఇదే కారులో రబ్బానీ జనవరి 14న అర్ధరాత్రి 2గంటల సమయంలో హనుమకొండ చౌరస్తాలోని లాట్ మొబైల్ షాపునకు వచ్చి డుప్లికేట్ తాళం చెవులతో షాపు తెరిచాడు. షాపులోని సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ బాక్స్ వైర్లను కట్ చేసిన అనంతరం షాపులోని సెల్ ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్ టాప్ లు, ఇతర ఫోన్ సామగ్రిని చోరీ చేసి కారులో వేసుకొని పరారయ్యాడు. ఖమ్మం వైపు వెళ్తూ రాయపర్తి గ్రామ శివారులోని కెనాల్లో తాళం చెవులు, డీవీఆర్ ను పడేశాడు అనంతరం తిరిగి తొర్రూర్ నుంచి నర్సంపేట మీదుగా తాను ఎంజీఎం ప్రాంతంలో కిరాయి షెటర్లో తాను చోరీ చేసిన మొబైల్ ఫోన్లను భద్రపర్చాడు. theft in mobile shop

READ MORE  Delhi Liquor Policy Case : తెల్లవారుజాము నుంచి ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు

theft in mobile shop

ఢిల్లీ, హైదరాబాద్ లో విక్రయాలు

మూడు నెలల అనంతరం రబ్బానీ.. తన బాల్య స్నేహితుడైన ములుగుకు చెందిన ఫిరోజ్ ను అమ్మిపెట్టమని రెండు ఫోన్లు ఇచ్చాడు. దీంతో ఫిరోజ్ ఒక ఫోన్ ను ములుగుకు చెందిన యువతికి విక్రయించి ఆ డబ్బులను రబ్బానికి ఇచ్చాడు. నిందితులు ఇద్దరు కల్సి కొద్ది రోజులకు చోరీ చేసిన సెల్ ఫోన్ల డిస్ప్లేలను హైదరాబాద్ లోని జగదీష్ మార్కెట్లో విక్రయించగా, మరో కొన్ని ఫోన్లును ఢిల్లీకి వెళ్లి అక్కడ ఓలెక్స్ యాప్ ద్వారా విక్రయించారు. విక్రయించిన డబ్బులతో నిందితులిద్దరు జల్సాలు చేశారు. ఈ సంఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు క్రైమ్ డీసీపీ మురళీధర్, క్రైం ఏసీపీ డేవిడ్ రాజు ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోని నేరస్థులను గుర్తించారు. శనివారం ఉదయం మరికొన్ని మొబైల్స్ హైదరాబాద్ లో విక్రయించేందుకు వెళ్తుండగా పక్కా సమాచారంతో అలంకార్ జంక్షన్ వద్ద కారులో ప్రయాణిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా నేరాన్ని అంగీకరించారు.

READ MORE  'సీఎం గారూ.. ఆర్టీసీ బస్సుల్లో డబ్బులు పెట్టి నిలబడి ప్రయాణించాలా..?

పోలీసులకు సీపీ అభినందన

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైమ్స్ డీసీపీ మురళీధర్, ఏసీపీ డేవిడ్ రాజు, ఇన్ స్పెక్టర్ రమేష్ కుమార్, ఏఏఓ సల్మాన్ పాషా, హనుమకొండ ఇంచార్జ్ ఇన్ స్పెక్టర్ షూకూర్, సిసిఎస్ ఎస్ఐలు కె.సంపత్ కుమార్, బాపురావు, హనుకొండ ఎస్ఐ రాజు, సీసీస్ సిబ్బంది ఏ.ఎస్.ఐ తిరుపతి, హెడ్ కానిస్టేబుళు ఎ రవికుమార్, జంపయ్య, మహమ్మద్ ఆలీ, వేణుగోపాల్, కానిస్టేబుళ్ళు శ్రీనివాస్, నజీరుద్దీన్, శ్రీకాంత్లనువరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

READ MORE  నేడే అమరుల అఖండ జ్యోతి ప్రారంభం

Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *