
Sim Cards | తెలుగు రాష్ట్రాల్లో 71,000 సిమ్ కార్డులను బ్లాక్ చేసిన ప్రభుత్వం
Sim Cards | ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గత 90 రోజుల్లో 71,000 కంటే ఎక్కువ సిమ్ కార్డుల(SIM cards)ను టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT - Department Of Telecommunication ) బ్లాక్ చేసింది. ఈ సిమ్ కార్డులు మోసపూరిత మార్గాల ద్వారా జారీ అయ్యాయని, ప్రధానంగా మోసాలకు ఉపయోగించారని నివేదికలు చెబుతున్నాయి. చాలా వరకు మోసగాళ్ళు తప్పుడు గుర్తింపు కార్డులతో ఈ సిమ్ కార్డులను తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ నేరస్థులు పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్లను ఉపయోగించి అక్రమంగా సిమ్ కార్డులను పొందారని అధికారులు చెబుతున్నారు. ఈ కార్డులను కొనుగోలు చేయడానికి నకిలీ గుర్తింపు కార్డులను ఉపయోగించారని, వ్యక్తుల నుంచి కోట్లాది రూపాయలను మోసం చేశారని వెల్లడించారు.సంచార్ సాథీ పోర్టల్, వెబ్‌సైట్ ద్వారా లేదా 1930కి కాల్ చేయడం ద్వారా సిమ్ సంబంధిత మోసాలను అరికట్టడానికి సహాయపడాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. అధికారుల ప్రకారం, బాధితులు మ...