
Telangana Govt | తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ కొత్త రూల్స్-2025 విడుదల
డిజిటల్ మీడియాకు లైన్ క్లియర్!హైదరాబాద్, డిసెంబర్ 22: రాష్ట్రంలోని జర్నలిస్టుల చిరకాల వాంఛ నెరవేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కొత్త అక్రిడిటేషన్ నిబంధనలను ఖరారు చేసింది. 2016 నాటి పాత నిబంధనలను రద్దు చేస్తూ, ప్రస్తుత మారుతున్న మీడియా కాలానికి అనుగుణంగా G.O.Ms.No.252ను జారీ చేసింది. ముఖ్యంగా డిజిటల్ మీడియాను కూడా గుర్తిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.కొత్త జీవోలోని ముఖ్యాంశాలు:1. డిజిటల్ మీడియాకు గుర్తింపు: తొలిసారిగా వెబ్‌సైట్లు, డిజిటల్ న్యూస్ మీడియాకు అక్రిడిటేషన్ నిబంధనలు ఖరారు చేశారు.గత 6 నెలలుగా నెలకు కనీసం 5 లక్షల మంది విజిటర్స్ (Unique Visitors) ఉండాలి.ఈ విభాగంలో గరిష్టంగా 10 అక్రిడిటేషన్ కార్డులు మాత్రమే మంజూరు చేస్తారు.2. కార్డుల విభజన:అక్రిడిటేషన్ కార్డు: క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ చేసే రిపోర్టర్లకు ఇది గుర్...









