Telangana Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. టాప్ త్రీ జిల్లాలు ఇవే..
Telangana Inter Results : తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు (TS Inter Results-2024) విడుదలయ్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, బోర్డు కార్యదర్శి శ్రుతి వోజా ఇంటర్ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరాలకు సంబంధించి ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.
బాలికలదే హవా
ఇంటర్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం పరీక్షలకు మొత్తం 4.78 లక్షల విద్యార్థులు హాజరు కాగా, అందులో 2.87 లక్షల మంది పాస్ అయ్యారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలకు మొత్తం 5.02 లక్షల మంది హాజరు కాగా, 3.22 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఈసారి కూడా బాలుర కంటే బాలికలే ముందున్నారు. బాలికలు ఫస్టియర్ లో 68.35 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 51.5 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ బాలికల కేటగిరీలో 72.53 శాతం మంది ఉత్తీర్ణులు కాగా.. బాలుర కేటగిరీలో 56.1 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.
జిల్లాల వారీగా.. టాప్ త్రీ
ఇంటర్ ఫస్టియర్
- రంగారెడ్డి జిల్లా 71.7 శాతం
- మేడ్చల్ జిల్లా 71.58 శాతం
- ములుగు జిల్లా 70.01
సెకండ్ ఇయర్ ఫలితాలు
- ములుగు జిల్లా 82.95 శాతం
- మేడ్చల్ జిల్లా 79.31 శాతం
- రంగారెడ్డి జిల్లా 77.63 శాతం
గ్రూప్‌ల వారీగా..
ఫస్టియర్ MPC లో 68.52 శాతం, BiPC లో 67.34 శాతం, CEC లో 41.73 శాతం, HEC 31.57 శాతం, MEC 50.51 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ సెకండియర్ MPC లో 73.85 శాతం, BiPC లో 67.52 శాతం, CEC లో 44.81 శాతం, HEC లో 43.51 శాతం, MEC లో 59.93 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లు అయిన https://tsbie.cgg.gov.in/, http://results.cgg.gov.inలో కూడా ఫలితాలను చూసుకోవచ్చు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..