ప్రభుత్వ సమాచారం ఇక నేరుగా మీ వాట్సాప్‍కే.. ఇలా ఫాలో అవ్వండి
Telangana CMO WhatsApp channel : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడానికి అధునాతన సాంకేతిక మాధ్యమాలను ఉపయోగించుకునే పనిలో పడింది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంఓ) వాట్సాప్ చానెల్ (WhatsApp) ను ప్రారభించింది. ఈ చానెల్ ద్వారా ప్రభుత్వం సీఎంవో నుంచి వెలువడే ప్రకటనలను ప్రజలకు చేరవేస్తుంది.
ఈ ఛానెల్ ద్వారా ప్రభుత్వ ప్రకటనలు, ముఖ్య సమాచారాన్ని సాధారణ ప్రజలకు వేగంగా చేరేలా చేస్తుంది. CMO ఛానెల్ ద్వారా ప్రజలు CMO నుండి తాజా అప్ డేట్స్ ను చూడవచ్చు.
CMO వాట్సాప్ ఛానెల్‌ని IT డిపార్ట్‌మెంట్ లోని డిజిటల్ మీడియా విభాగం, ముఖ్యమంత్రి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కార్యాలయం (CMPRO) నిర్వహిస్తుంది. QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా ప్రజలు ఛానెల్‌లో చేరవచ్చు.
CMO ఛానెల్‌లో ఇలా చేరవచ్చు.
1. WhatsApp అప్లికేషన్ తెరవండి.
2. మొబైల్ ఫోన్ వాట్సప్ లో “Updates” క్లిక్ చేయండి.
3. డెస్క్‌టాప్ సిస్టంలో అయితే “Channels” ట్యాబ్ క్లిక్ చేయండి
4. ‘Find Channels’ ను క్లిక్ చేయండి.
5. టెక్స్ట్ బాక్స్‌లో TELANGANA CMO అని టైప్ చేయండి
6. పేరు పక్కన ఉన్న గ్రీన్ టిక్ ఎంచుకోండి.
7. ఆపై ఛానెల్‌లో చేరడానికి “Follow” బటన్‌ను క్లిక్ చేయండి.
కింద ఇచ్చిన QR Code ను స్కాన్ చేయడం ద్వారా కూడా తెలంగాణ సీఎంఓ వాట్సాప్ చానెల్ లో నేరుగా చేరవచ్చు..