Saturday, August 30Thank you for visiting

Telangana

telangana hyderabad andhrapradesh india telugu telugumemes mumbai kerala tollywood delhi chennai instagram warangal hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata

కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నో చాన్స్‌

కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నో చాన్స్‌

Telangana
స్ప‌ష్టం చేసిన‌ సీఎం రేవంత్ రెడ్డిOutsourcing Employees Regularization : సమగ్ర శిక్ష అభియాన్‌ కాంట్రాక్టు (Contract Employees), ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవకాశం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) స్ప‌ష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల‌ను రెగ్యులరైజ్‌ చేస్తే న్యాయ‌స్థానాల్లో సమస్యలు వస్తాయని చెప్పారు. క్రమబద్ధీకరించేందుకు అవకాశం లేకపోయినా పట్టుబడితే సమస్య మ‌రింత జటిలమవుతుంది తప్ప పరిష్కారం కాదని ఆయ‌న అన్నారు. సమస్యల పరిష్కారానికి ధర్నాలు చేయాల్సిన పని లేదని.. చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. రాజకీయాల కోసం కొందరు నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారని.. అలాంటి నేతల ఉచ్చులో పడితే చివరకు ఉద్యోగులే నష్టపోతారని సీఎం రేవంత్ హితువు ప‌లికారు. ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని ఉన్నప్పటికీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని ముఖ్య‌మం...
Sankranti Festival Special buses | సంక్రాంతి సంద‌ర్భంగా  తెలుగు రాష్ట్రాలకు ప్ర‌త్యేక బ‌స్సులు

Sankranti Festival Special buses | సంక్రాంతి సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాలకు ప్ర‌త్యేక బ‌స్సులు

Andhrapradesh, Telangana
Sankranti Festival Special buses : సంక్రాంతి పండుగ (Sankranti Festival) సంద‌ర్భంగా తెలుగురాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు టీజిఎస్ఆర్‌టిసి శుభ‌వార్త చెప్పింది. ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా హైద‌రాబాద్ తో పాటు తెలంగాణ‌లోని ప్ర‌ధాన న‌గ‌రాలు ఆంధ్రప్రదేశ్‌కు 300 ప్రత్యేక బస్సులు సహా 6,500 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఆర్టీసీ (TGSRTC) తెలిపింది.సాధారణ సర్వీసుల కంటే 1.5 శాతం ఎక్కువగా ఉంటుంది. జనవరి 7 నుంచి 15 వరకు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు సర్వీసులు నడపనున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ కేటగిరీలకు చెందిన ఈ ప్రత్యేక బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుంది, కానీ రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రమే. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. జనవరి 10న 1,600 బస్సులు, 1900 బస్సులు నడిచే జనవరి 11న భారీ డిమాండ్‌ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రధ...
Greenfield Express way : ఉత్త‌ర తెలంగాణ‌లో ఆర్‌ఆర్‌ఆర్.. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వకు టెండ‌ర్లు

Greenfield Express way : ఉత్త‌ర తెలంగాణ‌లో ఆర్‌ఆర్‌ఆర్.. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వకు టెండ‌ర్లు

Telangana
తెలంగాణ‌లోని రీజినల్ రింగ్ రోడ్డు (RRR project) ఉత్తర భాగాన్ని నిర్మించే ప్రక్రియను కేంద్రం (Central government) ప్రారంభించింది. Greenfield Express way గా నిర్మించేందుకు టెండ‌ర్ల‌ను ఆహ్వానించింది. ఫోర్‌లేన్‌ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా దీన్నినిర్మిస్తున్నారు. ప్ర‌తిష్టాత్మ‌క మౌలిక సౌక‌ర్యాల ఈ ప్రాజెక్టును ఐదు ప్యాకేజీలుగా విభ‌జించారు. రూ. 7,104.06 కోట్ల అంచ‌నా వ్య‌యంతో ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ (Regional Ring Road) ) నిర్మాణాన్ని చేప‌డుతున్నారు. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పర్యవేక్షిస్తోంది.161.518 కిలోమీటర్ల Greenfield Express way నిర్మాణంగ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం సుమారు 161.518 కిలోమీటర్ల పొడవున కొనసాగుతుంది. ఇది సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా టంగడపల్లి వరకు సాగుతుంది. దీని ప‌నుల‌ను రెండేళ్ల‌లో పూర్తి చేయాల‌ని కా...
2025 Holiday List | 2025 సెలవుల జాబితా విడుదల.. పూర్తి వివరాలు ఇవే..

2025 Holiday List | 2025 సెలవుల జాబితా విడుదల.. పూర్తి వివరాలు ఇవే..

Telangana
2025 Holiday List : రాష్ట్రంలోని విద్యార్థులు, ఉద్యోగులు ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. మరికొద్దిరోజుల్లోనే కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో.. 2025 సంవత్సరానికి సంబంధించిన పబ్లిక్, ఆప్షనల్ హాలిడేస్ వివ‌రాల‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 2025 ఏడాదిలో మొత్తం 27 సాధారణ సెలవులు వొస్తుండగా.. 23 ఆప్షనల్ హాలిడేస్ ఇస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.జనవరి ఒకటో తేదీతోనే సెలవుల జాబితాను మొదలుపెట్టిన ప్రభుత్వం.. జనవరి 14న సంక్రాంతి పండుగకు.. మార్చి 30న ఉగాది పండుగకు, ఆగస్టు 27న‌ వినాయక చవితి, అక్టోబర్ 3న విజ‌య‌ద‌శ‌మి(Dasara).. అక్టోబర్ 20న దీపావళి లాంటి ముఖ్య‌మైన‌ పండుగలన్నింటికి ఎప్పటిలాగే ప్రభుత్వ సెలవులను ప్రకటించింంది. అయితే.. జనవరి ఒకట‌వ తేదీన సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. అందుకు బదులుగా ఫిబ్రవరి 10న రెండ‌వ‌ శనివారాన్ని వర్కింగ్ డేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు వెల్లడించి...
ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వంకీలక అప్ డేట్

ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వంకీలక అప్ డేట్

Telangana
Indiramma Illu Scheme | రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే నాలుగేళ్ల‌లో నిరుపేద‌ల కోసం 20 ల‌క్ష‌ల ఇండ్ల‌ను నిర్మిస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) మంగళవారం వెల్ల‌డించారు. హియాయ‌త్‌న‌గ‌ర్‌లోని హౌసింగ్ కార్పొరేష‌న్ కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మీక్షించారు.33 జిల్లాలకు 33 మంది ప్రాజెక్టు డైరెక్టర్లుఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల‌కు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ స్ధాయి ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ల‌ను నియ‌మించారు. ప్రతి సంవత్సరం నాలుగున్న‌ర ల‌క్ష‌ల చొప్పున రానున్న నాలుగేళ్ల‌లో 20 ల‌క్ష‌ల‌కు పైగా నిరుపేద‌ల‌కు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామ‌ని మంత్రి చెప్పారు. హౌసింగ్ కార్పొరేష‌న్ బ‌లోప...
Discount On iPhone 15 Plus : ఐఫోన్ పై బిగ్ డిస్కౌంట్ డీల్స్

Discount On iPhone 15 Plus : ఐఫోన్ పై బిగ్ డిస్కౌంట్ డీల్స్

Telangana
Discount On iPhone 15 Plus : ఐఫోన్ పై బిగ్ డిస్కౌంట్ డీల్స్ ఐఫోన్ ల‌వ‌ర్స్ కు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ లో iphone 15 పై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ కొస‌సాగుతున్న విష‌యం తెలిసిందే.. ఈ డిస్కౌంట్ సేల్‌లో భాగంగా iPhone 15 Plus పై అద్భుతమైన డీల్ ప్ర‌వేశ‌పెట్టింది.కస్టమర్లు ఈ ఫోన్ ను రూ. 20 వేల వరకు త‌క్కువ ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 15 ప్లస్ మొబైల్ 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 89,900 ధరకు ప్రారంభించారు. అయితే, ఇప్పుడు దీని ధర రూ. 79,900కి తగ్గింది. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సంద‌ర్భంగా దీని ధ‌ర కేవలం రూ. 63,999 కి ప‌డిపోయింది.ఆఫర్ ఎలా పొందాలి?ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో మీరు ఏ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌తో చెల్లించినా రూ.1,000 తగ్గింపు అందిస్తున్నారు. అలాగే Flipkart UPI లేదా ఇతర UP...
Highway Roads | తెలంగాణలో సరికొత్త మోడల్ లో రహదారుల అభివృద్ధి

Highway Roads | తెలంగాణలో సరికొత్త మోడల్ లో రహదారుల అభివృద్ధి

National, Telangana
Hyderabad : రహదారి మౌలిక సదుపాయాలను (Highway Roads ) మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ను అమలు చేయాలను భావిస్తోంది. ఈ నమూనా కింద రాష్ట్ర రహదారులు, రోడ్లు - భవనాలు (R&B) శాఖ నిర్వహించే రోడ్లు, పంచాయతీ రాజ్ (PR) శాఖ పర్యవేక్షించే గ్రామీణ రహదారులను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తొలిదశలో రూ.28,000 కోట్ల అంచనా వ్యయంతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయనున్నారు.HAM నమూనా అంటే ఏమిటి?బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (BOT), ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (EPC) ఫ్రేమ్‌వర్క్‌ల సమ్మేళనం అయిన HAM మోడల్, 2016లో భారతదేశంలో జాతీయ రహదారి ప్రాజెక్టుల కోసం ప్రవేశపెట్టారు. HAM కింద ప్రభుత్వం ప్రాజెక్ట్ వ్యయంలో 40 శాతం నిధులు సమకూరుస్తుంది. అయితే ఇందులో ఈక్విటీ, రుణాల ద్వారా ప్రైవేట్ డెవలపర్లు మిగిలిన 60 శాతాన్ని ...
New Flyovers | హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడానికి ఐటీ కారిడార్‌లో త్వరలో 3 కొత్త ఫ్లైఓవర్లు

New Flyovers | హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడానికి ఐటీ కారిడార్‌లో త్వరలో 3 కొత్త ఫ్లైఓవర్లు

Telangana
New Flyovers in Hyderabad : ట్రాఫిక్ జామ్‌లను పరిష్కరించడానికి, ఐటీ కారిడార్‌లో వేగ పరిమితులను పెంచే ప్రయత్నంలో, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) నగరంలో మూడు మల్టీ-లెవల్ ఫ్లైఓవర్‌లను నిర్మించాలని యోచిస్తోంది. దీని కోసం రూ. 800 కోట్లకు పైగా కేటాయించింది.ఎక్కడెక్కడంటే..GHMC ప్రణాళికలతో ఖాజాగూడ, విప్రో మరియు IIIT జంక్షన్లలో మూడు బహుళ-స్థాయి ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు.. ఐఐఐటీ జంక్షన్‌ ప్రాజెక్టుకు రూ.459 కోట్లు, ఖాజాగూడలోని మరో రెండు ఫ్లైఓవర్‌లకు రూ.220 కోట్లు, విప్రో జంక్షన్‌లకు రూ.158 కోట్లు కేటాయించారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌ వరకు రోడ్డు విస్తరణకు మరో ప్రతిపాదన కూడా ఉంది. హైదరాబాద్‌లోని ఈ మూడు కొత్త ఫ్లైఓవర్‌లు ట్రాఫిక్‌ను సులభతరం చేయడమే కాకుండా నగరం మౌలిక సదుపాయాల వృద్ధికి దోహదపడతాయి. అంతే కాకుండా, నగర వాసులకు మెరుగైన వేగవంతమైన ప్రయాణ అనుభూ...
Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..

Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..

Telangana
Indiramma Housing Scheme | రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే నాలుగేళ్లలో ద‌శ‌ల వారీగా సుమారు 20 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్ర‌భుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. మొద‌టి విడ‌త‌లో ఈ ఏడాది నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 నుంచి 4,000 ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ల‌క్ష‌ల ఇండ్ల‌ను నిర్మిస్తామని చెప్పారు.ఆదివారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొద‌టి విడ‌త‌లో సొంత స్థలం ఉన్న‌వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాల‌ని, ఇక రెండో ద‌శ‌లో ప్ర‌భుత్వ‌మే నివాస స్ధ‌లంతో పాటు ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాల‌ని నిర్ణ‌యించిందని చెప్పారు. ఇందులో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్ జెండర్లు, సఫాయి కర్మచారులకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థికసాయం...
KCR | ఇది ప్రభుత్వం చేయాల్సిన పనేనా? కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్ ..

KCR | ఇది ప్రభుత్వం చేయాల్సిన పనేనా? కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్ ..

Telangana
KCR | కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొత్త‌గా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయ‌డంపై మాజీ సీఎం, బిఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల‌చంద్ర‌శేఖ‌ర్ రావు ఫైర్ అయ్యారు. ఇది ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నులు ఇవేనా అని ప్ర‌శ్నించారు. ఇది కాంగ్రెస్ మూర్ఖ‌త్వ‌మ‌ని కేసీఆర్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేప‌టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ‌మ‌వుతున్న‌ నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై కేసీఆర్ (KCR) తీవ్ర అభ్యంత్రం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అంటూ ప్ర‌శ్నించారు. ప్రభుత్వం ముందుగా ప్ర‌జ‌ల‌ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల...