
BSNL BiTV Service | ఇప్పుడు మీ మొబైల్‌లో ఉచితంగా 300+ టీవీ ఛానెళ్లను వీక్షించండి..
BSNL BiTV Service | BSNL వినియోగదారులు ఇప్పుడు ఎటువంటి ఖర్చు లేకుండా తమ మొబైల్ ఫోన్లలో 300కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లను ఆస్వాదించవచ్చు.గత నెలలో పుదుచ్చేరిలో ట్రయల్ లాంచ్ అయిన తర్వాత కంపెనీ తన డైరెక్ట్-టు-మొబైల్ టీవీ సర్వీస్, BiTV, భారతదేశం అంతటా అందుబాటులోకి తీసుకొచ్చింది. OTT అగ్రిగేటర్ OTT Play సహకారంతో, ఈ కొత్త సర్వీస్ వినియోగదారులకు వారి స్మార్ట్‌ఫోన్‌లలోనే వివిధ రకాల ప్రముఖ OTT కంటెంట్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది.BiTV అధికారిక లాంచ్ కు సంబంధించి BSNL తన అధికారిక X హ్యాండిల్‌లో పోస్ట్ ద్వారా ధృవీకరించింది. BiTV ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిందని కంపెనీ ప్రకటించింది, వినియోగదారులు ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ నిరంతరాయంగా అధిక-నాణ్యత కంటెంట్, వినోదం కోసం సిద్ధంగా ఉండమని వెల్లడించింది.ఈ కార్యక్రమాన్ని BSNL CMD, A రాబర్ట్ J రవి ఆవిష్కరించారు. OTT సేవల యుగంలో సాంప్రదా...