
UN చీఫ్ పై ఇజ్రాయిల్ ఆగ్రహం.. తమ దేశానికి రాకుండా నిషేధం.. కారణం ఏమిటి?
Middle East crisis | ఇరాన్ దాడిని ఖండించని వారెవరికైనా తమ దేశంలో అడుగుపెట్టే అర్హత లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ( UN chief Antonio Guterres ) ను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఈమేరకు తమపై ఇరాన్ చేసిన దాడిని ఐరాస్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఖండించలేదని ఇజ్రాయెల్ విదేశాంగశాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ పేర్కొన్నారు.ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకారం, ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడిని, అక్టోబర్ 7న హమాస్ దాడులను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఖండించలేదని ఆరోపించారు. అందుకే ఆయను దేశంలోకి రాకుండా నిషేధించించినట్లు వెల్లడించారు... ఈ చర్యలను ఖండించలేని ఎవరైనా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించే అర్హత లేదని కాట్జ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి చీఫ్ మద్దతు ఉన్నా లేకున్నా తమ దేశ పౌరుల...