Friday, January 23Thank you for visiting

Telangana

telangana hyderabad andhrapradesh india telugu telugumemes mumbai kerala tollywood delhi chennai instagram warangal hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata

Adani Foundation | రాష్ట్ర ప్రభుత్వానికి అదానీ గ్రూప్ 100 కోట్ల విరాళం..

Adani Foundation | రాష్ట్ర ప్రభుత్వానికి అదానీ గ్రూప్ 100 కోట్ల విరాళం..

Telangana
Adani Foundation | హైదరాబాద్:  పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ  మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి భారీ విరాళాన్ని ప్రకటించారు. అదానీ గ్రూప్‌నకు (Adani Group) చెందిన అదానీ ఫౌండేషన్ ద్వారా ఏకంగా రూ.100 కోట్ల విరాళం అందించారు.  ఈ మేరకు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి రూ.100 కోట్ల చెక్కును శుక్రవారం హైదరాబాద్‌లో అందించారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.యువతలో నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ (Young India Skills University) కి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని గౌతమ్ అదానీ  హామీ ఇచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారితో పాటు పలు...
తెలంగాణ‌లో 9 యూనివ‌ర్సిటీల‌కు వీసీల నియామ‌కం..

తెలంగాణ‌లో 9 యూనివ‌ర్సిటీల‌కు వీసీల నియామ‌కం..

Telangana
Osmania University | రాష్ట్రంలోని తొమ్మిది యూనివ‌ర్సిటీల‌కు వైస్ ఛాన్స‌ల‌ర్ నియ‌మించింది. తెలంగాణ ప్ర‌భుత్వం. వీసీల నియ‌మాక ఉత్వ‌ర్వుల‌పై గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ సంత‌కం చేశారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తిగా కుమార్, కాక‌తీయ యూనివ‌ర్సిటీ వీసీగా ప్ర‌తాప్ రెడ్డి, తెలంగాణ యూనివ‌ర్సిటీ వీసీగా యాద‌గిరి రావు, తెలుగు యూనివ‌ర్సిటీ వీసీగా నిత్య‌నంద‌రావు, మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ వీసీగా అల్తాఫ్‌ హుస్సేన్, పాల‌మూరు యూనివ‌ర్సిటీ వీసీగా జీఎన్ శ్రీనివాస్, శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ వీసీగా ఉమేశ్ కుమార్, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ వీసీగా అల్దాస్ జాన‌య్య‌, కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం వీసీగా ప్రొఫెస‌ర్ రాజిరెడ్డి నియ‌మితుల‌య్యారు.తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అ...
TGSRTC | ఆర్టీసీ టికెట్ ధ‌ర‌ల పెంపుపై వీసీ స‌జ్జ‌నార్ ఏం చెప్పారంటే..

TGSRTC | ఆర్టీసీ టికెట్ ధ‌ర‌ల పెంపుపై వీసీ స‌జ్జ‌నార్ ఏం చెప్పారంటే..

Telangana
TGSRTC | బ‌తుక‌మ్మ, ద‌స‌రా పండుగ నేప‌థ్యంలో ఆర్టీసీ టికెట్ ధ‌ర‌లు పెంచింద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదని టీజీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ (Sajjanar) స్ప‌ష్టం చేశారు. జీవో ప్ర‌కారం స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే చార్జీల‌ను సంస్థ స‌వ‌రించింది. రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు.ప్ర‌ధాన పండుగులైన సంక్రాంతి, ద‌స‌రా, రాఖీ పౌర్ణ‌మి, వినాయ‌క చ‌వితి, ఉగాది, త‌దిత‌ర స‌మయాల్లో హైద‌రాబాద్ నుంచి ప్ర‌యాణికులు ఎక్కువ‌గా సొంతూళ్ల‌కు వెళ్తుంటారు. ఈ సంద‌ర్బాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్య స్థానాలకు చేరవేసేందుకు స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను ఆర్టీసీ యాజ‌మాన్యం నడుపుతోంది. ప్ర‌యాణికుల‌ రద్దీ మేరకు హైద‌రాబాద్ సిటీ బ‌స్సుల‌ను కూడా జిల్లాల‌కు న‌డిపిస్తుంటుంది. తిరుగు ప్ర‌యాణంలో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఉండ‌క‌పోవ‌డంతో ఖాళీగా ఆ బ‌స్సులు వెళ్తుంటాయి...
Hyderabad MMTS : గ్రేట‌ర్ లో భారీగా త‌గ్గిన‌ ఎంఎంటీఎస్ సర్వీసులు.. .

Hyderabad MMTS : గ్రేట‌ర్ లో భారీగా త‌గ్గిన‌ ఎంఎంటీఎస్ సర్వీసులు.. .

Telangana
Hyderabad MMTS | తక్కువ చార్జీతో ఎక్కువ దూరం ప్రయాణించాల‌నుకుంటున్న హైద‌రాబాద్ వాసుల‌కు చుక్కెదుర‌వుతోంది. ఎంఎంటీఎస్ ప్రయాణికులకు క్ర‌మంగా దూరం అవుతోంది. నానాటికీ సర్వీసులు తగ్గిపోతుండ‌డంతో ఉద్యోగులకు, సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు ఎదురవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్) ప్రాజెక్టును ఓ వైపు విస్తరిస్తూనే, మరోవైపు ఎంఎంటీఎస్ సర్వీసుల‌ను త‌గ్గిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఎంఎంటీ ఎస్ రైళ్లపై ప్రయాణికు్లో విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. ఇందుకు కార‌ణం.. తక్కువ ధ‌ర‌లో ఎక్కువ దూరం ప్రయాణించే వీలు ఈ లోక‌ల్ ట్రైన్స్ వ‌ల్ల క‌లుగుతుంది. కరోనాకు ముందు రోజూ 175 సర్వీసులతో రెండున్నర లక్షలమందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర‌వేసిన ఎంఎంటీఎస్ రైళ్లు.. ఇప్పుడు సుమారు వంద సర్వీసులకు పైగా తగ్గి 70 వరకు నడుపుతోంది. ప్ర‌తిరోజు సుమారు 50 ...
Hyderabad | రాష్ట్రంలో ప‌త‌న‌మ‌వుతున్న‌ రియ‌ల్ ఎస్టేట్..

Hyderabad | రాష్ట్రంలో ప‌త‌న‌మ‌వుతున్న‌ రియ‌ల్ ఎస్టేట్..

Telangana
Hyderabad | రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం (Real Estate)  నష్టాల్లో కూరుకుపోతోంది. ఆస్తుల‌ను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ముందుకు రావ‌డంలేదు. బిల్డర్లు, డెవలపర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలను చేప‌ట్ట‌డంలేదు. తాజాగా కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CREDAI ) తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాల్సిన అనేక సమస్యలను నివేదించింది. ఆగస్టులో కొన్ని సూచనలు చేసింది, అయినప్పటికీ ఎటువంటి పురోగతి లేదని క్రెడాయ్ పేర్కొంది. జిల్లాల్లో లేఅవుట్‌లకు అనుమతులు మంజూరు చేయడంలో విపరీతమైన జాప్యంపై రియల్ ఎస్టేట్ వ‌ర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి , రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరైన కార్యక్రమంలో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. జిల్లాల్లో అనుమతుల మంజూరులో జా...
Mumbai to Kazipet Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్ ముంబై నుంచి కాజీపేట‌కు 26 ప్ర‌త్యేక రైళ్లు..

Mumbai to Kazipet Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్ ముంబై నుంచి కాజీపేట‌కు 26 ప్ర‌త్యేక రైళ్లు..

Telangana
Mumbai to Kazipet Trains | దసరా, దీపావళి, ఛత్ పండు గల సమయంలో ప్రయాణికులకు సాఫీగా ప్రయాణించేందుకు వీలుగా అదనపు ప్రత్యేక రైలు స‌ర్వీస్ ల‌ను ప్రవేశపెడుతున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ పీక్ సీజన్‌లో ప్రయాణికుల ర‌ద్దీని తగ్గించి వారికి సౌక‌ర్య‌వంత‌మైన ప్రయాణాలను అందించేందుకు ఈ ప్ర‌త్యేక రైళ్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు పేర్కొంది.సెంట్రల్ రైల్వే.. ముంబై నుంచి కాజీపేటకు 26 అదనపు ప్రత్యేక రైలు సర్వీసులను నిర్వహిస్తోంది. రాబోయే పండుగలను జరుపుకోవడానికి ప్రయాణించే ప్రయాణీకులకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. రైలు షెడ్యూల్: 07196 / 07195 దాదర్-కాజీపేట వీక్లీ స్పెషల్ (10 సర్వీసులు)దాదర్ నుంచి కాజిపేట‌ : అక్టోబర్ 17, 2024 నుంచి నవంబర్ 28, 2024 వరకు ప్రతీ గురువారం మధ్యాహ్నం 3:25 గంటలకు, మరుసటి రోజు మధ్యాహ్నం 12:50 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. కాజీపేట నుంచి దాద‌ర్‌ : అక్టోబర్...
Group 1 Mains Hall Tickets | ఈనెల 14 నుంచి గ్రూప్ 1 మెయిన్స్‌ హాల్‌ టికెట్లు..

Group 1 Mains Hall Tickets | ఈనెల 14 నుంచి గ్రూప్ 1 మెయిన్స్‌ హాల్‌ టికెట్లు..

Telangana
Group 1 Mains Hall Tickets | TGPSC  గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు నిర్వ‌హించేందుకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా త్వరలోనే హాల్‌ టికెట్లను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్‌సీ ప్రకటించింది. ఈ నెల 14న టీజీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులోకి ఉంచుతామ‌ని, అభ్యర్థులు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఒక‌ ప్రకటనలో పేర్కొంది.ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష హాల్‌లోకి మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నారు.ఇక గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ ఏడాది జూన్‌ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్‌ నిర్వహించగా 3.02లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భ...
New Traffic Rules: రాష్ట్రంలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇలాంటి తప్పులు చేస్తే లైసెన్స్ రద్దు!

New Traffic Rules: రాష్ట్రంలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇలాంటి తప్పులు చేస్తే లైసెన్స్ రద్దు!

Telangana
New Traffic Rules | తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలను తీసుకువచ్చింది. ప్రస్తుతం ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రహదారులను విస్తరిస్తుండడంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సారథి  వాహన్ పోర్టల్‌పై సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్  (Minister Ponnam Prabhakar) సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక విషయాలను వెల్లడించారు. సారథి వాహన్ పోర్టల్‌ (Sarathi Portal) లో తెలంగాణ రాష్ట్రం కూడా చేరుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.28ను అమలు చేసిందని చెప్పారు. 12 నెలల్లోనే రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాలను కంప్యూటరైజ్డ్ చేశామని తెలిపారు. ప్రైవేటు వాహనాల వలంటరీ స్క్రాపింగ్ పాలసీ (Scrappage Policy ) కింద కొత్త వాహనాలు కొనుగోలు చేసేటపుడు ట్యాక్స్  లో మినహాయింపు ఇస్...
TGSRTC Special Buses | బతుకమ్మ, దసరా పండుగలకు 6304 ప్రత్యేక బస్సులు :

TGSRTC Special Buses | బతుకమ్మ, దసరా పండుగలకు 6304 ప్రత్యేక బస్సులు :

Telangana
TGSRTC Special Buses | రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సంద‌ర్బంగా ప్రయాణిల ర‌ద్దీకి అనుగుణంగా పెద్ద సంఖ్య‌లో ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్ల‌డించారు. మహాలక్ష్మీ పథకం కారణంగా గత ఏడాది దసరాతో పోలిస్తే ఈ సంవత్స‌రం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే అదనంగా 600 ప్రత్యేక బస్సులను నడప‌నున్న‌ట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 6304 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తాయని తెలిపారు.దసరా పండుగ ఆపరేషన్స్‌పై హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో పోలీసు, రవాణా శాఖ అధికారులతో టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భేటీ అయ్యారు. దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆర్టీసీ...
Hydra: హైడ్రాకు.. అద‌న‌పు బలం.. ఇక నేరుగా రంగంలోకి

Hydra: హైడ్రాకు.. అద‌న‌పు బలం.. ఇక నేరుగా రంగంలోకి

Telangana
Hydra News : హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీకి (హైడ్రా) ను మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా మార్చేందుకు వీలుగా బల్దియా చట్టంలో కొత్త సెక్షన్‌ చేర్చుతూ ప్ర‌భుత్వం ఆర్డినెన్స్‌ జారీ అయింది. దీనికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ కూడా ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించి శనివారం రాజ్‌భవన్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ కోసం క‌బ్జాదారుల‌కు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టడం, అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం వంటి అధికారాలతో ప్రభుత్వం నూత‌న సెక్షన్‌ను రూపొందించింది. దానిని జీహెచ్‌ఎంసీ చట్టంలో చేర్చి, తద్వారా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సమకూరే అధికారాలను హైడ్రాకు కూడా బ‌దలి చేయాల‌ని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలకు మరింత సమయం ఉండటంతో.. ఆ నిర్ణయాన్ని తక్షణం అమల్లోకి తెచ్చేందుకు ఆర్డినెన్స్‌ జారీ ...