Saturday, January 24Thank you for visiting

Telangana

telangana hyderabad andhrapradesh india telugu telugumemes mumbai kerala tollywood delhi chennai instagram warangal hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata

Hydra Updates | ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రాకు ఎదురు లేదు..

Hydra Updates | ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రాకు ఎదురు లేదు..

Telangana
Hydra Updates |  హైదరాబాద్ నిరంతరం పరిశుభ్రమైన నగరంగా ఉండాలని అందుకే హైడ్రాను తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో పర్యావరణ పునరుజ్జీవనం జరగాలనే  ఉద్దేశంతోనే. హైడ్రాను ఏర్పాటు చేశామని,  ఒకప్పుడు లేక్‌ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌.. ఫ్లడ్స్‌ సిటీగా దిగజారిపోవడానికి గత పదేళ్ళ పాలకులే కారణమని విమర్శించారు. అక్రమ నిర్మాణాల ప్రక్షాళన కోసమే హైడ్రా ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం ప్రజాపాలన దినోత్సవంలో  ఆయన హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు.చెరువులు, నాలాలు కాపాడుకోకపోతే భవిష్యత్‌ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.  ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం ఎంతో మందిని బలిగొంది. అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు ఎప్పుడు కూడా రావొద్దు. హైడ్రా వెనుక ఎలాంటి రాజకీయ కోణం, స్వార్థం లేదు. ఇదొక పవిత్ర కార్యం.... ప్రకృతిని కాపాడుకునే మహా యజ్ఞం. దీనికి అందరూ ప్రతి ఒ...
Ration Cards | గుడ్ న్యూస్.. అక్టోబర్‌లో అర్హులందరికీ రేషన్‌ ‌కార్డులు

Ration Cards | గుడ్ న్యూస్.. అక్టోబర్‌లో అర్హులందరికీ రేషన్‌ ‌కార్డులు

Telangana
New Ration Cards |  పేద ప్రజలకు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి కబరు చెప్పింది. త్వరలో అర్హులైన నిరుపేదలకు రేషన్‌ ‌కార్డులు, హెల్త్ ‌కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. అది కూడా అక్టోబర్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌, ‌హెల్త్ ‌కార్డులు వస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సోమవారం కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ సమావేశం అనంతరం  మంత్రి ఉత్తమ్‌, ‌పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి  కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ భేటీలో చర్చించిన విషయాలను విలేఖరులకు వివరించారు.కొత్త రేషన్‌ ‌కార్డుల మంజూరు విషయమై విధివిధానాలు రూపొందిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. తెల్ల రేషన్‌ ‌కార్డు అర్హులు ఎవరనేదానిపై త్వరలో జరగనున్న సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్‌ ‌కార్డులను ఎలా మంజూరు చేస్తున్నారనేదానిపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. రేషన్‌ ‌కార్డుల నిబంధనలు ఎలా  ఉండాలని పార్ట...
Rs.500 Gas Cylinder | రూ.500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మీ ఖాతాలో జమ కావటం లేదా..? అయితే ఇలా చేయండి

Rs.500 Gas Cylinder | రూ.500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మీ ఖాతాలో జమ కావటం లేదా..? అయితే ఇలా చేయండి

Telangana
Rs.500 Gas Cylinder |  తెలంగాణ ప్రభుత్వం ఎన్నిక‌ల హామీలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద‌ రూ.500ల‌కే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. ప్రజా పాలన కార్యక్రమంలో సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులకు ప్రస్తుతం ఈ పథకం కింద రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందుతోంది. అయితే సిలిండర్ ఇంటికి తీసుకొస్తే.. వినియోగదారులు పాత ధరనే చెల్లించాలి. మహాలక్ష్మీ పథకం లబ్ధిదారులైనా స‌రే పాత ధరనే చెల్లించాలి. సబ్సిడీ డ‌బ్బుల‌ను తర్వాత ప్రభుత్వం వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి జ‌మ‌ చేస్తుంది.కాగా మహాలక్ష్మీ పథకం లబ్ధిదారులు కొందరి అకౌంట్లలో వెంటనే డబ్బులు జమ కావటం లేద‌ని అనేక ఫిర్యాదులు వ‌స్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియ‌క‌ ఆందోళనకు గురవుతున్నారు. సిలిండర్ తీసుకున్న తర్వాత డబ్బులు జమ కాక‌పోతే 1967 లేదా 180042500333 నంబర్‌కు కాల్ చేసి పరిష్కరించుకోవచ్చునని అధికారులు సూచిస్తున్నారు. ఆ నెంబర్లకు కాల్ చేస్తే...
Property Tax Every Month | రాష్ట్రంలో ఇక‌పై ప్రతినెలా ఆస్తిపన్ను ?

Property Tax Every Month | రాష్ట్రంలో ఇక‌పై ప్రతినెలా ఆస్తిపన్ను ?

Telangana
ఆదాయాన్ని పెంచుకునేందుకు స‌ర్కారు క‌స‌ర‌త్తు Property Tax Every Month in Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. ఇక నుంచి ప్రతినెలా ఆస్తి ప‌న్ను చెల్లించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ప్రభుత్వ సేవలకు ప్రజలు చెల్లిస్తున్న ఫీజులు, పన్నులను మరింత సుల‌భ‌త‌రం చేయ‌డంపై తెలంగాణ సర్కార్ దృష్టిసారించింది. ప్ర‌జ‌ల‌పై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు, స్థానిక సంస్థలు, ఇతర శాఖల ఆదాయాన్ని పెంచే మార్గాల అన్వేషణ కోసం ప్రభుత్వం సిద్ధ‌మైంది.Property Tax in GHMC: ప్రభుత్వ సేవలకు ప్రజలు చెల్లిస్తున్న పన్నుల చెల్లింపుల ప్ర‌క్రియ‌ను తెలంగాణ ప్ర‌భుత్వం సుల‌భ‌త‌రం చేయాల‌ని భావిస్తోంది. ప్ర‌జ‌ల‌పై ఒక్క‌సారిగా ఆర్థిక భారం పడకుండా, స్థానిక సంస్థలు, ఇతర శాఖల ఆదాయాన్ని పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో పురపాలక, ఇతర ప్రభుత్వ శాఖలు కసరత్తు కూడా ప్రారంభించాయి. విద్యుత్తు ఛార్జీలు, నల్లా బిల్...
Hyderabad traffic police | సెప్టెంబరు 17న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆంక్ష‌లు

Hyderabad traffic police | సెప్టెంబరు 17న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆంక్ష‌లు

Telangana
Hyderabad Traffic Police Issue Advisory | గణేష్ నిమజ్జనోత్స‌వాల సంద‌ర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహ‌న‌దారులు, ప్ర‌జ‌ల‌కు ట్రాఫిక్‌ ఆంక్ష‌లు విధించారు. ఈనెల 17న‌ మంగళవారం ఉదయం నుంచి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, కొన్ని ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉందని పోలీసులు వెల్ల‌డించారు.కేశవగిరి, చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్స్, ఇంజన్ బౌలి, షంషీర్‌గంజ్, నాగుల్ చింతా, హిమ్మత్‌పురా, హరి బౌలి, ఆస్రా హాస్పిటల్, మొఘల్‌పురా, లక్కడ్ కోటే, పంచ్ మొహలా, పారిస్ కేఫ్, గుల్జార్ హౌస్, మిట్టి కమాన్ షేర్ వద్ద హైదరాబాద్ పోలీస్ పరిమితుల్లో ఆంక్షలు ఉంటాయి. ఉస్మాన్ బజార్, షెరాన్ హోటల్, మదీనా క్రాస్‌రోడ్స్, నయాపుల్, SJ రోటరీ, అర్మాన్ హోటల్, MJ బ్రిడ్జ్, దారుల్‌షిఫా క్రాస్‌రోడ్స్, సిటీ కాలేజ్, శివాజీ బ్రిడ్జి, అఫ్జల్‌గంజ్, పుత్లీబౌలి క్రాస్‌రోడ్స్, ట్రూప్ బజార్, జంబాగ్ క్రాస్‌రోడ్స్, ఆంధ్రా బ్యాంక్...
TGSRTC Bus Hire | ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకునేవారికి టీజీఎస్ఆర్టీసీ భారీ డిస్కౌంట్

TGSRTC Bus Hire | ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకునేవారికి టీజీఎస్ఆర్టీసీ భారీ డిస్కౌంట్

Telangana
TGSRTC Bus Hire Discount | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టిజిఎస్‌ఆర్‌టిసి ) వివాహాలు, కుటుంబ వేడుకలు, పార్టీలు మొదలైన వాటి కోసం అద్దెకు తీసుకున్న లేదా బుక్ చేసుకునే బస్సులపై ప్రత్యేక 10 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ తగ్గింపు డిసెంబర్ 31 వరకు అద్దె బస్సులపై మాత్రమే వర్తిస్తుంది.గతంలో కార్తీక మాసం, వనభోజనాలు, శబరిమల అయ్యప్ప యాత్ర‌ల‌, సమయంలో అద్దె లేదా కాంట్రాక్ట్ బస్సులకు ఆర్టీసీ రాయితీలు కల్పించింది . అయితే రానున్న పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయి అధికారులు 10శాతం రాయితీ కల్పించాలని నిర్ణ‌యించిన‌ట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. శుభకార్యక్రమాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ రాయితీని అందించినట్లు TGSRTC తెలిపింది.ప్రైవేట్ వాహనాల కంటే చాలా తక్కువ ధరలకు కార్పొరేషన్ బస్సులను అద్దెకు ఇస్తోంది. ముందస్తుగా నగదు జమ చేయకుండా...
MMTS: వినాయక నిమజ్జనం వేళ ఎంఎంటీఎస్‌ శుభవార్త.. 17, 18వ తేదీల్లో రాత్రి కూడా ప్రత్యేక రైళ్లు

MMTS: వినాయక నిమజ్జనం వేళ ఎంఎంటీఎస్‌ శుభవార్త.. 17, 18వ తేదీల్లో రాత్రి కూడా ప్రత్యేక రైళ్లు

Telangana
MMTS Special Trains : హైద‌రాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు ప్ర‌జ‌ల‌కు నిర్విరామంగా సేవ‌లందిస్తున్నాయి. వినాయ‌క నిమ‌జ్జ‌న వేడుక‌ల సంద‌ర్భంగా ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకొని తాజాగా రాత్రి నుంచి తెల్లవారుజూము వరకు కూడా ప్ర‌త్యేక స‌ర్వీస్ ల‌ను న‌డిపించేందుకు హైద‌రాబాద్ మెట్రో సిద్ధ‌మైంది. అయితే ప్ర‌త్యేక స‌ర్వీసులు రెండు రోజులకు మాత్రమే ప‌రిమితం చేయ‌నున్నారు. హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు వినాయ‌క‌ నిమజ్జనాలు కూడా వేగం పుంజుకున్నాయి. ఈ క్ర‌మంలోనే సెప్టెంబర్ 17, 18వ‌ తేదీల్లో భారీగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు. దీంతో ప్ర‌యాణికులు భారీగా పెర‌గ‌నున్నందున‌ ఆ రెండు రోజులు కూడా రాత్రి సర్వీసులు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ముఖ్యంగా నిమజ్జనకు నగరవాసులే కాదు.. స‌మీప జిల్లాల నుంచి కూడా భ‌క్తులు పెద్దఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు.ఇ...
Karimnagar New Railway Line | క‌రీంన‌గ‌ర్ – హ‌న్మ‌కొండ జిల్లాల‌ను క‌లుపుతూ కొత్త రైల్వే లేన్‌

Karimnagar New Railway Line | క‌రీంన‌గ‌ర్ – హ‌న్మ‌కొండ జిల్లాల‌ను క‌లుపుతూ కొత్త రైల్వే లేన్‌

Telangana
హ‌స‌న్ ప‌ర్తి రోడ్ స్టేష‌న్ క‌రీంన‌గ‌ర్ మ‌ధ్య రైల్వేలైన్ నిర్మాణంపై క‌ద‌లిక‌ Karimnagar - Hasanparthy Railway Line  | కరీంనగర్, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాల‌ను కలుపుతూ రెండో రైల్వే లైన్ నిర్మాణంపై క‌ద‌లిక వ‌చ్చింది. హనుమకొండ జిల్లా ప‌రిధిలోని లోని హసన్‌పర్తి రోడ్డు రైల్వే స్టేష‌న్ నుంచి కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌ మధ్య రైల్వేలైన్ కోసం రెండు జిల్లాల వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ రైలు మార్గంపై ఎట్ట‌కేల‌కు ఆశ‌లు చిగురిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ గ‌త మంగ‌ళ‌వారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. క‌రీంన‌గ‌ర్ రైల్వే లైన్ ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించ‌డ‌మే కాకుండా పనుల‌ను త్వరగా చేపట్టాలని కోరారు. దీనికి రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారువరంగల్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్లేందుకు ప్ర‌స్త‌తుం రోడ్డు మార్గ‌మే శ‌ర‌ణ్యం. నిత్యం వంద‌లాది ఆర్టీసీ బ‌స్స...
కొత్త‌గా నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్.. షెడ్యూల్, హాల్టింగ్ స్టేషన్లు ఇవే..

కొత్త‌గా నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్.. షెడ్యూల్, హాల్టింగ్ స్టేషన్లు ఇవే..

Telangana
Nagpur-Secunderabad Vande Bharat | నాగ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య కొత్త‌ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 15న ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు మంగళవారం మినహా ప్రతిరోజు సేవ‌లందించ‌నుంది. ప్రస్తుతం నాగ్‌పూర్ చేరుకోవడానికి ప్రయాణం 8 గంటలు పడుతుంది అయితే, కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వ‌స్తే.. ఇది 7 గంటల 15 నిమిషాలు పడుతుంది.ఈ రైలు నాగ్‌పూర్ నుంచి ఉదయం 5:00 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించి మధ్యాహ్నం 12:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 1:00 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 8:20 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. టైమ్‌టేబుల్‌లో స్వల్ప సర్దుబాట్లు ఉండవచ్చ‌ని గ‌మ‌నించాలి.ఈ రైలుకు సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లార్షా, రామగుండం, కాజీపేట స్టేషన్లలో హాల్టింగ్ సౌక‌ర్యం క‌ల్పించారు. తగ్గనున్న ప్రయాణ సమయం ఈ కొత్త...
TGSRTC New Buses | తీరనున్న ప్రయాణికుల కష్టాలు.. ఆర్టీసీలో కొత్త బ‌స్సుల కొనుగోలు

TGSRTC New Buses | తీరనున్న ప్రయాణికుల కష్టాలు.. ఆర్టీసీలో కొత్త బ‌స్సుల కొనుగోలు

Telangana
Hyderabad | తెలంగాణ‌లో ప్ర‌జల డిమాండ్ కు త‌గిన‌ట్లుగా కొత్త బ‌స్సుల కొనుగోలు (TGSRTC New Buses) కు ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు. పెరిగిన ర‌వాణా అవ‌స‌రాలు, నూత‌న మార్గాల‌ను ప్ర‌తిపాదికగా బ‌స్సుల కొనుగోలుపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని చెప్పారు. రాష్ట్ర స‌చివాల‌యంలో టీజీ ఆర్టీసీపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం స‌మీక్షించారు. మ‌హిళ‌లు మ‌హాల‌క్ష్మి ప‌థకాన్ని వినియోగించుకుంటున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అద్భుతంగా అమ‌లవుతోంద‌ని.. ఇప్ప‌టివ‌ర‌కు 83.42 కోట్ల మంది మ‌హిళ‌లు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణం చేశార‌ని తెలిపారు. దీనిని బ‌ట్టి మ‌హిళా ప్ర‌యాణికుల‌కు రూ.2,840.71 కోట్లు ఆదా అయింద‌ని రాష్ట్ర ర‌వాణా, బీసీ సంక్షేమ‌ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్‌ తెలిపారు.టిజి ఆర్టీసీలో 7,29...