Astrology Signs | ఈ వారంలో 12 రాశులవారికి శుభ ఫలితాలు ఇవే..
Astrology Signs | ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తారు. 2024 మే 19 ఆదివారం నుంచి మే 25 శనివారం వరకు ఈ వారం రోజుల్లో రాశిఫలాలు (Astrology ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు
మేష రాశి
మేష రాశి (Aries) వారికి ఈ వారం (19'th May - 25’th May) లో నూతన విద్యను అభ్యసించే విద్యార్థులకు యోగ కాలం. మంచి నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబ పరమైన సమస్యలు ఉండను. భూమికి సంబంధించిన పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల విషయాల్లో తల దూర్చడం వల్ల అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. దాంపత్య పరమైన సమస్యలు ఉండును. వ్యాపార విస్తరణ కోసం ధన వ్యయం చేయాల్సి వస...