Monday, September 1Thank you for visiting

Telangana

telangana hyderabad andhrapradesh india telugu telugumemes mumbai kerala tollywood delhi chennai instagram warangal hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata

Etela Rajender | ఎక్కడికి రావాలో చెప్పండి..  రేవంత్ రెడ్డి సవాల్‌కు ఈటల సై

Etela Rajender | ఎక్కడికి రావాలో చెప్పండి.. రేవంత్ రెడ్డి సవాల్‌కు ఈటల సై

Telangana
Etela Rajender Fires on CM Revanth Reddy | హామీల చర్చపై ముఖ్యమంత్రి రేవంత్ చేసిన సవాల్ ను స్వీకరిస్తున్నానని బిజెపి నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.  హామీల అమలుపై చర్చకు ప్రధాని మోదీ అవసరంలేదని, ఎక్కడికి రావాలో చెబితే వచ్చేందుకు తాము సిద్ధమని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు మాత్రమే కాకుండా.. 420 హామీలపై చర్చిద్దామని ప్రతిసవాల్ విసిరారు. హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో జ‌రిగిన ప్రెస్ మీట్ లో ఈటల రాజేందర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది ప్రజాపాలన  వేడుకలపై ప్రజలు నవ్వుకుంటున్నారని, మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందంటున్నారని ఎంపీ ఈట‌ల అన్నారు.ముచ్చర్లలో గత ప్రభుత్వం 14 వేల ఎకరాలు భూ సేకరణ చేశారు. ఆ భూములు పోగొట్టుకున్న రైతులు కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఫార్మా సిటీ (Pharma city ) రద్దు చేసి...
Rains | ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు

Rains | ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు

Andhrapradesh, Telangana
బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రరూపం దాల్చుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వెంట ఈ వాయుగుండం కేంద్రీకృతమై  ఉందని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు ,తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు పలు జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. నేడు రాష్ట్రంలో పగటి పూట వాతావరణం పొడిగా ఉంటుందని.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఇక అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అల్పపీడనం క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ నైరుతి దానిని ఆనుకుని పశ్చిమ మధ్య బ...
Vikarabad |  సీఎం రేవంత్‌ రెడ్డి ఇలాకాలో కలెక్టర్‌పై రైతుల ళ్ల దాడి

Vikarabad | సీఎం రేవంత్‌ రెడ్డి ఇలాకాలో కలెక్టర్‌పై రైతుల ళ్ల దాడి

Telangana
Farmers Attack On Vikarabad Collector | ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇలాకాలో ఫార్మా సిటీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపట్టారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజవకర్గం లగచర్ల గ్రామంలో ఓ ఫార్మాసంస్థ భూసేకరణ కోసం అధికారులు చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ ఉద్రిక్తంగా  మారింది. గ్రామసభ నిర్వహించేందుకు రెవెన్యూ సిబ్బందితో కలిసి వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో స్థానికులు వాగ్వాదానికి దిగారు. గ్రామసభను ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామ సభ వద్ద ఉన్న ఇద్దరు రైతుల అభ్యంతరంతో కలెక్టర్‌ లగచర్ల గ్రామానికి చర్చల కోసం బయలుదేరారు.కలెక్టర్‌ గ్రామంలోకి  రాగానే ఆయనకు వ్యతిరేకంగా రైతులు ఒక్కసారిగా నినాదాలతో హోరెత్తించారు. కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ వెనక్కి వెళ్లిపోవాలంటూ కారుపై రాళ్లను విసిరారు. కారు దిగి రైతులతో చర్చించి ఒప్పించేందుకు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ ప్రయత్నించారు. ఈ...
Praja Vijayotsavalu | ఈనెల 14 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రజా విజయోత్సవాలు 

Praja Vijayotsavalu | ఈనెల 14 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రజా విజయోత్సవాలు 

Telangana
November 14th Praja Vijayotsavalu | రాష్ట్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నందున ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా పలు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాలపై  ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య పుంజాల, ప్రజాకవి జయరాజ్, వివిధ శాఖల కార్యదర్శులు  పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ..  ఈ సంవత్సర కాలంలో ఎన్నో విప్లవాత్మక, ...
Cherlapalli railway station | ప్రారంభానికి సిద్ధమైన చర్లపల్లి స్టేషన్.. ఇక్కడి నుంచి నడిచే ఎక్స్ ప్రెస్ రైళ్ల లిస్టు ఇదే..

Cherlapalli railway station | ప్రారంభానికి సిద్ధమైన చర్లపల్లి స్టేషన్.. ఇక్కడి నుంచి నడిచే ఎక్స్ ప్రెస్ రైళ్ల లిస్టు ఇదే..

Telangana
Cherlapalli railway station : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరికొద్ది రోజుల్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రానుంది. పనులన్నీ పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దమైంది. ఈమేరకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సోమవారం ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. మినిష్టర్ క్వార్టర్స్ లో నిర్వహించిన సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ (MP Eetala Rajendar), మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ టి.శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, టీజీఐఐసీ వైస్ ఛైర్మన్ అండ్ ఎండీ విష్ణువర్దన్ రెడ్డి, రైల్వే కన్ స్ట్రక్షన్ సీఈ సుబ్రమణ్యం, రైల్వే సీనియర్ డెన్ కోఅర్డినేషన్ రామారావు, కీసర ఆర్డీఓ పులి సైదులు, కాప్రా డిప్యూటీ కమిషనర్ పాల్గొన్నారు.ఈ సమావేశంలో రైల్వే స్టేషన్ కు అవసరమైన భూములు ఇచ్చేందుకు గాను టీజీఐఐసీ,...
TG TET APPLICATION | నవంబర్‌ 7 నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ

TG TET APPLICATION | నవంబర్‌ 7 నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ

Telangana
TG TET APPLICATION | తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ నెల 7 నుంచి దరఖాస్తులు చేసుకోవాలని విద్యాశాఖ వెల్లడించింది. తెలంగాణలో సోమవారం టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. తొలుత నవంబర్‌ 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. అయితే పలు కారణాలతో  తాజాగా స్వల్ప  మార్పులు చేశారు. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది మే 20వ తేదీ నుంచి జూన్‌ 2 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించింది. రెండో విడత టెట్‌కు నవంబర్ లో నోటిఫికేషన్‌ జారీ చేసి జనవరిలో పరీక్షలు జరుపుతామని గత ఆగస్టులో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసినపుడు  ప్రభుత్వం ప్రకటించింది.  ఈ క్రమంలోనే సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.  టెట్‌...
New Energy Policy in Telangana | రాష్ట్రంలో త్వరలో కొత్త విద్యుత్ పాలసీ

New Energy Policy in Telangana | రాష్ట్రంలో త్వరలో కొత్త విద్యుత్ పాలసీ

Telangana
New Energy Policy in Telangana |  తెలంగాణలో త్వరలో నూతన ఎనర్జీ పాలసీని తీసుకు వొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం విద్యుత్ రంగంలో మేధావులు, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti vikramarka)  పలు కీలక విషయాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో రూ.35 వేల కోట్లతో చేపట్టిన వైటీపీఎస్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలు సందర్శించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కు రామగుండం నుంచి సరఫరా అయ్యే బొగ్గు గూడ్స్ వ్యాగిన్ కు జెండా ఊపి మంత్రులు ప్రారంభించారు. ప్లాంట్ ను సందర్శించిన మంత్రులు పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్ ను మంత్రులు ఈ సందర్భంగా ప్రారంభించారు.ఇప్పటికే రెండో యూనిట్‌ను సెప్టెంబర్ 11న...
Telangana | పేద‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ మ‌రికొద్ది రోజుల్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ ల‌బ్దిదారుల ఎంపిక‌

Telangana | పేద‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ మ‌రికొద్ది రోజుల్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ ల‌బ్దిదారుల ఎంపిక‌

Telangana
Indiramma Housing Scheme | సొంతింటి కోసం ఎదురుచూస్తున్న‌ నిరుపేద‌ల‌కు గుడ్ న్యూస్‌.. మ‌రికొద్ది రోజుట్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ 15 రోజుల్లో గ్రామ క‌మిటీల ద్వారా ల‌బ్ధిదారుల‌ ఎంపిక పూర్తి చేయ‌నున్నారు. గ్రామాల్లో ఇందిర‌మ్మ క‌మిటీల ఎంపికే తుది నిర్ణ‌య‌మ‌ని, ఇండ్లు కూడా మ‌హిళ‌ల పేరిటే మంజూరు చేస్తామ‌ని గృహ‌నిర్మాణ‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి (Punguleti Srinivas Reddy) తెలిపారు. మ‌రో ముఖ్య విష‌య‌మేమిటంటే ఈసారి ల‌బ్దిదారులే సొంతంగా ఇండ్లు నిర్మించుకునే చాన్స్ క‌ల్పిస్తున్నారు. రాజ‌కీయ జోక్యం లేకుండా నిరుపేద‌లకు తొలి ప్రాధాన్యం ఇస్తామ‌ని మంత్రి తెలిపారు. ల‌బ్దిదారుల ఎంపిక‌లో ప్ర‌త్యేక యాప్ దే కీల‌క‌పాత్ర‌, అందుకే ఇంత స‌మ‌యం ప‌ట్టింద‌ని వివ‌రిచారు. ఆధార్‌తో స‌హా అన్నివివరాలు కొత్త‌గా తీసుకొస్తున్న‌ యాప్ లో పొందుప‌రుస్తారు. ఎలాంటి డిజైన్లు లేవు.. ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ...
భక్తులకు శుభవార్త..  కార్తీకమాసం శైవక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్‌ సర్వీస్ లు

భక్తులకు శుభవార్త.. కార్తీకమాసం శైవక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్‌ సర్వీస్ లు

Telangana
RTC Karthika Masam Special Buses : పవిత్ర కార్తీక‌ మాసంలో రాష్ట్రంలోని ప్ర‌సిద్ధ‌ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (TGSRTC MD Sajjanar ) వివ‌రాల‌ను వెల్లడించారు. వేముల‌వాడ, శ్రీశైలం, ధ‌ర్మపురి, కీస‌ర‌గుట్ట, త‌దిత‌ర దేవాల‌యాల‌కు హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక‌ బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని స‌జ్జ‌నార్‌ పేర్కొన్నారు. ఆర్టీసీ ప‌నితీరు, కార్తీక‌మాసం ఛాలెంజ్, శ‌బ‌రిమ‌ల ఆపరేష‌న్స్‌, మహాల‌క్ష్మి-మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కం త‌దిత‌ర అంశాల‌పై హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్ నుంచి ఉన్నతాధికారులతో ఈరోజు ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ వీడియో కాన్ఫ‌రెన్స్‌ నిర్వహించారు. కార్తీకమాసంలో స్పెషల్‌ బస్‌లు : టీజీఎస్‌ ఆర్టీసీకి కార్తీక‌ మాసం, శ‌బ‌రిమ‌ల యాత్ర‌ ఎంతో కీల‌క‌మ‌ని, భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా త‌గిన చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆయ‌న‌ అ...
హైదరాబాదీలకు గుడ్ న్యూస్ : మెట్రో ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్..

హైదరాబాదీలకు గుడ్ న్యూస్ : మెట్రో ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్..

Telangana
Hyderabad Metro Rail Second Phase Update | హైదరాబాద్‌లో కొత్త మెట్రో మార్గాల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు పరిపాలన పరమైన అనుమలు ఇస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది.  ఐదు రూట్ల మేర 76.4 కిలోమీటర్ల పొడవుతో ఈ మెట్రో లైన్ ను నిర్మించనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలో మీటర్ల మేర మెట్రో లైన్ నిర్మాణం పార్ట్ B ఆరో రూట్ గా ఉంది. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ లో విస్తరణలో మొత్తం 116.4 కిలో మీటర్ల పొడవు కొత్తగా మెట్రో ట్రైన్లు ప్రజలకు సేవలందించనున్నాయి. ఇందుకోసం రూ.24.269 వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు  ప్రభుత్వం పేర్కొంది. ఐదు కారిడార్లునాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ : 36.8 కిలో మీటర్లు రాయ్ దుర్గం నుంచి కోకాపేట్ : 11.6 కి.మీ MGBS నుంచి ఓల్డ్ సిటీ : 7.5 కి.మీ మియా పూర్ నుంచి పటాన్ చెర్వు ;...