Saturday, August 30Thank you for visiting

Telangana Budget 2025 – 26 | ₹3.04 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ .. శాఖల వారీగా కేటాయిపులు ఇవే..

Spread the love

Hyderabad : ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ₹ 3.04 లక్షల కోట్లతో బడ్జెట్‌ (Telangana Budget 2025 – 26) ను ప్రవేశపెట్టారు. 2025-26 సంవత్సరానికి మొత్తం ₹ 3,04,965 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు, ఇందులో ₹ 2,26,982 కోట్లు రెవెన్యూ వ్యయం కోసం, ₹ 36,504 కోట్లు మూలధన వ్యయం కోసం కేటాయించారు.
“తెలంగాణను 10 సంవత్సరాలలో 1,000 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం 200 బిలియన్ డాలర్లు” అని అన్నారు. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత కింద పింఛన్ల పంపిణీ వంటి అనేక పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు.

Telangana Budget 2025 – 26 వివిధ శాఖలకు ప్రతిపాదిత కేటాయింపులు:

  • పశుసంవర్ధక శాఖ: ₹ 1,674 కోట్లు
  • పౌర సరఫరాల శాఖ: ₹ 5,734 కోట్లు
  • విద్యా శాఖ: ₹ 23,108 కోట్లు
  • పంచాయతీరాజ్ – గ్రామీణాభివృద్ధి శాఖ: ₹ 31,605 కోట్లు
  • మహిళా శిశు సంక్షేమ శాఖ: ₹ 2,862 కోట్లు
  • యువజన సేవల శాఖ: ₹ 900 కోట్లు
  • షెడ్యూల్డ్ కులాల సంక్షేమం: ₹ 40,232 కోట్లు
  • షెడ్యూల్డ్ తెగల సంక్షేమం: ₹ 17,169 కోట్లు
  • వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ: ₹ 11,405 కోట్లు
  • చేనేత వస్త్రాలు: ₹ 371 కోట్లు
  • మైనారిటీ సంక్షేమ శాఖ: ₹ 3,591 కోట్లు
  • పరిశ్రమల శాఖ: ₹ 3,527 కోట్లు
  • సమాచార సాంకేతిక విభాగం: ₹ 774 కోట్లు
  • ఇంధన శాఖ : ₹ 21,221 కోట్లు
  • ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ: ₹ 12,393 కోట్లు
  • మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్: ₹ 17,677 కోట్లు
  • నీటిపారుదల & కమాండ్ ఏరియా అభివృద్ధి శాఖ: ₹ 23,373 కోట్లు
  • రోడ్లు & భవనాల శాఖ: ₹ 5,907 కోట్లు
  • పర్యాటక శాఖ : ₹ 775 కోట్లు
  • క్రీడా శాఖ: ₹ 465 కోట్లు
  • అడవులు & పర్యావరణ శాఖ: ₹ 1,023 కోట్లు
  • ఎండోమెంట్స్ విభాగం: ₹ 190 కోట్లు
  • హోం శాఖ: ₹ 10,188 కోట్లు.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *