Life Style

Ugadi 2026: పరాభవ నామ సంవత్సర వేడుకలు.. ముహూర్తాలు.. పూజా విధానం!

Spread the love

Ugadi 2026: తెలుగు కాలమానం ప్రకారం రాబోయే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్‌కు చెందిన ప్రముఖ పండితులు బ్రహ్మశ్రీ తుమ్మనేపల్లి రవీంద్రాచారి గారు పూజా ముహూర్తాలను ఉద్వాసన సమయాలను వెల్లడించారు.

ఉగాది పండుగ ముహూర్తాలు (మార్చి 19, 2026 – గురువారం):

  • పండుగ ప్రారంభం: ఉదయం 8:05 నిమిషాలకు ఉగాది పండుగ ప్రారంభమవుతుంది.
  • అమ్మవారిని ప్రతిష్టించడం: ఉదయం 9:40 నుండి మధ్యాహ్నం 2:20 నిమిషాల వరకు ఇళ్లలో మరియు వ్యాపార సంస్థలలో అమ్మవారిని కొలువుదీర్చడానికి అత్యంత శుభప్రదమైన సమయం.
  • పూజా కార్యక్రమం: ఇదే సమయంలో దేవతారాధన, అఖండ దీపారాధన మరియు ఇష్టదైవ ప్రార్థనలు నిర్వహించుకోవడం శుభకరం.

Ugadi 2026 : ముఖ్య గమనిక – అమావాస్య సమయం:

మార్చి 19, గురువారం ఉదయం 7:26 నిమిషాల వరకు అమావాస్య తిథి ఉంటుంది. కావున, అమావాస్య రోజునే అమ్మవారిని పెట్టుకునే ఆచారం ఉన్నవారు ఉదయం 5:50 నుండి 7:05 నిమిషాల లోపు వారి ఆచారాల ప్రకారం పండుగను జరుపుకోవచ్చు.

అమ్మవారి ఉద్వాసన సమయం:

పండుగ పూజ అనంతరం అమ్మవారిని కదిలించే (ఉద్వాసన) సమయం మార్చి 19, గురువారం సాయంత్రం 5:40 నుండి రాత్రి 7:26 నిమిషాల మధ్య ఇళ్లలో మరియు దుకాణాలలో అమ్మవారిని, అఖండ దీపాన్ని కదిలించడం శుభప్రదం.


శుభ ముహూర్తాలు వివరాలు:

పండుగ తర్వాత కొత్త పనులు ప్రారంభించడానికి లేదా ఇతర శుభ కార్యాలకు పండితులు సూచించిన ముహూర్తాలు:

  1. మార్చి 20 (శుక్రవారం): ఉదయం 9:20 నుండి 10:50 వరకు (రేవతి నక్షత్రం, వృషభ లగ్నం).
  2. మార్చి 21 (శనివారం): ఉదయం 9:20 నుండి 10:50 వరకు (అశ్విని నక్షత్రం, వృషభ లగ్నం). ఇది అశ్విని నక్షత్రం మరియు ఆదినక్షత్రం కాబట్టి అందరూ ఈ ముహూర్తాన్ని ఉపయోగించుకోవచ్చు.
  3. మార్చి 25 (బుధవారం): ఉదయం 9:10 నుండి 10:30 వరకు (మృగశిర నక్షత్రం, వృషభ లగ్నం).

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *