తెలంగాణలో రోజు వారీ ఖర్చులకి కూడా డబ్బుల్లేవు.. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

తెలంగాణలో రోజు వారీ ఖర్చులకి కూడా డబ్బుల్లేవు..  ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

Telangana Assembly Sessions: తెలంగాణలో ఆర్థికి స్థితిగతులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవని, వేర్వేరు మార్గాల ద్వారా అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై సభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించారు.
Telangana Assembly Sessions అసెంబ్లీలో 42పేజీల శ్వేత పత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. దాన్ని సభ్యులందరికీ అందజేసింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పు రూ.6 లక్షల 71 వేల 757 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. 2014-15 నాటికి ఈ అప్పు 72 వేల 658 కోట్లు ఉండేదని, ఈ పదేళ్ల కాలంలో ఆ అప్పు 24.05 శాతం పెరిగిందని వివరించింది. 2023-24లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రకారం.. రాష్ట్ర అప్పు రూ.3 లక్షల 89వేల 673 కోట్లకు చేరనుందని అంచనా వేసిందని పేర్కొంది.. 2015-16 లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతం ఉందని, ఇది దేశంలోనే అత్యల్పమని పేర్కొంది. అది ఇప్పుడు 27.8 శాతానికి పెరిగిందని వివరించింది. బడ్జెట్ వ్యయానికి, వాస్తవ వ్యయానికి ఎంతో తేడా ఉందని సుమారు 20 శాతం వ్యత్యాసం ఉన్నట్టు పేర్కొంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రుణభారం 10 రెట్లు పెరిగినట్టు వెల్లడించింది. 42 పేజీల నివేదికను ఇప్పుడే చదివి చర్చలో పాల్గొనాలంటే ఎవరికైనా కష్టమని సభ్యులు అభ్యంతరం చెప్పడంతో.. టీ బ్రేక్ ఇచ్చారు. దీంతో సభ వాయిదా పడింది.

READ MORE  Heat Waves | మూడు రోజులు ప‌లు జిల్లాల్లో వడగాలులు..! పలుచోట్ల వ‌ర్షాలు

న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి

శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలు..

  • తెలంగాణ రాష్ట్ర మొత్తం అప్పులు ₹6,71,757 కోట్లు
  • 2014-15 నాటికి రాష్ట్ర రుణం రూ.72,658 కోట్లు
  • 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం పెరిగిన రుణం
  • 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పు రూ.3,89,673 కోట్లు
  • 2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం
  • 2023- 24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ శాతం
  • బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం
  • 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి ₹4.98 లక్షల కోట్ల వ్యయం
  • రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం
  • రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిన రుణ చెల్లింపుల భారం
  • రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం
  • రోజూ వేస్‌ అండ్‌ మీన్స్‌పై ఆధారపడాల్సిన దుస్థితి
  • 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. 2023లో అప్పుల్లో కూరుకుపోయింది.
  • బడ్జెటేతర రుణాలు భారీగా పేరుకుపోయి అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రం.
READ MORE  Telangana Rains : నేడు తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

READ MORE  Rakhi: తెలంగాణ ప్రజలకురాఖీ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *